నేడు కవలల దినోత్సవం .ఈ సందర్భంగా మీకు ఓ
వింత విషయం అందిస్తున్నాను ."ఆ చెరువు లో
నీళ్ళు తాగితే కవల పిల్లలు ఖాయం " .నేటి కంప్యూటర్
యుగంలోనూ ఇలాంటి నమ్మకాలు ఏంటి? అంటే
చెప్పలేరు కాని జరుగుతున్నా పరిణామాలు పుట్టుకలు
గమనిస్తే ఆ నీటిలో ఏదో అద్భుతం ఉందని అనుకోవచ్చు .
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి సుమారు పాతిక
కిలోమీటర్లు దూరంల్లో దొడ్డిగుంట అనే గ్రామం ఉందట .
(రంగం పేట మండలం ). ఈ గ్రామం లో ఓ చెరువు ఉంది .
ఈ చెరువులో నీళ్ళు తాగిన వారికి చాలామందికి కవల
పిల్లేలే పుడుతున్నారు .గ్రామంలో ఇప్పటివరకు ఎనబై
కు పైగానే "కవల లు " ఉన్నారట . ఇటీవల కొన్నాళ్ళ
క్రితం ఓ మాస్టర్ గారు ఈ గ్రామానికి బదిలి పై వచ్చి
గ్రామస్తులు చెరువు విశిష్టత గురించి చెబితే నమ్మలేదట .
చివరకు ఆ చెరువు నీరు తాగిన ఆయన భార్య కవలలకు
జన్మ నివ్వడం తో ఆశ్చర్య పోయాడట ....ఈ నీటి లో ఏదో
మహత్తు ఉందని ...శాస్త్రీయంగా పరిశోదన చేస్తే ఆ నీటి
గురిచి తెలుసుకోవచ్చునని అంటున్నారు .ఎవరైనా
ఆసక్తి గలవారు దీనిపై పి హెచ్ డి కూడా చేయవచ్చు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి