31, డిసెంబర్ 2010, శుక్రవారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు -మల్లిశ్రీ


కొత్త సంవత్సరం అది తింటే సరి

చంటి -కొత్త సంవత్సరం లో కొత్తగా ఉండాలనుకుంటున్నా ....
ఓ మాంచి సలహా చెప్పారా ? డబ్బు ఆదా అవ్వాలి
బంటి -ఏముంది ? రోజు ఉల్లి దోస తింటావు కదా ..రేపటినుంచి
ప్లైన్ దోస తిను .

30, డిసెంబర్ 2010, గురువారం

రేపే పెళ్ళా .......(జోక్ )

పంతులు -అదేమిటయ్య ...ముహూర్తాలు లేవు అంటుంటే
రేపే పెళ్లి ముహూర్తం పెట్టమంటునారు
భీమయ్య -పంతులు గారు ..కొత్త సంవత్సరం లో బస్సులు ,రైళ్ళు
తిరుగుతాయో లేదో తెలియదు ..ఎలాగు మా వాళ్ళు ఇప్పడు
నిశ్చితార్ధనికి వచ్చారు కాబట్టి రేపు అక్షింతలు వేస్తారు ..

"వావ్ " అనిపించిన సాయికుమార్ ...సామాన్య జనానికి చోట్టివ్వవా ?





నిజం గానే డైలాగ్ కింగ్ వావ్ అనిపించారు .ఈ టి వి లో
వావ్ ప్రసారం అవుతోంది .సాయికుమార్ యాంకర్ గా
ఉన్న ఈ కార్యక్రమం అందరిని ఆకట్టుకుని నేటికి
వంద ఎపిసోడులు పూర్తి చేసుకుంది .ఈ కార్యక్రమం లో
సాయి ఎందరినో సెలబ్రిటిలను పరిచయం చేసారు .ముఖ్యంగా
ప్రముఖ దంపతులను ...ఎక్కడో ఇంట్లోనే కాలక్షేపం చేసే
ప్రముఖులను తీసుకు వచ్చారు .వీరిలో ఎక్కువగా సినిమా
టి వి తారలు ఎక్కువ .సీరియల్ ,ఆయా కొత్త సినిమా టీములను
ఉభయ తారకంగా పరిచయం చేసారు .మధ్యలో సాయి ఎన్నో
మంచి డైలాగ్లు చెబుతున్నారు .అయితే ,బొమ్మాలి పోటిలో
రామోజీ కుమారుడు ..మరొకరు తప్ప మిగతా వారు సక్సెస్
కాకపోవడం వెనుక కారణం సాయి కే తెలియాలి ...అంతేకాదు
సామాన్య జనానికి వావ్ లో చోటు లేక పోవడం ప్రేక్షకులకు
నిరాశ కల్గించే అంశం .కొత్త సంత్సరంలో నైన అవకాశం ఇస్తారేమో
వేచి చూడవలసిందే

29, డిసెంబర్ 2010, బుధవారం

శ్రీ కృష్ణ కమిటి రిపోర్ట్..పూర్తి గా చదివి స్పందించాలి అంటున్న రాజమౌళి

శ్రీ కృష్ణ కమిటి రిపోర్ట్ పూర్తి అర్ధం చేసుకునే వరకు ప్రజలు
ఒక నిర్ణ యానికి రాకూడదని స్టార్ డైరెక్టర్ రాజమౌళి
ప్రజలకు విజ్ఞప్తి చేసారు .తన ట్వి ట్టర్ లో అయన
విషయం గురించి ప్రస్తా వించారు .ఆలాగే మీడియా కూడా
చాల జాగర్త గా వ్యవహరించాలని ..చెబుతూ బాబ్రి తీర్పు
విషయంలో మాదిరిగా ఉండాలని అయన కోరుతున్నారు .

రమ్య కృ ష్ణ మళ్ళి అలరించ బోతుందా ?


రమ్య కృష్ణ మళ్ళి అలరించ బోతున్న వార్త అభిమానులకు
ఆనందం కల్గిస్తోంది .తాజా చిత్రం రంగ ది దొంగ లో ఆమె
పవర్ ఫుల్ పాత్ర పోషించింది .అయెతే ఇప్పటి ఆమె పాత్ర
ను సీక్రెట్గా ఉంచి నేడు హీరో శ్రీకాంత్తో విరివిగా ప్రచారం
చేస్తున్నారు .నరసింహ చిత్రం లో నీలాంబరి పాత్రను
పోలి ఉంటుందని హీరో చెబుతున్నారు .స్టిల్ చూస్తుంటే
రమ్య కు చాల పవర్ఫుల్ పాత్ర ఇచ్చినట్టు కనిపిస్తోంది .
ఆమె కోసం రెండు నెలలు వెయిట్ చేసారట .సినిమా
ఎలా ఉన్న రమ్య కృ ష్ణ ఉన్నంత సేపు ఉద్వేగంగా
ఉంటుందని ....తెలుస్తోంది ...

28, డిసెంబర్ 2010, మంగళవారం

సార్ ఉల్లి ఇస్తే ...(జోక్ )

ఎం ఎల్ - కొత్త సంత్సరంలో జనవరి ఫస్ట్ కి మనం స్వీట్ పంచుతున్నామ కదా .
ఈ సారి ఏ స్వీట్ ఇస్తే బావుంటుందో చూడండి
..పి - సార్ నాదో సలహా ..స్వీట్ బదులుగా ఓ రెండు కేజీల "ఉల్లి పాయలు " ఇస్తే
మన వోటు బ్యాంకు పెరుగుతుంది

27, డిసెంబర్ 2010, సోమవారం

గాంధీ వేషంలో పిల్లల భిక్షాటన ......(ఫోటోలు )




మన దేశం లో ఇలాంటి దౌర్భాగ్యం ఎప్పటికి పోయెను?

చలిలో పులి తిరుగుతుంది ....

టీచర్ -ఒరే రవి చలి పులి అంటే ఏమిట్రా ?
రవి - చలి లో పులి తిరుగుతుంది ......బయట తిరగ వద్దు
ఇంట్లో పడుకోమని సార్

ఈ విద్యా సంవత్సరం ముగిసింది ??

ప్రస్తుత విద్యా సంవత్సరం ముగిసినట్టే . అవును
ఇది నిజమే అనుకోవచ్చు .సాధారణం గా స్కూల్
స్థాయి నుంచి కాలేజ్ వరకు ఏప్రిల్ లో విద్యా సంవత్సరం
ముగుస్తోంది .అయితే విద్యా సంత్సరం డిసెంబర్ లోనే
ముగిసినట్టే .శ్రీ కృష్ణ కమిటి ఏమి రిపోర్ట్ ఇచ్చిన ఏదో
ఒక ప్రాంతం లో ఉద్యమాలు ఊపందు కోవడం ఖాయం .
మధ్యలో సంక్రాంతి సెలవులు ..ఇతర సెలవులు ..ఉద్యమాల్లో
పాల్గొనే విద్యార్ధులను కంట్రోల్ చేయడాన్కి యూనివర్సిటి లకు
ప్రత్యక సెలవులు కూడా ఇస్తున్నారు .ఇక మార్చ్ నుంచి
పరీక్షల మొదలవుతాయి ....దీంతో ఉపాధ్యాయులు
చెప్పేదేముంది ..విద్యార్ధులు వినే దేముంది ?

26, డిసెంబర్ 2010, ఆదివారం

శాస్త్రవేత్త లోను రాజకీయాలు ఉన్నాయా ?

శాస్త్రవేత్త లోను రాజకీయాలు ఉన్నాయా ?
లేకపోతే పర్వాలేదు .ఉంటే మాత్రం దేశం సర్వ
నాశనమే .తాజా గా జి ఎస్ ఎల్ వి ప్రయోగం
విఫలం అయిన తర్వాతా ఇలాంటి పుకార్లే షికారు
చేస్తున్నాయి .షార్ సెంటర్ లోను రాజకీయాలు
ఉన్నాయంటూ వార్తలు రావడం ఆందోళన కల్గించే
అంశం .కేవలం ప్రతిభ , అంతకు మించే దేశ శ్రేయస్సు
కోరే మేధావులు శాత్ర వేత్తలగా ఉండాలి .రాజకీయాలు
,రిజర్వేషన్ లు ఉండకూడదు .ఉంటే దేశం ఎంతో
కోల్పోతుంది .నాయకులూ ,నేతలు శాస్త్రవేత్తల
విషయంలో అసలు జోక్యం కల్పించుకోరాదు .
ప్రయోగం విఫలం చెంది నంత మాత్రాన ............
శాస్త్రవేత్తలను కించపరచ రాదు.....

రేపటితో సినిమా సమస్య సుఖాంతం

రేపటితో సినిమా సమస్య సుఖాంతం అయ్యే సూచనలు
కనిపిస్తున్నై .ఈరోజు నిర్మాత మండలి ,ఫెడ రేషన్ వారు
సీక్రెట్ గా సమావేశం అయిన విషయాని ముందుగా
"మహా టి వి "బయట పెట్టింది .ఫెడ రేషన్ తరుపున
అల్ ఇండియా చైర్మన్ రావడం తో సమస్య పరిష్కారానికి
సానుకూల వాతావరం ఏర్పడినట్టు పరుచూరి గోపాల్ కృష్ణ
తెలిపారు .ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరినట్టు
తెలుస్తోంది .షూటింగ్ బందు పుణ్యామాని "తారలు "
రెస్ట్ తీసుకుంటూ కాలక్షేపం చేస్తుండగా మరో వైపు
లేబర్ పని లేక కస్టాలు పడుతున్నారు ."కందిరీగ"
సినిమా నిర్మాణం లో ఇద్దరు ఫైటర్స్ మధ్య నెల
కొన్న వివాదం ఇంతపని చేసింది

కూచిపూడి గిన్నిస్ రికార్డు లో పురందేశ్వరి కి స్థానం -రాష్ట్రపతి


కూచిపూడి నృత్య కళాకారులు ఈరోజు గిన్నీస్ రికార్డు
సాధించడం మన అందరికి గర్వ కారణం .దేశ విదేశాలకు
చెందిన రెండు వేల ఎనిమిది వందల మంది ఈ రికార్డు
సాధన లో పాలు పంచుకున్నారు .రాష్ట్రపతి చేతులు
మీదుగా సి ఎం గిన్నిస్ సర్టిఫికేట్ అందుకున్నారు .
రాష్ట్రపతి చేతులు మీదుగా గురువులు సత్కరింప
బడ్డారు .కాగా గౌరవ రాష్ట్రపతి ప్రతిబా పాటిల్ గారు
ప్రసంగిస్తూ అంకె కు ఒకటి కలపాలని అన్నారు .అది
కేంద్ర మంత్రి పురందేశ్వరి గారిది .నిన్న ఆమె నృత్యం
చేసిన సంగతిని దృష్టిలో ఉంచుకుని ఆమె ఈ మాట
అన్నారు .ఏమైనా మన తెలుగుంటి ఆడపడుచు
పురందేశ్వరి గారు కేంద్రంలో మంచి మార్కులే స్కోరు
చేస్తున్నారు .

వాయిస్ కింగ్ సాయి కుమార్ సక్సస్ అయ్యేనా ?


సాయి కుమార్ డై లాగ్స్ వింటుంటే ఎవ్వరికైనా
ఆనందం కల్గుతుంది .పవర్ఫుల్ పాత్ర లోని
డైలాగ్స్ అయితే రోమాలు నిక్కబోడుస్తాయి .
ఆయన కొడుకు ఆదిత్య "ప్రేమ కావాలి " అంటూ
మనముందుకు వస్తున్నాడు .నేటి యువ
తరానికి తగ్గట్టు బాడి లాంగ్వేజ్ బాగానే
ఉంది అంటున్నారు ,మరి తండ్రిలా
డైలాగ్స్ తో మురిపిస్తాడు లేదో

రచ్చ గెలిచినా చంద్రబాబు

చంద్రబాబు నాయుడు దీక్ష ఎంత వరకు ఫలితాన్ని ఇచ్చిందన్న
విషయం పక్కన పెడితే బాబుకు మళ్ళి జాతీయ స్తాయిలో మంచి
క్రెడిట్ కొట్టేసారని చెప్పుకోవచ్చు .ప్రాణానికి ప్రమాదం వచ్చేవరకు
బాబు దీక్ష చేసి "నేను కూడా రైతు పక్షపాతినే " అని నిరూపించుకునే
ప్రయత్నం చేసారు .దీక్ష కారణంగా రైతుకు లాభం చేకూరకపోయిన
తను మాత్రం జాతీయ స్థాయి నేత గా పేరు తెచ్చుకున్నాడు .కాగ గుంటూరు లో
జరిగే "రైతు గర్జన " వాళ్ళ టి డి పి కి కొంత వరకు ప్రయోజనం జరగా వచ్చు .

25, డిసెంబర్ 2010, శనివారం

చీరకట్టులో బంగారంలా మెరిసిపోతున్న "త్రిష " ఫోటో


కేకులు తినిపించుకుంటే కల్సి పోయినట్టేనా ?

బాబాయ్ అబ్బాయి కల్సి పోయారంటూ
మళ్ళి టి వి లలో వార్తలే వార్తలు ..
క్రిస్మస్ పండుగ పూట జగన్ ,వై .ఎస్
వివేకానంద కలయక సహజంగానే
అందరిని ఆశ్చర్య పరిచింది .ఇద్దరు
కేకులు తినిపించుకునే దృశ్యాని
పదే పదే చూపిస్తునారు .సాధారణంగా
రాజకీయం గా ఎన్ని భేదాలు ఉన్నా
ఆయ కుటుంబాల వారు పండుగులకు
పబ్బాలకు కల్సుకోవడం సహజం .ఇంత
మాత్రాన వాళ్ళు కల్స్తి నట్టు అని భావిస్తే
మన పొరపాటు కావచ్చు .రాజకీయంలో
ఏమైనా జరగవచ్చు .బాబాయి -అబ్బాయి
రాజకీయం ఎలా ఉంటుందో వేచి చూద్దాం .

బ్లాగర్స్ కు అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు

బ్లాగర్స్ కు
అందరికి
క్రిస్మస్
శుభాకాంక్షలు

రగడ చిత్ర కథ



24, డిసెంబర్ 2010, శుక్రవారం

బొద్దు గుమ్మాలు ముద్దోచ్చారు


కుర్రకారును కైపు ఎక్కించే ఆ ఇద్దరు మరింత బొద్దు
అయిపోయారు .ఒకరు అనుష్క మరొకరు ప్రియమణి .
తాజా చిత్రం రగడలో వీరిద్దరూ నువ్వా నీనా అన్నట్టు
అన్నట్టు బొద్దు గా కనిపించారు .ఎంత బొద్దుగా ఉన్న
ముద్దుగానే ఉన్నారని సంబర పడుతున్నారు అభిమానులు .
నాగ్ సరసన వీరిద్దరూ అందాలను ఆరబోశారు .ఇంటర్వల్
తర్వాత వచ్చే నాల్గవ పాటలో రెచ్చిపోయి నటించారు .
నవ మన్మధుడు నాగ్ మంచి రొమాన్స్ చేసాడు

"నన్ను ఇన్వాల్వ్ చెయ్యొద్దు బ్రహ్మం డార్లింగ్ "-అనుష్క ,బ్రహ్మానందం మధ్య పండిన కామిడీ


"డీ" సినిమా లో విష్ణు బ్రహ్మ్మనందం మధ్య కామిడీ సీన్
గుర్తుకు టెస్టు తాజాగా ఈరోజు విడుదల అయిన "రగడ "లో
బ్రహ్మ్మనందం హీరొయిన్ అనుష్క ,నాగార్జున తో చేసిన
కామిడీ అదిరింది ."బ్రహ్మం "పాత్రలో అయన కనిపిస్తాడు .
బ్రహ్మం పలికే ప్రతి మాటకు హీరో ప్రతి మాట చేస్తూ ..
టీజ్ చేస్తుంటే "చూసావా శిరీషా(అనుష్క ) " అంటే
అనుష్క "నన్ను ఇన్వాల్వ్ చెయ్యొద్దు బ్రహ్మం డార్లింగ్ "
అంటూ అనే సీన్స్ చాల బావున్నై

కుర్రాడిలా "రగడ "చేసిన నాగ్

మధ్యకు సమలేఖనం

23, డిసెంబర్ 2010, గురువారం

త్రిష మహేష్ ని మించి పోతుందా ?

ట్వి ట్టర్ లో టాప్ ప్రిన్సు మహేష్ బాబు అని
అందరికి తెల్సు .తాజా గా హీరొయిన్ త్రిష
మహేష్ తో పోటి పడుతోంది .లక్ష పద్నాలుగు
వందల ఫాలోవర్స్ తో చెన్నైట్వి ట్టర్ లో నెంబర్ వన్
గా నిలిచింది .ట్వి ట్టర్ మన మహేష్ లక్ష అరవై రెండు
వేల మంది తో ముందు వరసలో ఉన్నాడు .
ప్రస్తుతం ట్వి ట్టర్ వీరే లక్ష దాటినా వారట .కాగా
మధ్య ట్వి ట్టర్ మళ్ళి మహేష్ పెద్దగా కనిపించడం లేదు .
త్రిష మహేష్ ని మించి పోతుందా ?

తరగని అందంతో బుల్లి తెర పై హల్ చల్ చేస్తున్న వెండి తెర హీరొయిన్



వెండి తెర కొన్నాళ్ళు హాట్ హాట్ సీన్స్ తో ప్రేక్షకులను ఉర్రూతలు
ఊగించిన ఆమె బుల్లి తెర కు వచ్చేసింది .ఆమె వాణి విశ్వనాథ్ .
తెలుగు లో వన పాత దగ్గర్నుచ్న్హి ఎన్నో హాట్ హాట్ సీన్స్ లో

నటించి కొన్నాలు కనిపించకుండా పోయింది .మళ్ళి హటాత్ గా

బుల్లి తెరపై మూడు రోజుల నుంచి కనువిందు చేస్తోంది .జెమిని

టి వి లో "సముద్రం "సీరియల్ లో వాని నటిస్తోంది .కష్టాల కడలి

ఈదే మహిళ పాత్రలో వాణి కనిపిస్తోంది ,ఎంట్రన్సు లో నే

హీరో సినిమా మాదిరిగా ఓ ఫైట్ చేసేసింది .అవిటి తల్లి

సవితి తల్లి ....తమ్ముడు ..తండ్రి ఆమె ఫ్యామాలిగా

చూపిస్తునారు .కాగ వయసు మీద పడిన అందం

మాత్రం చెక్కు చెదరలేదు అంటున్నారు ప్రేక్షకులు .
బుల్లి తెర పై వాణి ఎటువంటి క్రేజ్ సృష్టిస్తుందో వేచి

చూడవలసిందే

సాక్షి పై దావా వేస్తామంటున్న టి డి పి

ఎలాగైతే నేమి చంద్రబాబు ను సి లోకి తరలించారు .
సర్కార్ బలవంతంగా చంద్ర బాబు ను తరలిచింది .
ఇప్పటికే బాబు ఆరోగ్యం బాగా క్షినించడం తో

ఆందోళన పెరిగింది .డాక్టర్లు సిపార్సు తో

చంద్ర బాబుకు చికిత్స మొదలు పెట్టారు .
కాగ చంద్ర ఆరోగ్యం పై జగన్ "సాక్షి "
పత్రిక లో ఈరోజు వచ్చిన వార్త కలకలం

సృష్టించింది .అవాస్తావాలు రాసారని కోర్టుకు

వెళ్లి దావా వేస్తామని కూడా టి డి పి నేతలు చెప్పారు .
అటు టి కి పి ఇటు కాంగ్రస్ పార్టిని ఏదో రకంగా
ఇరుకున పెట్టడానికి జగన్ వర్గం అన్ని రకాల
మార్గాలు వెతుకుతున్నాటు దీని బట్టి అర్ధమవుతోంది

రగడ రంజుగా ఉంటుందా ? అనుస్కను ప్రేమించే బ్రమ్మానందం


రోజు విడుదలువుతున్న "రగడ " చిత్రం పై
భారి అంచనాలే ఉన్నాయ్ .నాగార్జున
"ఫ్రెష్ "గా కనిపించడమే కాదు చాల
హుషారుగా ఉన్నాడు .పక్కన కిక్ ఎక్కించే
హీరోయిన్స్ అనుష్క ,ప్రియమణి ఉండడంతో
రగడ రంజు గా ఉంటుందని అభిమానులు ఆశ
పడుతున్నారు .కాగ అనుష్క ను ప్రేమించే
పాత్రలో బ్రమ్మానందం గిలిగింతలు పెడతాడని
టాక్ .

22, డిసెంబర్ 2010, బుధవారం

రాజశేఖర్ మాట్లాడుతున్నాడు

సిని నటుడు రాజశేఖర్ మళ్ళి అలజడి చేస్తున్నాడు .
తాజాగా జగన్ శిబిరంలో చేరిన ఆయన వచ్చిరాని

తెలుగులో తెగ మాట్లుతున్నాడు .రాజశేఖర్

మాటలు జగన్ శిబిరాని తెగ సంతోష

పెడుతున్నాయి .సి ఎం కిరణ్, చిరంజీవి పై

ఆయన వ్యాఖ్యలు చేసారు ,"మేలిమి బంగారం

(జగన్ ) ను వదిలేసుకుని "ఇత్తడి " పట్టుకుంటునారు
అంటూ వ్యాఖ్యలు చేస్తుండగా సభికులు చిరు అనగానే

అవును చిరంజీవే అంటూ చెప్పుకొచ్చారు .మళ్ళి మొత్తాంకి

చిరంజీవిని విమర్శించడానికి జీవిత -రాజశేఖర్ దంపతులకు

అవకాశం వచ్చినట్లు కనిపిస్తోంది ?

పట్టుదలకు పోవద్దు

దీక్షలో ఉన్న చంద్ర బాబు నాయుడు ఆరోగ్యం
విషమించడం సర్వత్ర ఆందోళన కల్గించే అంశం .
రాజకీయాలను పక్కన పెడితే ప్రజా నేతలను

కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉంది .అటు

ప్రభుత్వం ఇటు టి డి పి పట్టుదలతో వ్యవహరించడం

మంచిది కాదు .అలాగే మాజీ ముఖ్య మంత్రి

పై వ్యంగ్యంగా మాట్లాడం మంచిది కాదు .సర్కార్

మరింత చొరవ తీసుకుని బాబు ఆరోగ్యాని కాపాడాలి

నాగవల్లి నిద్ర లేపుతోంది అంటున్న హీరొయిన్


ఏ ముహూర్తాన రిచా గంగోపాధ్యాయ ఆ పాత్ర
చేసిందో గాని ఆమెకు అదే మానియా పట్టుకున్నతుంది

ప్రతి రోజు ఇదే విషయం మాట్లుడోతోంది. నాగవల్లి

తనను నిద్రలేపోతోందని చెబుతోంది .ఉదయం లేవాలంటే

చలి అని ..తాతయ్య అమ్మమ చేసే సౌండ్ లకు (పాయల్ )
లేస్తానని అయితే ఈ మధ్య "నాగవల్లి " నన్ను నిద్ర లేపుతోందని

రిచా పెర్కుంది ......అది సంగతి

నీనూ "ఉల్లి దీక్ష" చేస్తున్న.

చంటి -ఒర్ నేను రేపటి నుంచి "ఉల్లి దీక్ష "చేయబోతున్నాను "
బంటి-ఉల్లి దీక్ష ?
చంటి -ఉల్లి కే జి పది రూపాయలు అయ్యేవరకు ఉల్లి తో చేసిన కూర తినను
బంటి - జన్మలో నీ కోరిక తీరదు ....

21, డిసెంబర్ 2010, మంగళవారం

రాజకీయ క్రికెట్ లో "డిఫెన్సు " ఆడుతున్న కెప్టన్ కిరణ్


కొత్తగా సి ఎం పోస్ట్ నెత్త్కున్న కెప్టన్ కిరణ్ కుమార్ రెడ్డి
రాజకీయ క్రికెట్ లో "డిఫెన్సు " మాత్రమె ఆడ వలసిన

విపత్కర పరిస్తితి వచ్చింది .పతిపక్షమనే ఫాస్ట్ బాల్స్ను

ఎదుర్కోవ డానికి కిరణ్ కష్టపడవలసి వస్తోంది .ముఖ్యంగా

రాకెట్ వేగం తో వస్తున్న "చంద్రబాబు "," జగన్ " అనే

బంతులను ఎదుర్కుని ఆడడానికి చెమటలు పడుతున్నై
.
టార్గెట్ మూడేళ్ళు ..పక్కన బెడితే తను "అవుట్ "కాకుండా

ఉండాలంటే ...ధీటుగా ఎదుర్కోవాలి ....మరో వైపు

వికెట్స్ (ఎం ఎల్ ఏ లు ) పడిపోతున్నై .......బాబు

జగన్ ఓవర్లు ముగియక ముందే "తెలంగాణ " అనే

సూపర్ ఫాస్ట్ బౌలర్ రడీగా ఉన్నాడు .పాపం కెప్టైన్

కిరణ్ తన జట్టును ఎలా కాపాడు కుంటాడో?

నాగవల్లి లో ఆ డైలాగ్ "ఎన్ టి ఆర్ ది"?


వైట్ టాప్ ,పాల గ్లాస్ తో ప్రియమణి రడీ



ప్రియమణి పాలు తాగించాడాంకి రడీ అయ్యింది .
చూసారా వర్కింగ్ స్టిల్ ....కేవలం పై

టాప్ వేసుకుని సుమంత్ను కవ్వించడానికి

ప్రియమణి రడి.నాగార్జున నాగార్జున పాట
"భీమవరం బుల్లోడా పాలు కావాలా మురిపాలు

కావాలా ? " అనే పాట సినిమాలో రిమిక్ష్

చేస్తునారు .ప్రియమణి పాలు పట్టుకుని ఎలా

కవ్వించి అందాలు ఆరబోసిందో వెండి తెరపై

చూడవలసిందే

తల్లి లాంటి "ఉల్లి " ఏడిపిస్తోంది



20, డిసెంబర్ 2010, సోమవారం

క్రిస్మస్ ట్రీ రడీ చేసిన త్రిష


త్రిష తయారు చేసిన క్రిస్మస్ ట్రీ

త్రిష
అప్పుడే క్రిస్మస్ సందండి మొదలు పెట్టింది .
జీవితంలో అది బిగ్ ఫెస్టివల్ అని త్రిష చెబుతోంది .
ఇంకా మూడు రోజులు ఆగాలంటే మనసు ఆగడం

లేదని ......తొందరగా పండుగ వస్తే భావున్నతోంది .
అంతే కాదు అప్పుడే క్రిస్మస్ ట్రీ రెడి చేసింది .తనకు

ఇష్టమైన పింక్ కలర్లో ట్రీ తయారు చేసి సిద్దంగా

ఉంది .

జగన్ కు జై అంటున్న రాజశేఖర్ జీవిత దంపతులు


విచిత్ర రాజకీయం మాట్లాడే రాజశేఖర్ జీవిత దంపతులు
కాంగ్రస్ కు గుడ్ బై చెప్పేసి జగన్కు జై కొడుతున్నారు .
రాజశేఖర్ రెడ్డి పై అభిమానం తో ఆ పార్టి లో ఉన్న వారు

జగన్ పెట్టె కొత్త పార్టి లోకి వస్తున్నారు .ఇప్పటికే రోజా

జగన్ బాటలో పయనిస్తోంది .తాజాగా వీరు .ఏం

జరుగుతుందో చూడాలి

ఇలియానాకు బాలివుడ్ పిలుపు


దక్షినాదిని ఓ ఊపు ఊపేస్తున్న ఇలియానా చూపు
బాలివుడ్ పై పడింది .ఇప్పటికే తెలుగు, తమిళ్ లో
బుజిగా ఉన్న ఆమెకు బాలివుడ్ నుంచి ఆపర్లు
వస్తున్నై .సల్మాన్ఖాన్ తో నటించే ఛాన్స్ వచ్చినట్లు
చెబుతున్నారు .త్రిష లాంటి వారు అక్కడకు వెళ్లి
తిరుగు టపాలో మళ్ళి ఇక్కడకు వచ్చిన
నేపధ్యాని దృష్టిలో ఉంచుకుని అమ్మడు ..తగిన
నిర్ణయం తీసుకుంటుందట .

సాక్షి లో చంద్ర బాబుకు చోటు ?

చంటి -అదేంటిరా మిగతా పేపర్లు ..చానల్ లలో చంద్రబాబు కనబడుతుంటే సాక్షి లో మాత్రం
ఏదో మూల కనపడుతున్నారు ?
బంటి-భలే వడివే .. మూలాన్న వేసారు సంతోషం .....సాక్షి లో జగన్ ఉంటాడు కాని ..

డిసెంబర్ దడ పుట్టిస్తోంది ...చంద్రబాబు తో మొదలు


డిసెంబర్ లో అప్పుడే రాష్ట్రము లో అలజడి మొదలైంది .
డిసెంబర్ ముప్పయి ఒకటి తర్వాత రాష్ట్ర పరిస్తితి ఎలా
ఉంటోదోనని జనం ఆందోళన చెందుతున్నారు .ఈ లోగానే
అలజడులు పారంభం కావడం జరిగింది .రైతుల కోసం
దీక్ష చేస్తున్న చంద్ర బాబు ను బలవంతంగా అరెస్ట్ చేసి
ఆసుపత్రికి పంపడంతో తెలుగు దేశం పార్టి రాష్ట్ర బంద్ కు
పిలుపు నిచ్చింది .రేపటి నుంచి జగన్ దీక్ష ..అప్పుడు
అదే పరిస్తితి రావచ్చు .ఈ లోగ తెలంగాణా ..........
ఎలా చూసిన డిసెంబర్ దడ పుట్టిస్తోంది

19, డిసెంబర్ 2010, ఆదివారం

రాం చరణ్ ,రానా కల్సి చదువు కున్న స్కూల్ గ్రూప్ ఫోటో


నా హాట్ హీరో ఆయనే అంటున్న ముద్దుగుమ్మ


ఆ అమ్మడు ఆ హీరో తన హాట్ హీరో అంటోంది .
ఆ హీరొయిన్ "తాప్సి పన్ను ".విష్ణు తన
హాట్ హీరో అంటూ తన ట్వి అట్టర్ తెగ రాస్తోంది
స్టిల్ కూడా చూడ మంటోంది ."ఝుమ్మంది
నాదం "తర్వాత మళ్ళి ఛాన్స్ వచ్చింది కదా.
అందుకే "వచ్చాడు నా రాజు" అంటోంది .

మామ కోసం జూనియర్ ఎన్ టి ఆర్ మళ్ళి రాజకీయాలు


జూనియర్ ఎన్ టి ఆర్ మళ్ళి రాజకీయాలు మాట్లాడవలసిన
అవసరం వచ్చింది .రైతుల కోసం మామ చంద్రబాబు

నాయుడు నిరాహార దీక్ష చేస్తున్న నేపధ్యం లో ఎన్ టి ఆర్

ఈరోజు ఆయనను పరామర్శ చేసి అక్కడ మాట్లాడారు .
అవసరమైతే ప్రత్యక్ష ఆందోళనలో పోల్గొంటానని వెల్లడించారు.
ఎలాగు సినిమా టేకింగు లు ఆగిపోయాయి ..సమయం ఉంది .
ఇక తాత పార్టి కోసం పని చేయక తప్పదు కదా

18, డిసెంబర్ 2010, శనివారం

పాత్ర కోసం బరువు పెరగనున్న రజినీకాంత్


సాదారణంగా హీరో అయిన బరువు తగ్గాలని కోరుకుంటారు .
డైరెక్టర్స్ సహితం హీరో బరువు తగ్గించాడాంకి ప్రయత్నం
చేస్తాడు .అయితే హీరో మాత్రం పాత్ర కోసం బరువు
పెరగ బోతున్నారు .ఆయినే సూపర్ స్టార్ రజనికాంత్ .
రజని కుమార్తె సౌందర్య యానిమటేడ్ ఫిలిం సుల్తాన్
డి వారియర్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే . సినిమాలో
కొంత భాగం లో రజిని కన్పిస్తారు . పాత్రలో రజని
బాగా కనిపించాదాంకి బరువు పెరగాలాట.అసలే కూతురు
సినిమా ....తప్పక బరువు పెరగాంకి రజని సిద్ధ మైనట్టు
సమాచారం

పెళ్లి ఆగింది (నవ్వుకో )

బంటి-ఢిల్లీ లో మన రాము గాడి పెళ్లి ఈపాటికి అయిపోయి ఉంటుంది
చంటి -పెళ్లి ఆగి పోయిందట .ఫోన్ చేసి చెప్పారు ఇప్పుడే ..
బంటి -ఏం ఎందుకని ?
చంటి -చలికి పెళ్ళికూతురు బిగిసుకు పోయిందట ....మన వాడి చేతులు పనిచేయలేదట

(సందర్బం -ఢిల్లీ లో నాలుగు డిగ్రీల ఉష్ట్నోగ్రత)

జెనిలియా క్యూట్ ఫోటోలు లేటెస్ట్



శునకమునకు హీరొయిన్ లిప్ కిస్ ?


ఎవరు ఈ హీరొయిన్ ?

17, డిసెంబర్ 2010, శుక్రవారం

నాగవల్లి లో "వెంకీ " నూట ఇరవై వయస్సు రూపం


నాగవల్లి లో వెంకీ కొత్త రూపంలో లో కన్పించాడు
డాక్టర్ గా ,రాజుగానే కాకుండా గుహ లో దాక్కున్న
నూట ఇరవై సంవత్స ముల వయస్సు వాడిగా
కొద్దిసేపు ఘోరంగా కనిపిస్తాడు

జగన్ పార్టి పెట్టినప్పుడు ఆలోచిస్తా-జయసుధ



సహజ నటి జయసుధ మాటలు కూడా సహజం గానే ఉంటాయి.
ప్రస్తుతం కాంగ్రెస్ ఎం ఎల్ గా ఉన్న ఆమె తాజా రాజకీయాల
నేపధ్యం లో ఆచి తూచి మాట్లుడుతోంది .ఈరోజు ఆమె పుట్టిన రోజు
సందర్భంగా విలేకర్లు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాదానం
చెప్పారు .జగన్ పార్టి పెట్టినప్పుడు ఆలోచిస్తానని ..అయితే నా
వ్యక్త్వత్వం నాకు నచ్చే పార్టి లోనే ఉంటానని చెప్పారు .

వెంకీ-నాగ్ ఇద్దరు కల్సి చిన్నప్పుడు ఇలా ఉన్నారు


అరుదైన ఫోటో ..భలే ఉంది కదా ..నాగార్జున
చిన్నపుడు అచ్చం నాగ చైనతన్య లా ఉన్నాడు ?

నాగవల్లి సినిమా డైలాగులు -వన్


15, డిసెంబర్ 2010, బుధవారం

వామ్మో రామ్ చరణ్ అన్నంత పని చేసాడు .


వామ్మో రామ్ చరణ్ అన్నంత పని చేసాడు .
పుట్టిన రోజున రానా ముఖాని పేస్ట్ చేసాడు .
ఈ ఫోటో చూడండి .కేకు తెసుకుని రానా ముఖంపై

ఎలా చేసాడో .ఫేసియల్ చేసాను అంటున్నాడు చరణ్

ఇద్దరు మంచి మిత్రులు అనడానికి ఇది మంచి ఉదాహరణ .

14, డిసెంబర్ 2010, మంగళవారం

రామ్ చరణ్ విచిత్ర ఫోటో


ఫోటో చూసారా ?ఎవరు ?
ఇంకెవరు రామ్ చరణ్ తేజ

అభిమానుల కోసం ఇలా పోజిచ్చారు

బై ది బై పుట్టిన రోజు జరుపుకుంటున్న

తన మిత్రుడు రాణాకు వెరైటి గా

శుభా కాంక్షలు తెలిపారు .టాలేస్ట్
ఫ్రెండ్ అంటూ సంబోదించాడు

అంత కాదు .పెద్ద కాకతో రానా ఫేసు

పేస్టు చేయాలన్నాడు .

ఓ పాతిక వేలు పైగా ఇవ్వాలి ?

సోమ రావు -అదేటండి ...అల్లుడు గార్కి హోండా బైకే పెడితే చాలని చెప్పి
ఇప్పుడు మళ్ళి పాతిక వేలు పైగా ఇమంటున్నారు?
ఆశారావు -టి వి చూడండి ..పెట్రోల్ ధరలు మళ్ళి పెరిగాయట....

రగడ విడుదల ఇరవై మూడవ తేదిన -నాగార్జున


నవ మన్మ్దుడు నాగార్జున కొత్త చిత్రం "రగడ "
విడుదల తేది ప్రకటించారు .హీరో నాగార్జున

స్వయంగా ఈ విషయం తెలియ జేశారు .ఈ

నెల ఇరవై మూడవ తేదిన విడుదల అవుతోంది

సినిమా నిర్మాణం స్తంబించిన నేపద్యంలో

రగడ విడుదలపై అనుమానాలు వచాయి .
నిర్మాతఃల మండలి రగడ విడుదలకు

అనుమతి వివ్వడంతో నాగ చాలా

సంతోషం వ్యక్తం చేసారు .ఈ సినిమా లో

అందర్నీ రాక చేస్తానంటునాడు నాగ్

ట్వి ట్టర్ లో ఈ రోజు అంత ఆ హీరోయే



ఈ రోజు ఏ ట్వి ట్టర్ చూసిన అవే సంగతులు .
అన్ని ఆ హీరోను అభినదిస్తూ ఉన్నవే .తెలుగు హీరో లు
ప్రముఖులు తో పాటు అభిషేక్ బచ్చన్ వంటి హీరోలు
హీరొయిన్ లు శుభాకాంక్షలు తెలిపారు .ఆయనే
రానా దగ్గుపాటి .ఈ రోజు రానా పుట్టినరోజు
కావడంతో అతనకి అభినందనలు వెల్లివెత్తాయి
ట్వి ట్టర్లో యాక్టివ్ గా ఉన్న రానా కు అదే రీతిలో
శుభా కాంక్షలు అందుకున్నారు

రైతుల కోసం చంద్రబాబు ,జగన్ ఆమరణ దీక్షలు ?


13, డిసెంబర్ 2010, సోమవారం

"విశ్వామిత్ర " గురించి నాకు తెలియదు -రాజమౌళి

విశ్వ మిత్ర చిత్రం గురించి తనకు అసలు
తెలియదని స్టార్ డైరెక్టర్ రాజమౌళి చెప్పారు
తానూ "విశ్వామిత్ర "చిత్రం చేస్తున్నాటు
అడగటంపై ఆయన స్పందిన్స్తూ అసలు కథ
తెలియదని ....ఎటువంటి చర్చలు జరగాలేదని
అన్నారు .సమంత రెండు చిత్రాల కోసం
సైన్ చేయలేదని కూడా ఆయన వివరించారు.
హీరో ప్రభాస్ చిత్రం పై కూడా ఎటువంటి
నిర్ణయం ఆయన తీసుకోలేదు

వర్మ ,"బెజ వాడ రౌడీలు" టైటిల్ సాంగ్ నెట్ లో

వర్మ తన నూతన చిత్రం లోని సాంగ్ నెట్లో రిలీజ్ చేసారు .
తన ట్వి ట్టర్ లో విషయాని రాసారు కూడా .
బెజ ...బెజ బెజవాడ అనే టైటిల్ సాంగ్ మొన్న

విజయవాడలో వర్మ స్వయంగా పాడిన
సంగతి తెలిసిందే . పాటను

సిరశ్రి రాయగా జోజో పాడారని ...అమర్ మొహిల్
సంగీతం సమకూర్చినట్టు వర్మ పెర్కున్నారు .
యూ టూబ్ లో కూడా పాట లభ్యమవుతోంది

పుట్టిన రోజున మోహన్ బాబు తో రజినీకాంత్ ....ఫోటో


సూపర్ స్టార్ రజిని కాంత్ తన పుట్టిన రోజున తెలుగు హీరో
మోహన్ బాబుతో గడిపారు .అరవై లోంచి అరవై ఒకటి లోకి
అడుగుపెట్టిన సమయంలో ఒకవ్వైపు అభిమానులు
సంబరాలు చేసుకుంటే రజిని మాత్రం హైదరాబాద్
వచ్చి స్నేహితుడు మోహన్ తో గడపడం విశేషం