12, ఫిబ్రవరి 2011, శనివారం

ఈ ఆదివారం పిల్లల టాలెంట్ టెస్టు లు లేనట్లే ??

తమ బడుల్లో మెరికలు లాంటి విధ్యార్ధులను
నింపుకోవడానికి కార్పోరేట్ విద్యాసంస్థలు
చేస్తున్న ప్రయత్నానికి తొలిసారిగా తాత్కాలికంగా
బ్రేక్ పడింది .రాష్ట్రం లో పేరుగాంచిన మహా
కార్పరేట్ విద్యా సంస్థలతో పాటు ..ఆయా జిల్లాల్లో
ప్రతిభ గల విద్యార్దులను ఎంచుకోవడానికి
"టేలెంట్ టెస్ట్ "లు నిర్వహించడానికి సన్నద్ధమయ్యాయి .
ఎక్కువ మార్కుకు ఉచిత విద్య ,బహుమతులు ,ఫీజ్
తగ్గింపు అంటూ ప్రకటనల ద్వారా ఎర వేస్తున్నాయి .
నిజానికి అవి ప్రతి క్లాస్స్ కు ఎంట్రన్సు టెస్ట్ లే .అవి
పెట్టకూడదని సర్కార్ చెప్పడం తో వారు రూటు
మార్చి "టాలెంట్ " పదం చేర్చారు .పిల్లల ఫోటోలు
నిర్ణీత ఫీజ్ తో టెస్ట్ లు జరపడానికి రెడి అయ్యారు .అయితే
విషయం "మానవ హక్కుల కమిసన్ కు "వెళ్ళడం ,వారు
వార్నిగ్ ఇవ్వడం జరిగింది .దీంతో ఆదివారం జరపతలపెట్టిన
టాలెంట్ టెస్ట్ లకు బ్రేక్ పడింది . సాయత్రం నుంచి
ఆయా యాజమాన్యాలు పేరు నమోదు చేసిన పేరెంట్స్కు

ఫోనులు చేసి "వచ్చే వారం టెస్ట్ "అంటూ చెబుతున్నారట .మరి
వచ్చేవారానికి ఎలాంటి సడలింపులు వస్తాయో చూడవలసిందే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి