19, ఫిబ్రవరి 2011, శనివారం

పెళ్ళిలలో "పేయింగ్ గెస్ట్లు" ?

కొన్ని ఫంక్షన్లు లేదా శుభకార్యాలు లేదా ప్రత్యేక
కార్యక్రమాల్లో హీరోలు ..హీరొయిన్ లు (సినీతారలు )
,సెలబ్రిటీలు కనిపిస్తుంటారు .అలాగే కొన్ని పెళ్లిలల్లో
తారలు ,టి వి యాంకర్లు కనిపించి కనువిందు చేస్తుంటారు .
ఇది చూసి సదరు కార్యక్రమం చేసే వ్యక్తి కి "వీరంతా తెల్సు
ఏదైనా అదృష్టం ఉండాలి " అనుకునేవారు కనిపిస్తారు .కాని
అదంతా "డబ్బు మహిమ అని ....కాసులు పుచ్చుకుని
వాళ్ళు వచ్చారు ." అని తెలిసిన వారు కొంతమందే ఉంటారు .
ఇటివలి కాలం లో "పేయింగ్ గెస్ట్ లు " చాల ఎక్కువ అయ్యారు .
విద్య సంస్థల లేదా ఇతర సంస్థల ముఖ్య కార్యక్రమాలకు సేలిబ్రిటి
లను పిలవడం అలవాటైంది .అయితే వీరిలో చాలామంది డబ్బు
పుచ్చుకుని వస్తున్నారు .గతం లో ప్రముఖ హీరో ని "తమరు
రావాలి .రెండు మంచి మాటలు చెప్పాలి .తమను స్టేజ్ మీద
సత్కరించు కుంటాం " అని చెబితే సదరు హీరో గారు ...
వచ్చి గంట ఉంది రెండు నిమిషాలు మాట్లాడాలి అంటే
" లకారం " తీసుకునే వారట. ఇక ఇటివల అంత డబ్బే .
కార్యక్రమం నిర్వాహకులు ఎంత దుర్మార్గులు ,నీచమైన
వారైన అనవసరం .డబ్బు లేదా పట్టు చీరలు ,నగలు ,
[ప్లాట్లు ఇస్తే చాలు ప్రముఖ హీరొయిన్ లు తో పాటు
తారలందరూ రడీ అవుతున్నారు .కాగా మధ్య
ఇంకొక పద్ధతి వచ్చింది .మన ఇంట్లో పెళ్లి అందరికి
తెలియాలంటే ..ఏదో ఒకటి చేయాలి ...పెళ్లి లో మన
వైపు వచ్చే బంధువుగా హీరొయిన్ లేదా యాంకర్
వస్తే ...." చుట్టుపక్కల వారు గొప్పగా చెప్పుకుంటారు .
ఏదోవిధంగా సంపాదించినా సొమ్ము ఇంట్లో మూల్గుతుంటే
ఇంకేం ?......డబ్బును బట్టి "తారలు దిగి వస్తారు ...మీరిచ్చే
దానిని బట్టి దగ్గరుండి సొంతవారిలా నటించి ..అక్షింతలు
వేస్తారు ...వీలుంటే నాలుగు స్టెప్ లు వేస్తారు .ఇంతకి వీరిని
ఏమంటారో తెలుసుగా ! "పేయింగ్ గెస్ట్లు" (డబ్బులు
తీసుకుని వచ్చే అతిధులు ).

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి