13, ఫిబ్రవరి 2011, ఆదివారం

అల్లుళ్ళు వచ్చారోచ్ ....( హాస్య కథ )

శ్రీను ,రవి స్నేహితులు .....పల్లెటూరి వారైనా ..చదువులో
ముందు ఉండేవారు ....డిగ్రీ లు పూర్తి ఖాళీ గా ఉన్నారు .
ఉద్యోగం వేట మొదలు పెట్టి చివరకు హైదరాబాద్ చేరారు .
తెలిసిన ఫ్రెండ్ రవి తో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు .కొన్ని
చోట్ల తిరిగారు గాని పని జరగలేదు .ఫిబ్రవరి పదమూడవ తేది
ఎన్ టి ఆర్ పార్క్ లో అందరు కల్సుకున్నారు .తాను
సాయంత్రం త్వరగా వస్తానని రేపు అందరు
ఇక్కడినుంచే కంపెని కి వెళ్దామని రవి చెప్పడంతో
మర్నాడు అంటే పద్నాల్గవ తేది సాయంత్రం రవి
కోసం పార్క్ దగ్గర కూర్చుని మాటలు కుంటున్నారు .
కొంత సేపటికి ఇద్దరు అమ్మాయిలు వచ్చి పక్కనున్న
బెంచ్ దగ్గర కూర్చున్నారు .వాళ్ళిద్దరూ మాటలను బట్టి
వారు అక్క చెల్లలు అనుకుని .....వాళ్ళ వంక చూడకుండా
ఏదో భాతాకాని మాట్లాడుకుంటున్నారు .అయిదు నిమిషాలు
తర్వాత వారిరివురు వీరితో మాటలు కల్పి ..తాము ఉద్యోగ
ప్రయత్నం చేస్తున్నట్టు చెబుతూ ..పైకి లేచి ..సడెన్ గా
కాళ్ళమీద పడడంతో ఏం చెయ్యాలో ఏం చెప్పాలో అర్ధం
కాలేదు .....రెండు నిమిషాలు అయిన వారు కాళ్ళు విడువక
పోవడం తో ఇద్దరు బలవంతంగా ...వారిని పైకి లేపారు .అంతే
ఎదురుగా యెర్రని వస్త్రాలు ధరించి ..నుదట కుంకుమ తో
కొందరు వ్యక్తులు కనపడే సరికి వీరికి ప్రాణాలు పోయినట్లయింది .
ఈలోగా ఇద్దరు వీర్రిద్దరికి బాగా దగ్గరయ్యారు .వచ్చిన వారిలో
ఒకడు తన చేతి లోని రెండు పసుపు తాళ్ళు తీసి "ఒరేయ్ ....మెళ్ళో
తాళి కట్టండి రా " అనే సరికి వణుకుతూ .....సార్ సార్ ...అదికాదండీ
అసలు వాళ్ళు ..మాకు ...""" అంటున్న వారి మాటలు పూర్తి కాకుండానే
.....కొంత మంది పట్టుకుని బలవంతం గా వాళ్ళ మెడలలో తాళి కట్టించారు .
"ప్రేమ దోమ అనకుండా ఇక బుద్ధిగా కాపరం చేసుకోండి ...." అంటూ చెప్పి
చక చక వెళ్లి పోయారు ....ఈలోగా నల్లటి గుండ్రాయి లాంటి వ్యక్తి
వచ్చి రాగానే .... అమ్మాయి లు ఇద్దరు వెళ్లి కాళ్ళకు నమస్కరించి
"" మమ్మల్ని ఆశ్వీర్వ దించు నాన్న ! నువ్వు చెప్పినట్టే చేసాం ,
మా పెళ్లులు అయ్యాయి ......అరిగో మీ అళ్ళులు..........."
జరుగుతున్న తతంగం చూసి ...శ్రీను ,రవి మూర్చపోయారు .
తెలివి వచ్చి చూసే సరికి ఎదురుగా నల్లటి ఆకారం
"బాబు మీరు ఇవల్ల్నుంచి నా అళ్ళులు ....వాలంటైన్స్ డే
పుణ్యమాని మాకు మీరు దొరికారు ..ఇంకో ఇద్దరు
అమ్మాయి లు ఉన్నారు ..వచ్చి ఏడాది వారికి ఇలాగే
పెళ్లి చేసి ఏదో అమ్మాయి ఇంటి దగ్గర కాలక్షేపం
చేద్దామనుకున్ట్టున్న "

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి