28, ఫిబ్రవరి 2011, సోమవారం

వాళ్ళు అన్నదమ్ములుగానే ఉంటారు "మీకే పిచ్చి "

పిచ్చి అభిమానం పిచ్చి చేష్టలు ......అభిమానం హద్దు మీరితే ..వెర్రి అభిమానం అవుతుంది .....తన అభిమాన హీరో గురించి గోరంత కొండంత గా చెప్పుకోవచ్చు తప్పు లేదు .అంతే కాని ఇతర తారల గురించి ..అవహేలంగా ...వేళాకోళంగా ..మరింత పచ్చిగా మాట్లడం మాత్రం మంచిది కాదు . మధ్య తమకు నచ్చని తారల గురించి చాల దారుణంగా
కొందరు వ్యహరిస్తున్నారు . ఇంటర్నెట్ లో రాయలేని విధంగా కామెంట్ చెయ్యడం ,ఎస్ ఎం ఎస్ లు పంపడం ......చెడు అలవాటుగా మారింది ....సినిమా వచ్చినపుడు సరదాగా సెటైర్లు వేసుకోవడం సహజం ..కాని అది పనిగా ....చాల చెత్త మాటలతో పాటు "మార్పింగ్ " చేసి నెట్ లో పెట్టడం చేస్తున్నారు .ఎంత బాధపడి ఉంటే యువరత్న బాల కృష్ణ పిర్యాదు
చేసి ఉంటారో అర్ధం చేసుకోవచ్చు .ముఖ్యంగా చిరు -బాలయ్య కుటుంబాల హీరోలు గురించే ఎక్కువగా "పిచ్చి అభిమానులు "పిచ్చపనులు చేస్తున్నారు .వీరిలో ఎక్కువగా ప్రవాస తెలుగు వారు ఉండడం దురదృష్టకరం . నెట్ వల్ల
ప్రపంచంలోని అన్నిప్రాంతాల వారు దగ్గర అవుతున్నారు .అయితే కొందరు వెర్రి వాళ్ళు చేసే వికృత పనులకు ఎంతో మంది భాద పడుతున్నారు .. దురాచారం భవిష్యత్ లో కనిపించరాదు .
ఇంతకి మరొక విషయం ఏమిటంటే సినిమాలు తారలు అందరూ అన్నదమ్ములుగానే ఉంటారు .

27, ఫిబ్రవరి 2011, ఆదివారం

."కొండవీటి రాజా-కోట లో రాణి " రియాలిటి షో .లో ఏ విలువలు ఉంటాయి ?

తెలుగు లో జీ టి వి వారు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ."కొండవీటి రాజా-కోట లో రాణి " రియాలిటి షో .
అయితే ఎంత వరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి .రెండు నెలల పాటు ఒక కోట లో పది జంటలు చేసి విన్యాసాలు
ఎలా ఉంటాయన్నది ఆసక్త్తికరం. హాలిహుడ్ టి వి లో వచ్చిన శిల్ప శెట్టి వంటి వారు పాల్గున్న రియాలిటి షో తరహాలో
కార్య క్రమానికి రూపకల్పన చేసినట్లు కనిపిస్తోంది .అడివిలో పుట్టిన యువకులను ఏరి కోరి తెచ్చారు .వారిని మోడరన్ గా మార్చడానికి టౌన్ పడతులను ఎంపిక చేసారు . ప్రస్తుతం వాళ్ళు కోట లో ఎంటరై తిండి .అమ్మాయిలు ఎలా తినాలో
నేర్పుతున్నారు ...సెలబ్రిటిగా హీరిఒన్ సదా వచ్చి డాన్సు పెట్టింది .....ఇంకేమి చేయిస్తారో ..చేయబోతున్నారు చూడాలి .అయితే తెలుగు అమ్మాయిల నైతిక విలువలు నిలబెట్టే విధం గా కార్యక్రమం కొనసాగితే పర్వాలేదు కాని .. మాత్రం
తేడా వచ్చినా మంచిది కాదు .

"ఇంకా జీతాలు అందలేదు " రేపు రా !!!

భార్య -ఆదివారం పూట రెస్ట్ తీసుకోకుండా ...అట్ట, స్కెచ్లు
పట్టుకుని హైరానా పడుతున్నారు -
భర్త -నీ మొహం ! ఇది ఆఫీసు పని కాదు .మన పనే ....
నెల జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు ....
పాలవాడునీళ్ళవాడు ,పేపరోల్లు రోజు యేమని చెబుతాం .
.అందుకే "ఇంకా జీతాలు అందలేదు " అనే బోర్డు తయారు
చేసి గుమ్మంముందు పెడతా
,

అది తింటే పులి దొరుకుతుంది నాన్న 1

చింటు -ఏంటి నాన్న! అందరు అక్కడే చూస్తున్నారు ?
రవి -చిరుత పులి ఇంట్లోకి వచ్చిందట . పట్టుకోవడానికి అధికారులు
చూడడానికి ప్రజలు వచ్చారు .
చింటు -ఓస్ అంతేనా !....దానిని నీను ఈజీగా పట్టుకుంటాను .
రవి - ఎలాగండి బాబుగారు ?
చింటు -ఏముంది నాన్న ! నిన్న నువ్వు చేసిన స్వీట్ ఒకటి
కిటికీ లోంచి వేస్తే ...అది తినగానే రాత్రి అమ్మ కళ్ళు తిరిగి
పడిపోయినట్టు పులి కూడా పడిపోతుంది

26, ఫిబ్రవరి 2011, శనివారం

ఆంధ్రజ్యోతి తో రామ్ గోపాల్ వర్మ

అప్పలరాజు సినిమా లో తానూ వాయిస్ ఓవర్ లో చెప్పిన మాట "ఇది కామిడి కాదు ..ట్రేజడి" అని చెప్పడం ఫన్నిగా
చెప్పను తప్ప.ట్రేజడి అని కాదు ....అని రాము చెప్పారు .ఈరోజు ఆంధ్రజ్యోతి చానల్ లో కొద్దిసేపు వర్మ తో చర్చ జరిగింది .
ఈ వర్మ హిట్టా ? ఫట్టా ? పేరుతో మూర్తి వర్మతో ముచ్చటించారు .తానూ ఎప్పుడో మాటల్డిన మాటలు కూడా ఇప్పుడు
లౌడ్ స్పీకర్ లో మీడియా ఎక్కువగా చూపిస్తోందని చెప్పారు .ఈ చర్చలో కేవలం "అప్పలరాజు సినిమా గురించే
మాట్లాడారు . ఏ రంగం లో నైన మంచి చెడు ఉంటుందని ...అలాగే సినిమా ,మీడియా లోను మంచివారు ,చెడ్డవారు
ఉంటారని చెప్పుకొస్తు ..........అందరిపైన సరదాగా సెటైర్లు వేశామని ..అప్పలరాజు తన కోణం లో కామిడి సినిమా అని
వర్మ వివరించారు .

సెల్ వాడితే మెదడు చురుగ్గా పని చేస్తుందట !

"సెల్ ఫోన్లో మీరు ఇష్టం వచ్చినంత సేపు మాట్లాడు కోవచ్చు .
బ్రెయిన్ పై విధమైన రేడియేసన్ ఉండదు .పైగా మెదడు
చురుగ్గా పని చేస్తుందట ." సరికొత్త విషయం చెప్పింది
సామాన్యులు కాదు . ఆమెరికా హెల్త్ ఇన్స్టిట్యూట్ వారు
చెప్పారు ....ఇదే నిజమైతే ఇక చెవిలోంచి ఎవ్వరు సెల్
తియ్యరు .

"ప్రేమ కావాలి " లో విశేషాలు -

నిర్మాణపరంగా మంచి సాంకేతిక పరిజ్ఞానం తో నిండిన
"ప్రేమ కావాలి " ఏది లోటుగాఉన్నదీ సినిమా చూసిన
ఎవ్వరైనా యిట్టె చెప్పేస్తారు . దర్సకత్వ లోపం తీవ్రంగా ఉంది .
అంతర్ జాతీయ తీవ్ర వాది ని కుర్రాడు హతం చెయ్యడం
ఏదో సిల్లిగా చేసినట్టు నవ్వు తెప్పిస్తుంది ....దేవగిల్ లాంటి విలన్
ను తీసు కుని క్లైమక్ష్ను తుస్సు మనిపించారు.హీరో పాత్ర బావున్న
కథనం బాగా లేదు .వర్మ రాసిన సంబాషణలు మాత్రం ఆకట్టుకుంటాయి .
విశేషాలు -
ఫోటోగ్రఫి ...చోటనాయుడు కొత్త ప్రదేశాలు చక్కగ్గా చిత్రీకరించాడు
పాటలు - అను సంగీతం సూపర్ .. తరానికి మంచి సంగిత దర్శుకుడు అవుతాడు ....తెర పై మాత్రం అంతంతే
మాటలు - వర్మ రాసిన మాటలు ......సింపుల్ గా సరదాగా ఉన్నాయి .
ఫైట్స్ - కొన్ని భావున్నై ..మరికొన్ని ఫర్వాలేదు .
హాట్ సాంగ్ -వాన పాట కుర్రకారుకు కిక్ ఇస్తుంది ...హీరొయిన్ అందాలు తనివి తీరా చూడవచ్చు
హీరొయిన్ -నవ్వినప్పుడే భావుంది .మాటలకు ఫీలింగ్స్ లేవు .నటన కొంతే .
హాస్యం -ద్వితీయార్దం లో బ్రమ్మానందం ,ఆలి ,ఎం ఎస్ నారాయణ కామిడి .....ఆవరేజ్ .
కథనం - ఆసక్తి ,ఆత్రుత ప్రేక్షకుడికి రాదు .
హీరో -డైలాగ్స్ ,డాన్సు ఫైట్స్ ఓకే .....కాని ఫిజిక్ మారాలి .
గెస్ట్ రోల్ -జయసుధ ,నాగ బాబు
కొత్త విషయం - గుడి చుట్టూ నూట ఎనిమిది సార్లు ప్రదిక్షనాలు చేస్తే కళ్ళు తిరిగి పడతారు కాబట్టి
" ఒన్-నాట్ -ఎయిట్ " అంబులేన్సుకు పేరు పెట్టారు అని చెప్పడం

25, ఫిబ్రవరి 2011, శుక్రవారం

లడ్డు లాంటి హీరొయిన్ తో ప్రేక్షకుల "ప్రేమ కావాలి " అంటే ఎలా ?

తన కుమారుడు "ఆది " ని తొలి సినిమాతోనే స్టార్ ను
చెయ్యడానికి డబ్బింగ్ కింగ్ సాయికుమార్ చిన్న తప్పు
చేసినట్టు కనిపిస్తోంది .ప్రేమ కావాలి సినిమా ఈరోజు
విడుదల అయ్యింది . సినిమాకు హీరొయిన్ గా కాజల్ లేదా
ఇలియానా అనుకున్నారు .వీరిన పెడితే కొత్త వచ్చిన హీరో
ఫోకస్ కారని ....ఇషా ను హీరొయిన్ గా తీసుకున్నారు .అయితే
లడ్డు లాంటి ఆమె అది పక్కన నప్పలేదని ప్రేక్షకుల కామెంట్ .
అది సన్నగా లేత కుర్రాడిలా ....చలాకీగా కనిపిస్తే .....ఇషా
మాత్రం ఎబ్బట్టుగా కనిపించింది .ఒక నవ్వినప్పుడు తప్ప
సినిమాలో కథానాయిక ఫీలింగ్స్ ఆమెలో కనిపించలేదు .
"కాజల్ కాకపోయినా ....కాజల్ లాంటి ఫిజిక్ గల హీరొయిన్
అయితే సినిమాకు ప్లస్ అయ్యేది .నువ్వే కావాలి
సినిమాలో లవేర్బోయ్ తరుణ్ పక్కన చక్కటి చుక్క
లాంటి రిచా ను సెలక్ట్ చేసుకున్న దర్శుకుడు విజయ్
బాస్కర్ సైతం హీరొయిన్ ఎంపిక లో తడబడినట్టు
తెలుస్తోంది .
ఇక హీరో ఆది విషయానికి వస్తే కుర్రాడు చాల చలకిగానే
కనిపించాడు .డైలాగ్ డెలివరి ....యాక్షన్ బాగానే ఉన్నాయి .
డాన్సు చాల కస్టపడి చేసిన ఎందుకో కొన్ని చోట్ల వెలితిగా
ఉంది .ఫిజిక్ కాస్త మార్పు చేస్తే మరింత బావుంటాడు .మొదటి
సినిమా కాబట్టి విజాయాపజయాలు తో నిమిత్తం లేకుండా
మరింత మంచి కథలు ఎంచు కుని తన టేలెంట్ నిరూపించుకోవాలి .

"ప్రేమ కావాలి "తెర వెనుక కథ ???

డైలాగ్ కింగ్ సాయికుమార్ కొడుకు హీరో గా ఈరోజు "ప్రేమ
కావాలి " విడుదల అవుతోంది .అయితే ఈ చిత్రం వెనుక
చాల కసరత్ జరిగింది .సినిమా రంగం లో ఎన్నో ఇబ్బందులు
ఎదుర్కున్న సాయి తన కొడుకు విషయం లో చాలా జకర్ట్ట
పడ్డాడు .కొడుకు త్వరగా హీరో కావాలని ఆశించిన ..ఆచి తూచి
అడుగు వేసాడు .డాన్సు ,డైలాగ్ ,నటన ,నైతిక విలువలు వంటి
వాటిపై మంచి శిక్షణ ఇప్పించాడు .హీరొయిన్ విషయంలోనూ
జాగ్రత పాటించాడు .చిత్రం లో ముందుగ కాజల్ ,ఇలియానా ,జెనిలియా
లను తీసుకుందామని చెప్పిన సాయి ఒప్పుకోలేదట .కొత్త గా హీరో
గ ఎంటర్ అవుతోన్న కొడుకును డామినేట్ చేశారని చెప్పారట .
షూటింగ్ కు కూడా సాయి పూర్తిగా దూరంగా ఉంది కొడుకు
ప్రేమ కథ కు ఫ్రీడం ఇచ్చారట ......మంచి లవర్ బాయ్ గా కనిపిస్తున్న
అది మంచి హీరో గా ఎదగాలని ఆశిద్దాం .

24, ఫిబ్రవరి 2011, గురువారం

ప్రస్తుత ప్రభుత్వం కోపాగ్నిలో కొట్టుకు పోతుంది -జగన్

ప్రస్తుత ప్రభుత్వం కోపాగ్నిలో కొట్టుకు పోతుందని జగన్
జోష్యం చెప్పారు జగన్ మోహన్ రెడ్డి ఏడు రోజుల నిరాహార దీక్ష విరమించిన తర్వాత ప్రభుత్వం పై
నిప్పులు చెరిగారు ." ప్రతి పేదవాడు చదువుకుంటే ఆ కుటుంబం బాగు పడుతుందని
దివంగత నేత వై ఎస్ ఆర్ ఫీజ్ చెల్లించే మంచి పధకం ప్రవేశపెడితే ...దానిని నీరు కార్చిందని
బడ్జెట్ ప్రవేశ పెట్టేటప్పుడు అయిన కనీసం తగిన నిధులు కేటాయిస్తుందని .....ప్రభుత్వం పై
ఒత్తిడి తేవడానికి వారం రోజుల దీక్ష చేసానని .....అయితే బడ్జెట్ లో కేటాయించిన సొమ్ము
బకాయలకే సరిపోదని అంటూ .......వచ్చే సంవత్స్వరం లో పాతిక లక్షల విద్యార్దుల
భవిష్యత్ ఏమిటని ప్రశ్నించారు .

వాళ్ళు లేక పోతే ప్రభుత్వానికి డబ్బులు ఎలా వస్తాయి ?డాడి.

చింటు -నాన్న! మందు తాగే వారిని తిడతారు .ఎందుకు ?
తండ్రి -అది మంచి అలవాటు కాదు కాబట్టి .
చింటు - బ్రాంది ,సారా వంటివి అమ్మడం వల్లే మన రాష్ట్రానికి
ఎక్కువ ఆదాయం వస్తుందని పేపర్లో చూసాను .మరి
వాళ్ళు లేక పోతే ప్రభుత్వానికి డబ్బులు ఎలా వస్తాయి ?
కాబట్టి వాళ్ళు మంచి వారేనేమో డాడి.

మరి నేను హాస్టల్ ఉంటున్నప్పుడు ..అది

చింటు -(ఫోన్లో )డాడి! హోం వర్క్ అంటే ఏమిటి ?
తండ్రి -ఇంటి దగ్గర చేసే వర్క్ ..ఏం
చింటు -అవును కదా ....మరి నేను హాస్టల్
ఉంటున్నప్పుడు ..స్కూల్లో హోం వర్క్
చెయ్యడం లేదని కొడుతున్నారు .
.అడుగు డాడ్ (((
తండ్రి -(((((

23, ఫిబ్రవరి 2011, బుధవారం

అది లేక పోతే పిల్ల నివ్వారా ?

రాము -ఒరే! అది లేక పోతే పిల్ల నివ్వారని చెప్పారట .
ఇప్పటికే ఎన్నో సంబందాలు చెడిపోయాయి
ఇలాగయితే మనోడికి పెళ్లి అవుద్దా ?
సోము -చచ్చినా అవ్వదు . కాబట్టి మనేమే ఏదో ఒకటి చెయ్యాలి
రాము -అయితే ఏం చేద్దాం?
సోము -కనీసం ఆపరేషన్ చేయించినా కొన్నాళ్ళ వరకు పెరగదు !
రాము -పోనీ కొత్తగా వచ్చిన ఆయిల్ రాస్తే .......
సోము -నెత్తి మీద ఉన్న ఉన్న రెండు వెంట్రుకలు ఊడి మొత్తం బోడి గుండు అవుతుంది

టి వి నైన్ తో ఆడుకోవడానికి వర్మ రడీ

రామ్ గోపాల్ వర్మ కు పిచ్చెక్కింది .పైత్యం పట్టుకుని
పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తున్నాడు .అప్పలరాజు
అట్టర్ ప్లాప్ .ప్రేక్షకులు అంటే అసలు గౌరవం లేదు .
పబ్లిసిటి తప్ప సినిమా తీయడంలో శ్రద్ధ లేదు ....పిచ్చి
వర్మ అంటున్నారు ......................." ఇవన్ని నేను
అంటున్న మాటలు కాదు .సాక్షాత్తు టి వి నైన్ తెలుగు
చానల్ వారు లైవ్ గా ప్రసారం చేసిన కామెంట్లు .
బహుశా తెలుగు టి వి చానల్ ల చరిత్ర లోనే ఓ సినిమా
డైరెక్టర్ గురించి ఇంత ఘాటుగా కామెంట్ చెయ్యడం
ప్రధమం కావచ్చు .సాధారణం ఎంత చెత్త సినిమా అయిన
దాని గురించి టి వి లలో చాల రోజుల వరకు చర్చించారు .
వర్మ తాజా చిత్రం పరమ చెత్త అని చెబుతూ పైగా దిని పై
చర్చ జరగడం విశేషం . ఈరోజు ఏడు గంటలకు
మొట్టమొదటి వార్తగా వర్మ ను ఏకి పడేసారు .
మొదట్లో తెలుగులో శివ ,హిందీ లో రంగీల ,కంపెని
వంటి హిట్ సినిమాలు తీసి ...తర్వాత "షోలే " ను
చెడకొట్టి తర్వాతా పిచ్చిగా సినిమాలు తీయడం
అలవాటు అయ్యిందని .....యెడ పెడ వ్యాఖ్యానాలు
వెలువడ్డాయి .అంతే కాదు ..ప్రతి విషయానికి పబ్లిసిటి
తో స్టూడియో లు చుట్టూ తిరగడం అలవాటు అయ్యిందని
అలేగే సినిమాలో తెర వెనుక వ్యాఖ్యానాల పిచ్చి ముదిరిందని
....వర్మ తీరు తో టి వి నైన్ చెడుగుడు ఆడుకుంది
అయితే టి వి నైన్ తో ఆడుకోవడానికి వర్మ
రడీ అయ్యారు .చాన్నాళ్ పై పరువు నష్టం దావా వేసారు .
"ప్రేక్షకులు ......""అంటూ తాను వ్యాఖ్యానించినట్టు
గాటుగా అల్లిన పదజాలం బేస్ చేసుకుని లావ్ పాయింట్ తో
తన గౌరవానికి భంగం కల్గినట్టు ఆరోపిస్తూ ....కోర్టుకు వెళుతున్నారు
మరి "రవి ప్రకాష్ " ఎలా వర్మ ను దారికి తెచ్చుకుంటారో .....రవి నే
వర్మ దారిలో పెడతారో వేచిచూడవలసిందే

22, ఫిబ్రవరి 2011, మంగళవారం

తల్వార్ కోరినట్టు ఆ "కసాయి " బహిరంగ ఉరికి అనుమతించి సగటు భారతీయుల కోరిక తీర్చాలి

కసాబ్ ' పేరు వింటే చాలు ప్రతి భారతీయుడు
రక్తం ఉడికిపోతుంది .ఎంతో మంది ని కసాయంగా
కాల్చివేసిన మానవ మృగం ను మనం ఇంకా
న్యాయం ,చట్టం పేరుతో రాచమర్యాదలు
చేస్తున్నాం .అది మన దౌర్భాగ్యం .ఎట్ట కేలకు
మృగాని అంతమొందించే ఛాన్స్ వచ్చింది .
ఉరి తీర్పు ఖరారు అయ్యింది .అయితే కసాబ్ ను
బహిరంగం ఉరి తీయాలన్న డిమాండ్ ఉన్నా
కోర్టులో విషయం లేదు .కాగా ఉరి తీసే "తల్వార్ "
మాత్రం చేసిన ప్రకటన ఆనందాని కల్గిస్తోంది .
తనకు కసాబ్ ను బహిరంగంగా ఉరి తీయడానికి
అనుమతి ఇవ్వమని అడగడం ద్వారా " ప్రతి
భారతీయుడు కోరుకున్న ఉరి కాంక్ష " అతిని
మాటల్లో వ్యక్తం అయ్యింది .తల్వార్ చెప్పినట్టు
కసాబ్ ను ఉరి తీస్తే అందరికి ఆనందమే .అలాగే
అక్రమంగా భారత్ గడ్డ పై అడుగు పెట్టె వాడికి
కనీసం భయం పుట్టాలి .

నాన్న! అమ్మ మళ్ళి పెళ్లి చేసుకుంటాదట

చింటు -నాన్న! అమ్మ మళ్ళి పెళ్లి చేసుకుంటాదట
నాన్న -అమ్మ సినిమా నటి కదా ..అది ఉత్తిత్తి పెళ్లి రా
చింటు - నువ్వు లేనప్పుడు డైరెక్టర్ అంకుల్ మన ఇంటిదగ్గర
అమ్మను ముద్దు పెట్టుకుంటూ ఉంటారు ..అది ఉత్తిదేనన్నమాట
నాన్న - ((((((((((((

"ఐస్ " చేసి ....తర్వాత ఏం చేస్తావో చార్మి ?





వామ్మో ఈ స్తిల్ల్స్ చూస్తుంటే తేడగానే కనిపిస్తోంది . ముందు "ఐస్ " చేసి తర్వాత తన విశ్వ రూపం
చూపిస్తోంది ...అందం అభినయం తో ఈ "మంగళ " అవతారం చార్మి ని చార్జింగ్ చేస్తుందేమో !

Do you want "TWINS" ? Drink it ."ఆ చెరువు లో నీళ్ళు తాగితే కవల పిల్లలు ఖాయం "

నేడు కవలల దినోత్సవం . సందర్భంగా మీకు
వింత విషయం అందిస్తున్నాను ." చెరువు లో
నీళ్ళు తాగితే కవల పిల్లలు ఖాయం " .నేటి కంప్యూటర్
యుగంలోనూ ఇలాంటి నమ్మకాలు ఏంటి? అంటే
చెప్పలేరు కాని జరుగుతున్నా పరిణామాలు పుట్టుకలు
గమనిస్తే నీటిలో ఏదో అద్భుతం ఉందని అనుకోవచ్చు .
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి సుమారు పాతిక
కిలోమీటర్లు దూరంల్లో దొడ్డిగుంట అనే గ్రామం ఉందట .
(రంగం పేట మండలం ). గ్రామం లో చెరువు ఉంది .
చెరువులో నీళ్ళు తాగిన వారికి చాలామందికి కవల
పిల్లేలే పుడుతున్నారు .గ్రామంలో ఇప్పటివరకు ఎనబై
కు పైగానే "కవల లు " ఉన్నారట . ఇటీవల కొన్నాళ్ళ
క్రితం మాస్టర్ గారు గ్రామానికి బదిలి పై వచ్చి
గ్రామస్తులు చెరువు విశిష్టత గురించి చెబితే నమ్మలేదట .
చివరకు చెరువు నీరు తాగిన ఆయన భార్య కవలలకు
జన్మ నివ్వడం తో ఆశ్చర్య పోయాడట .... నీటి లో ఏదో
మహత్తు ఉందని ...శాస్త్రీయంగా పరిశోదన చేస్తే నీటి
గురిచి తెలుసుకోవచ్చునని అంటున్నారు .ఎవరైనా
ఆసక్తి గలవారు దీనిపై పి హెచ్ డి కూడా చేయవచ్చు .