పిచ్చి అభిమానం పిచ్చి చేష్టలు ......అభిమానం హద్దు మీరితే ..వెర్రి అభిమానం అవుతుంది .....తన అభిమాన హీరో గురించి గోరంత కొండంత గా చెప్పుకోవచ్చు తప్పు లేదు .అంతే కాని ఇతర తారల గురించి ..అవహేలంగా ...వేళాకోళంగా ..మరింత పచ్చిగా మాట్లడం ఏ మాత్రం మంచిది కాదు .ఈ మధ్య తమకు నచ్చని తారల గురించి చాల దారుణంగా
కొందరు వ్యహరిస్తున్నారు . ఇంటర్నెట్ లో రాయలేని విధంగా కామెంట్ చెయ్యడం ,ఎస్ ఎం ఎస్ లు పంపడం ......చెడు అలవాటుగా మారింది ....సినిమా వచ్చినపుడు సరదాగా సెటైర్లు వేసుకోవడం సహజం ..కాని అది పనిగా ....చాల చెత్త మాటలతో పాటు "మార్పింగ్ " చేసి నెట్ లో పెట్టడం చేస్తున్నారు .ఎంత బాధపడి ఉంటే యువరత్న బాల కృష్ణ పిర్యాదు
చేసి ఉంటారో అర్ధం చేసుకోవచ్చు .ముఖ్యంగా చిరు -బాలయ్య ల కుటుంబాల హీరోలు గురించే ఎక్కువగా "పిచ్చి అభిమానులు "పిచ్చపనులు చేస్తున్నారు .వీరిలో ఎక్కువగా ప్రవాస తెలుగు వారు ఉండడం దురదృష్టకరం . నెట్ వల్ల
ప్రపంచంలోని అన్నిప్రాంతాల వారు దగ్గర అవుతున్నారు .అయితే కొందరు వెర్రి వాళ్ళు చేసే వికృత పనులకు ఎంతో మంది భాద పడుతున్నారు ..ఈ దురాచారం భవిష్యత్ లో కనిపించరాదు .
ఇంతకి మరొక విషయం ఏమిటంటే సినిమాలు తారలు అందరూ అన్నదమ్ములుగానే ఉంటారు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి