25, ఆగస్టు 2011, గురువారం

దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రం విద్యార్దుల్లో ప్రతిభ వెలికి తీయడానికి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది .ఈ కార్యక్రమానికి "శాస్త్ర "

దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రం విద్యార్దుల్లో ప్రతిభ వెలికి తీయడానికి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది . కార్యక్రమానికి "శాస్త్ర " అని పేరు పెట్టారు.సేకరించిన సమాచారం ప్రకారం .. .సాధారణంగా జరిగే క్విజ్ వంటి కార్యక్రమాలకు భిన్నంగా విద్యార్దుల్లో దాగి ఉన్న శాస్త్రీయ అవగాహన ,అనువర్తనాలు వంటివి తెల్సు కోవడానికి దీనికి వేదిక గా చేసుకున్నారు .శాస్త్ర లో మొత్తం మూడు రౌండ్లు ఉంటాయి .మొదటి రౌండ్ లో "అవగాహన " లో అయిదు ప్రశ్నలు యాబై మార్కులు .రెండవ రౌండ్లో "పరిశోధన " రౌండ్ లో విద్యార్ది చేసిన సైన్సు ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఇరవై మార్కులుకు ఉంటుంది .మూడవ రౌండ్ లో "పరిశీలన " లో ఒక దృశ్యాన్ని చూపించి లీడా ప్రయోగం చేసి... దానిలో ఉన్న సైన్సు సంగతి అడుగుతారు ......ఎక్కువ మార్కులు వచ్చిన వారు ఎపిసోడ్ విన్నర్ అవుతారు ...వచ్చే నెల లో కార్యక్రమం దూరదర్శన్ సప్తగిరి లో ప్రసారం కానుంది .ప్రతి శనివారం సాయిత్రం మరియు ఆదివారం శాస్త్ర ప్రసారం చేయడానికి సన్నాహాలు చేస్తునట్టు తెలుస్తోంది .మంచి కార్యక్రమాన్ని ఎన్నుకున్నందు నిర్వాహకులకు అభిననదనలు చెప్పవల్సిందే .

1 కామెంట్‌:

  1. నిజంగా ఇది మంచి కార్యక్రమమే. పిల్లలు, రైతులు, యువత, కర్ణాటక, లలైత, లలిత శాస్త్రీయ, జానపద సంగీతాలు, జానపద కళలు, నాటకాలు, సాహిత్యం...ఇలా అన్ని కార్యక్రమాలకీ వేదిక దూరదర్శన్.

    మాధురి.

    రిప్లయితొలగించండి