24, జూన్ 2011, శుక్రవారం

అన్నం వండనని..అమ్మొ,పెళ్ళామో స్ట్రైక్ చేసినట్లు అన్నదాతలు .....

అన్నం వండనని..అమ్మొ,పెళ్ళామో స్ట్రైక్ చేస్తే ఏమి అవుతుంది ? వామ్మో ! ఊహించుకోవడానికే భయం వేస్తుంది ...అలాంటిది పంట పండించి అన్నం పెట్టె అన్నదాతలు ?మేం పండించ లేము ....అని కూర్చుంటే ..ఏముంది ? తినడానికి తిండి కరువు ...పలు జిల్లాల్లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించడం ఆందోళన కల్గించే అంశం .తమ న్యాయమైన కోరికలు తీర్చాలని వారు కోరుతున్నారు .సర్కార్ దీనిపై స్పదించక పోవడం మరి దారుణం .....అన్నదాతల ఆందోళనలు ప్రభుత్వం అర్ధం చేసుకుని సమస్య పరిస్త్కరించాలి .మన దేశం లో ఇప్పటికే పంట పండించే వారు తగ్గి పోతున్నారు ....దీంతో విదేశి ఆదాయం వచ్చే ఎగుమతులు ఆగి మనేమే దిగుమతి చేసుకోవలసిన పరిస్తితి వచ్చింది ,,,,..క్రాప్ హాలిడేలు వస్తే ఇక అంతే సంగతులు !

20, జూన్ 2011, సోమవారం

' సత్య సాయి బాబా ' సినిమా లో ట్రస్ట్ సభ్యుల వ్యహారాలు ఎలా తీయ బోతున్నారు

భగవాన్ గా ప్రసిద్ది చెందిన ' సత్య సాయి బాబా ' సినిమా కోడి రామకృష్ణ తెరకు ఎక్కిన్స్తున్నారు .సత్య సాయి మహిమలు భక్తులు ఆరాధనా ,సాయి గొప్పతనం ఉంటాయి అని ...ఇంటర్ నేషనల్ స్తాయిలో సినిమా తీస్తున్నామని దర్శకుడు కోడి వెల్లడించారు ...మరి సత్య ఆస్తుల గొడవ ఉంటుందా ? ట్రస్ట్ సభ్యుల వ్యహారాలు ఎలా తీయ బోతున్నారు అనే విషయం ఆసక్తి కల్గిన్స్తుంది .....వాటి జోలికి కోడి వెళ్తారా ?

13, జూన్ 2011, సోమవారం

ఫస్ట్ రోజునే స్కూలికి వెళ్లావు ?

తండ్రి -ఏరా ఫస్ట్ రోజునే స్కూలికి వెళ్లావు ? ఏమి చెప్పారు ?
కొడుకు -శుబ్రత -పరిశుబ్రత నేర్పారు నాన్న ....

ఎవరు ఎవరి సినిమాను కాపి కొట్టారో తెలియాలి''శక్తి -బద్రినాథ్ ''

బద్రీనాథ్ చూసిన ఎవ్వరికైనా అనుమానం వస్తుంది .శక్తి సినిమా చూసి బద్రినాథ్ తయారు అయ్యిందా ? బద్రినాథ్ కథ ముందే పసిగట్టి 'శక్తి " తీశారా? కేత్ర పాలకుడు ,సంరక్షకుడు అంశం తో కథ అటు ఇటు ఒకలాగే ఉన్నాయి .ఎట్తోచి ఎన్ టి ఆర్ 'శక్తి ' లో కొన్ని క్షే తరలాల చుట్టూ ప్రదిక్షణలు చేయిస్తే ....అర్జున్ బద్రినాథ్ లో
రెండు క్షేత్రాలకు పరిమితం చేసారు .దేవాలయాలకు కాపలా,గుడి తలుపులు మూసి తెరవడం ...హీరొయిన్ ని కాపడం ..ఇలాంటి పోలికలు పై రెండు సినిమాల్లో చాలానే ఉన్నాయి .బద్రినాథ్ ను చిన్ని కృష్ణ రాసారన్నారు ...శక్తి కథ ను నల్గురు రాసారని వినికిడి ...... ఒకే సమయం లో ఇలాంటి పెద్ద సినిమాలు ఒకే రకంగా రావడం విచిత్రమే ..పైగా భారి బడ్జెట్ లు ..కథ లో బలం లేక పోతే ....కథ కంచికే ..అన్నట్టు సినిమా ఉంటుందని పై రెండు సినిమాల పరిస్థితి చూసి చెప్పవచ్చు ..పాపం ఎన్ టి ఆర్ ..అల్లు అర్జున్ లు ఎంత కసిగా చేసిన లాబం ఏమి ? ఇప్పటికైనా కుర్ర హీరోలు వీర లెవెల్లో సీన్స్ గురించి ఆలోచించకుండా ..కథను నమ్ముకుంటే బావుంటుంది

2, జూన్ 2011, గురువారం

నిశ్చితార్దం జరిగిందా ఇక అంతేరో ...ఆ మాటలకు అంటూ లేదు

సెల్ ఫోన్ లో ఎక్కువగా మాట్లాడేవారు ఎవరు అంటే "యూత్ " అని టక్కున చెబుతారు ..అయితే వారిలో చాల ఎక్కువగా దారుణం గా మాట్లాడుకునేది మాత్రం పెళ్లి కుదినవారే .పెళ్లి చూపులు జరిగిన తర్వాత పెళ్లి జరిగే వరకు వీళ్లా మధ్య జరిగే సంభాషణలకు అంతూ పొంతూ లేదు .....ఆగకుండా రెండు నుంచి మూడు గంటలు మాట్లాడేవారు ఉన్నారంటే అతిశయోక్తి లేదు .మొన్న మధ్య టీచర్ గారికి పెళ్లి నిశ్చితార్దం జరిగింది ...టీచర్ ట్రైనింగ్ లో ఆమె కు ఉదయం పదకొండున్నరకు పెళ్లి కొడుకు నుంచి ఫోన్ వచ్చిదంటే ......మళ్ళి రెండున్నర వరకు అల మాట్లాడుతూనే ఉందట .మధ్యలో భోజనం చేస్తూనే మాటలు ..ఇది చూసిన వారు ..అసలు ఇంత సేపు ఏమి మాట్లాడుకున్నారు ? అని ఆశ్చర్యపోవడం చూసిన వారు వంతయింది ...ఇలాంటివి ప్రతి చోట ఉన్నాయి ...పెళ్లి కుదరగానే ....అమ్మాయి గారికి ఫోన్ కొని ఇవ్వడం తో తతంగం మొదలవుతోంది ...ఇక పెళ్లి అయ్యివరకు అంతే .అయితే అంత ఎక్కువ సేపు మాట్లాడం మంచింది కాదు అంటే వింటారా ?(పెళ్ళైన నెల తరవాత రోజుకి ఒక ఫోన్ కాల్ చేయడం కష్టమంటారా ?)

నేతలు అంతే.జనం ఇంతే

''' పార్టీ పరిస్తితి చూసిన ఏమున్నది గర్వకారణం ..ప్రతి పార్టి సమస్తం అధికార ...ప్రపకత్వం అన్నట్టుంది ''' అధికార పార్టి కాంగ్రెస్స్ తన అధికారాన్ని నిలుపుకోవడానికే సరిపోతోంది ....తెలుగుదేశం తమ ఉనికి కోసం పాకులాడుతోంది .ఇక వై ఎస్ ఆర్ కాంగ్రెస్స్ వారు జగన్ ఎలా ముఖ్యమంత్రి వెంటనే అయిపోవాల అని అవకాసం కోసం ఎదురు చూస్తోంది ..పార్టీల స్వంత ప్రయోజనాల కోసం ఏదో చేస్తున్నారు ...ప్రజల కోసం కలసికట్టుగా చేసినది ఏమి లేదు ..నేతలు అంతే.జనం ఇంతే