23, ఫిబ్రవరి 2011, బుధవారం

టి వి నైన్ తో ఆడుకోవడానికి వర్మ రడీ

రామ్ గోపాల్ వర్మ కు పిచ్చెక్కింది .పైత్యం పట్టుకుని
పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తున్నాడు .అప్పలరాజు
అట్టర్ ప్లాప్ .ప్రేక్షకులు అంటే అసలు గౌరవం లేదు .
పబ్లిసిటి తప్ప సినిమా తీయడంలో శ్రద్ధ లేదు ....పిచ్చి
వర్మ అంటున్నారు ......................." ఇవన్ని నేను
అంటున్న మాటలు కాదు .సాక్షాత్తు టి వి నైన్ తెలుగు
చానల్ వారు లైవ్ గా ప్రసారం చేసిన కామెంట్లు .
బహుశా తెలుగు టి వి చానల్ ల చరిత్ర లోనే ఓ సినిమా
డైరెక్టర్ గురించి ఇంత ఘాటుగా కామెంట్ చెయ్యడం
ప్రధమం కావచ్చు .సాధారణం ఎంత చెత్త సినిమా అయిన
దాని గురించి టి వి లలో చాల రోజుల వరకు చర్చించారు .
వర్మ తాజా చిత్రం పరమ చెత్త అని చెబుతూ పైగా దిని పై
చర్చ జరగడం విశేషం . ఈరోజు ఏడు గంటలకు
మొట్టమొదటి వార్తగా వర్మ ను ఏకి పడేసారు .
మొదట్లో తెలుగులో శివ ,హిందీ లో రంగీల ,కంపెని
వంటి హిట్ సినిమాలు తీసి ...తర్వాత "షోలే " ను
చెడకొట్టి తర్వాతా పిచ్చిగా సినిమాలు తీయడం
అలవాటు అయ్యిందని .....యెడ పెడ వ్యాఖ్యానాలు
వెలువడ్డాయి .అంతే కాదు ..ప్రతి విషయానికి పబ్లిసిటి
తో స్టూడియో లు చుట్టూ తిరగడం అలవాటు అయ్యిందని
అలేగే సినిమాలో తెర వెనుక వ్యాఖ్యానాల పిచ్చి ముదిరిందని
....వర్మ తీరు తో టి వి నైన్ చెడుగుడు ఆడుకుంది
అయితే టి వి నైన్ తో ఆడుకోవడానికి వర్మ
రడీ అయ్యారు .చాన్నాళ్ పై పరువు నష్టం దావా వేసారు .
"ప్రేక్షకులు ......""అంటూ తాను వ్యాఖ్యానించినట్టు
గాటుగా అల్లిన పదజాలం బేస్ చేసుకుని లావ్ పాయింట్ తో
తన గౌరవానికి భంగం కల్గినట్టు ఆరోపిస్తూ ....కోర్టుకు వెళుతున్నారు
మరి "రవి ప్రకాష్ " ఎలా వర్మ ను దారికి తెచ్చుకుంటారో .....రవి నే
వర్మ దారిలో పెడతారో వేచిచూడవలసిందే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి