31, డిసెంబర్ 2011, శనివారం

అయ్యో శనివారం " .కక్క ముక్క లేనిదే ముద్ద ...నూతన సంవత్సర..

అయ్యో శనివారం " అయితే నేమి ? కాస్త ఓపిక పడదాం.....ఏమిటీ శనివారం అనుకుంటున్నారా ? నూతన సంవత్సర రాక తో ఈ రోజు రాత్రి కి అందరికి పసందైన విందే ....కక్క ముక్క లేనిదే ముద్ద  దిగనివాళ్ళు చాల మందే ఉన్నారు .సాధారణ రోజుల్లో దొరకని ఎన్నో మాంసాహార రుచులు ఈ రోజు ప్రత్యేకం ...అందుకే కుర్రకారు మజా ....అయెతే ఈ రోజు శనివారం రావడం పలువురికి ఇబ్బంది అయ్యింది .శనివారం మాంసాహారం ముట్టని మాంసాహార ప్రియులకు శనివారం షాక్ ఇచ్చింది ....దీంతో ఎలా అనుకుంటూ బుర్ర గోక్కున్నారు ..దీనిలో సీనియర్స్ ఓ మాంచి ఐడియా ఇచ్చిసి వారిలో ఆనందాన్ని నింపారు .."".రాత్రి పన్నెండు గంటల వరకే శనివారం ...తర్వాత ఆదివారం ..అప్పటి వరకు ఎలాగు మేల్కుని ఉంటారు కదా ..అప్పుడు కానిచ్చెయ్యండి "....భలే ఉంది కాదు ఐడియా 




 తెలుగు బ్లాగర్లు అందికి నవ్య వత్సర శుభాకాంక్షలు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి