బ్రమ్మానందాన్ని ఏ సినిమాలో చూసిన ఏమున్నది ? పేరు మార్పు తప్ప అంత పాత చింతకాయ పచ్చేడే తప్ప అనుకునే రోజులు రావడం దురదృష్టం .మనకు ఉన్న హాస్య నటుల్లో బ్రహ్మ నందం గొప్ప వారు .పద్మ బిరుతాంకితుడు.గిన్నిస్ విజేత .తెలుగు జాతి కి వన్నె తెచ్చినవాడు ..ముఖం చూస్తేనే నవ్వు వస్తుంది .అలాంటి నటుడు మూస లో ఉండిపోవడం భాదాకరం .ప్రేక్షకులు తమ అభిమాన నటుల నుంచి కొత్తదనం కోరుకోవడం సహజం .అయితే మన బ్రహ్మ విషయం లో ఒకే మూస పాత్రలు ఉంటున్నాయి." బ్రహ్మ గారికి ఓ వీక్నెస్ ఉంటుంది .అది హీరో గారు కనిపెట్టి అది వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసి .......తన్నుతూ ఉంటాడు ...పాపం బట్టబుర్ర తో మన బ్రహ్మ హీరో తో తన్నులు తింటూ మనల్ని నవ్విస్తాడు ." ప్రతి సినిమా లోనూ ఇదే తంతు . కొన్ని సినిమాల్లో మరీను ........
మన బ్రహ్మ్మనందం గారికి ఒకేటే మనవి ...అయ్యా ! తమరు ఈ మూస నుంచి బయట పడి సరికొత పాత్రలతో మమ్మల్ని నవ్విస్తారని ఆశిస్తున్నాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి