29, ఆగస్టు 2011, సోమవారం

తియ్యనైన తెలుగును అంతర్జాలం ద్వారా విశ్వవ్యాప్తి చేస్తున్న తెలుగు బాగార్లు అందరికి నా అభినందనలు .వీక్షకులు ప్రత్యేక ధన్యవాదములు ....మనలోని భావాలను చక్

తియ్యనైన తెలుగును అంతర్జాలం ద్వారా విశ్వవ్యాప్తి చేస్తున్న తెలుగు బాగర్లు అందరికి నా అభినందనలు .వీక్షకులు ప్రత్యేక ధన్యవాదములు ....మనలోని భావాలను చక్కగా మన మాతృభాష లోనే పంచుకుందాం .

25, ఆగస్టు 2011, గురువారం

దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రం విద్యార్దుల్లో ప్రతిభ వెలికి తీయడానికి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది .ఈ కార్యక్రమానికి "శాస్త్ర "

దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రం విద్యార్దుల్లో ప్రతిభ వెలికి తీయడానికి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది . కార్యక్రమానికి "శాస్త్ర " అని పేరు పెట్టారు.సేకరించిన సమాచారం ప్రకారం .. .సాధారణంగా జరిగే క్విజ్ వంటి కార్యక్రమాలకు భిన్నంగా విద్యార్దుల్లో దాగి ఉన్న శాస్త్రీయ అవగాహన ,అనువర్తనాలు వంటివి తెల్సు కోవడానికి దీనికి వేదిక గా చేసుకున్నారు .శాస్త్ర లో మొత్తం మూడు రౌండ్లు ఉంటాయి .మొదటి రౌండ్ లో "అవగాహన " లో అయిదు ప్రశ్నలు యాబై మార్కులు .రెండవ రౌండ్లో "పరిశోధన " రౌండ్ లో విద్యార్ది చేసిన సైన్సు ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఇరవై మార్కులుకు ఉంటుంది .మూడవ రౌండ్ లో "పరిశీలన " లో ఒక దృశ్యాన్ని చూపించి లీడా ప్రయోగం చేసి... దానిలో ఉన్న సైన్సు సంగతి అడుగుతారు ......ఎక్కువ మార్కులు వచ్చిన వారు ఎపిసోడ్ విన్నర్ అవుతారు ...వచ్చే నెల లో కార్యక్రమం దూరదర్శన్ సప్తగిరి లో ప్రసారం కానుంది .ప్రతి శనివారం సాయిత్రం మరియు ఆదివారం శాస్త్ర ప్రసారం చేయడానికి సన్నాహాలు చేస్తునట్టు తెలుస్తోంది .మంచి కార్యక్రమాన్ని ఎన్నుకున్నందు నిర్వాహకులకు అభిననదనలు చెప్పవల్సిందే .

14, ఆగస్టు 2011, ఆదివారం

మన జాతీయ పర్వదినం రోజు టూరులా?

సెలవు అనేసరికి ఎవ్వరికైనా హుషారు తెస్తుంది .వరసగా సెలవు వస్తే ఇక ప్రణాళికలు..టూర్లు ..అయితే గొప్ప రోజులను సెలవుగా తీసుకోవడం మంచిది కాదు .శుక్రవారం నుంచి వరుసగా సెలవలు వచ్చాయ్.దీంతో చాలామంది కుటుంబ పరంగా టూర్ వేసున్నారు .అయితే మన జాతీయ పర్వదినం రోజు కూడాకొంత మంది ఉద్యోగులు కాని ..ఇతరులు కాని జాతీయ జండా కార్య క్రమానికి హాజరు అవుతారా? లేదా ? అన్నది డౌటే .ఎందరో మహనీయుల త్యాగఫలం అందిన ఆగస్ట్ పదిహేను పెద్ద పండుగ గా జరుపు కోవాలి .పిల్లలలో అవగాహన కల్పించి దేశ భక్తీ నింపాలి ....

13, ఆగస్టు 2011, శనివారం

అయ్యా !బ్రహ్మ్మయ్య !! మూస హాస్యంలో ఉండిపోతే ఎలా ?

బ్రమ్మానందాన్ని సినిమాలో చూసిన ఏమున్నది ? పేరు మార్పు తప్ప అంత పాత చింతకాయ పచ్చేడే తప్ప అనుకునే రోజులు రావడం దురదృష్టం .మనకు ఉన్న హాస్య నటుల్లో బ్రహ్మ నందం గొప్ప వారు .పద్మ బిరుతాంకితుడు.గిన్నిస్ విజేత .తెలుగు జాతి కి వన్నె తెచ్చినవాడు ..ముఖం చూస్తేనే నవ్వు వస్తుంది .అలాంటి నటుడు మూస లో ఉండిపోవడం భాదాకరం .ప్రేక్షకులు తమ అభిమాన నటుల నుంచి కొత్తదనం కోరుకోవడం సహజం .అయితే మన బ్రహ్మ విషయం లో ఒకే మూస పాత్రలు ఉంటున్నాయి." బ్రహ్మ గారికి వీక్నెస్ ఉంటుంది .అది హీరో గారు కనిపెట్టి అది వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసి .......తన్నుతూ ఉంటాడు ...పాపం బట్టబుర్ర తో మన బ్రహ్మ హీరో తో తన్నులు తింటూ మనల్ని నవ్విస్తాడు ." ప్రతి సినిమా లోనూ ఇదే తంతు . కొన్ని సినిమాల్లో మరీను ........
మన బ్రహ్మ్మనందం గారికి ఒకేటే మనవి ...అయ్యా ! తమరు మూస నుంచి బయట పడి సరికొత పాత్రలతో మమ్మల్ని నవ్విస్తారని ఆశిస్తున్నాం.