సెల్ ఫోన్ లో ఎక్కువగా మాట్లాడేవారు ఎవరు అంటే "యూత్ " అని టక్కున చెబుతారు ..అయితే వారిలో చాల ఎక్కువగా దారుణం గా మాట్లాడుకునేది మాత్రం పెళ్లి కుదినవారే .పెళ్లి చూపులు జరిగిన తర్వాత పెళ్లి జరిగే వరకు వీళ్లా మధ్య జరిగే సంభాషణలకు అంతూ పొంతూ లేదు .....ఆగకుండా రెండు నుంచి మూడు గంటలు మాట్లాడేవారు ఉన్నారంటే అతిశయోక్తి లేదు .మొన్న ఆ మధ్య ఓ టీచర్ గారికి పెళ్లి నిశ్చితార్దం జరిగింది ...టీచర్ ట్రైనింగ్ లో ఆమె కు ఉదయం పదకొండున్నరకు పెళ్లి కొడుకు నుంచి ఫోన్ వచ్చిదంటే ......మళ్ళి రెండున్నర వరకు అల మాట్లాడుతూనే ఉందట .మధ్యలో భోజనం చేస్తూనే మాటలు ..ఇది చూసిన వారు ..అసలు ఇంత సేపు ఏమి మాట్లాడుకున్నారు ? అని ఆశ్చర్యపోవడం చూసిన వారు వంతయింది ...ఇలాంటివి ప్రతి చోట ఉన్నాయి ...పెళ్లి కుదరగానే ....అమ్మాయి గారికి ఓ ఫోన్ కొని ఇవ్వడం తో ఈ తతంగం మొదలవుతోంది ...ఇక పెళ్లి అయ్యివరకు అంతే .అయితే అంత ఎక్కువ సేపు మాట్లాడం మంచింది కాదు అంటే వింటారా ?(పెళ్ళైన నెల తరవాత రోజుకి ఒక ఫోన్ కాల్ చేయడం కష్టమంటారా ?)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి