ఇంటర్నెట్ రాక తో దెబ్బతింటున్న తపాల వ్యవస్థను
కాపాడు కోవడానికి ఆ శాఖ చేస్తున్న ప్రయత్నాలు
అబినందనీయం గానే ఉన్నాయి .ప్రపంచంలోనే
అతి పెద్ద మన తపాలా శాఖ లో ఎన్నో మార్పులు
వచ్చాయి .కార్డ్ దగ్గర్నుంచి మొదలు నేడు మని
ట్రాన్స్ ఫర్ వరకు ఎన్నో పథకాలు.రైల్వే రిజర్వేషన్
స్పీడ్ పోస్ట్ తో పాటు ఉపాధి కూలీలకు సొమ్ము
సేల్లింపు వంటి సేవలు లభ్యమవుతున్నై .అయితే
ఉత్తరాలు అతంత మాత్రమే.దీనితో స్టాంప్ లకు
డిమాండ్ తగ్గింది .దీనిని భర్తీ చేసుకోవడానికి
కొత్తగా "మై స్టాంప్ " ప్రవేసిపెట్టినట్లు అనుకోవచ్చు .
నూట ఏభై రూపాయలు చెల్లిస్తే మన ఫోటో తో
స్టాంప్ లు ఇచ్చే పథకం .వీటికి విలువ ఉంటుంది .
కవర్ల పై వీటిని అంటించి పోస్ట్ చేయవచ్చు .మెయిల్
మన జీవితం లో భాగం అయి పోయిన ఇలాంటి
వాటిని వినియోగించుకుని తృప్తి పొందడమే కాదు
దేశానికి మేలు చేసినట్లు మన తపాలా శాఖ కు
ఊతమిచ్చినట్లు భావించ వచ్చు .ఈ స్టాంప్ పథకాన్ని
మరింత విస్తరించ్ వచ్చు .పెళ్లిలు వంటి శుభ లేఖలు
మాదిరిగా కూడా పెళ్లి కొడుకు ,పెళ్లి కూతురు ఫోటో లతో
కూడా స్టాంప్ తో కూడిన కవర్లు తీసుకు వచ్చి ప్రసారం
చేస్తే పలువురు సరదాగా ముందుకు వచ్చి వినియోగించు
కోవచ్చు .అలాగే వివిధ సంస్థలు కూడా తమ సింబల్ లేదా
ఫోటో తో స్టాంప్ వాడి తపాలా శాఖ కు చేయుంత నివ్వవచ్చు .
ముఖ్యంగా విద్యార్ధులలో "మై స్టాంప్ " పట్ల అవగాహన
కల్పిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి