12, ఫిబ్రవరి 2011, శనివారం

మూఢ విశ్వాసం "వద్దు "-మానసిక ప్రశాంతతే "ముద్దు "(దివ్య జ్యోతుల్లో వెలుగు చూడండి ..కాని ....)

ఎంత శాస్త్ర విజ్ఞానం పెరిగిన మత విశ్వాసం,నమ్మకాలు
మన జీవితంలో పెన వేసుకున్నవి .సౌఖర్యవంతమైన
సాధనాలు ,పరికరాలతో నిత్యం "యాంత్రిక జీవితం "
సాగిన్స్తున్న మనకు నిజంగా ప్రశాంతత ,మనశ్శాంతి
కల్పిస్తున్నవి మన విశ్వాసాలు ,నమ్మకాలే .అయితే ...
మతం పిచ్చి ముదిరి మూడ విశ్వాసం తో ..మూర్ఖంగా
వ్యవరిస్తే అది మంచిది కాదు .నాడు పెద్దలు పండగలు ,
పబ్బాలు ,పవిత్రత (శుబ్రత),ఉపవాసాలు ,సూర్య నమస్కారాలు ,
ధూపం , ఆహార నియమాలు ,ప్రదిక్షణాలు,బంధుత్వం ,సెంటిమెంట్
వంటివి పెట్టక పోతే మన వ్యవహారాలు,జీవితాలు ఎలా ఉండేవో
హించు కుంటేనే భయం వేయక తప్పదు
.ఒక పక్క శాస్త్రీయ
విజ్ఞాన ఫలాలు అనుభవిస్తూనే మరో పక్క మన మంచి ఆచార
సంప్రదాయాలు పాటించడం మంచిది .
నేడు "దివ్య జ్యోతుల " పేరుతో అటు భక్తులకు ,ఇటు జన
విజ్ఞాన వేదిక వారికి వాదనలు జరుగుతున్నాయి .ఆలయంల్లో
వెలిగిన దివ్య జ్యోతి దేవుడు మహిమ అని భక్తులు అంటే .....కాదు
శాస్త్రీయ విజ్ఞానం భౌతిక నియమాల ప్రకారం వస్తువు అడ్డు
వచ్చినపుడు కెమెరాలో అల కనిపిస్తుంది అని జే వి వి వారు
నిజం నిరుపిస్తమంటున్నారు..దీనిపై లైవ్ షో లు .........ఎవరి
వాదన వారిది .......ఒక హిందువుడి గా ...విజ్ఞాన వంతుడిగా
ఎవ్వరు ఇద్దరి వాదనలు కాదన లేరు ........అయితే ఏదో
పబ్లిసిటి కోసం .....మతం ను అడ్డుపెట్టుకుని ..మాయలు
చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం దానిని ఖండించాలి .
శబరి మల జ్యోతి మానవ సృష్టి అని అందరికి తెల్సి పోయింది .
జ్యోతి దర్శనం కోసం వెళ్లి ప్రాణాలు పోగుట్టుకున్న సంఘటన
మర్చి పోలేక పోతున్నాం .........ఇలాంటివి మున్ముందు జరగకూడదు .
ఆలాగే మానసిక ప్రశాంతత ఇచ్చే పవిత్ర ఆలయమైన మనకు అవసరమే .


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి