18, ఫిబ్రవరి 2011, శుక్రవారం

"చెరువు లో నీళ్ళు ఉన్నాయని నమ్మి పంట వేస్తే .....పొట్ట దశలో గండి పడినట్టు ......" సర్కార్ పై అపనమ్మకం కల్గుతోంది

ఎంత తెలివైన వాడైనాఈరోజు పేద విద్యార్ది తన చదువు
పూర్తి అవుతుందన్న నమ్మకం లేదు ...తాజా పరిస్థితులు
చూస్తుంటే "చెరువు లో నీళ్ళు ఉన్నాయని నమ్మి పంట
వేస్తే .....పొట్ట దశలో గండి పడినట్టు ......" సర్కార్ పై
అపనమ్మకం కల్గుతోంది .ఉన్నత చదువులు ఆశించే
తెలివైన పిల్లలకు ప్రభుత్వ పరంగా చాలా ప్రయోజనం
కల్గుతోంది .ముఖ్యంగా పేద పిల్లల ఫీజులు ప్రభుత్వమే
చెల్లించే పథకం ఎండికో ఆశాదీపంగా ఉంది .అయితే
సర్కార్ పెడుతున్న మెలికలతో తల్లితండ్రులు తల్లడిల్లు
తున్నారు .విధ్యార్దులలోను ఆందోళన ......తాజాగా
ఈరోజు మరో విషయం ఈనాడులో వచ్చింది .ట్రిపుల్
టి లకు తగిన నిధులు లేవని కేవలం ఇంజనీరింగే
ఉంటుందని ...ఇంటర్ వరకు కార్పోరేట్ కాలేజి లో
చదివించాలని నిర్ణయమని ...సారాంశం. ఇవన్ని
చూస్తుంటే అసలు ఉన్న రాయితీలు ఉంటాయా?
అన్న అనుమానం కలగక మానదు .....కనీసం
పేదవాడి కొన్ని పథకాలైన మిగలాలి అంటే ..
వాటిని రాజ్యాంగం లో చేర్చి ....అమలు అయ్యే
విధంగా చూడాలేమో .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి