ఝలక్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఝలక్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, నవంబర్ 2010, ఆదివారం

ఆదివారం కదా పడుకుని మా సార్ ....

తండ్రి -ఏరా రాము ...పొద్దుట ఎనిమిదింటి వెళ్ళావు.. ఇప్పుడు అయిదు అయింది .ఇంతవరకు బడిలో ఎమ్చేస్తున్నావురా..ఆటలు ఆడించినారా...
రాము -ఇవాళ బాలల దినోత్స్వం కదా అందరిని ఎనిమిదికి రమ్మన్నారు ....మాస్టర్ గారు రెండింటికి వచ్చారు .ఆదివారం కథ అని బేగా లేవలేదట...

11, నవంబర్ 2010, గురువారం

దోమతో కుట్టిన్చితే సరి

అప్పారావు -పంతులు గారు "పిల్ల "మరి పీలగా ఉందికదండి....కాళ్ళు మరి సన్నగా చీపురు పుల్లల ..

పెళ్లిల పేరయ్య -పిల్ల లావు అవ్వాలి అంతేగా ...కులెక్ష్ దోమతో కుట్టిన్చితే సరి

(సందర్బం -ఈరోజు జాతియా పైలేరియ నివారణ దినోత్సవం )

రాజీనామా చేసి ....ఆ బోర్డ్ మేమ్బెరవ్వండి

(సందర్బం -కూతురు కోసం ఫలితాలు ఆపించిన బోర్డు సభ్యుడు )


భర్త -ఇదేమీ గోల ..బంగారం ఐ ఏ ఎస్ జాబుకు రాజీనామా చేయమనటున్నావ్

భార్య -మీరు ఎలాగు రెండెల్లలో రిటైర్ అవుతున్నారు .అబ్బాయి ఇంజనీరింగ్ చదివి ఖాళిగా ఉన్నాడు .మీకు తెల్సిన నేతలను పట్టుకుని ......ఆ బోర్డ్ మెంబెర్ అయితే చాలు మనవాడికి ఉద్యోగం వచ్చినట్లే

పంతుల్లకు యూనిఫాం ఇద్దామా ?

విద్యామంత్రి -సార్ ,పిల్లలతో పాటు టీచర్ లకు మనమే యూని ఫాం ఇస్తే ఎలా ఉంటుంది ?

ముఖ్యమంత్రి -కొంప తీసి అంత పని చేయ కండి. యూనిఫాం ఇస్తే తర్వాత బూట్లు , టై ,బెల్ట్స్,బైకు అంటారు...తడిసి మోపెడవుద్ది.

(సందర్బం -జనవరి నుంచి బడి పిల్లలకు ఉచితం గా దుస్తులు )

10, నవంబర్ 2010, బుధవారం

డబ్బు సంపాదించకు ..నాన్నోయి

కొడుకు - నాన్నా నువ్వు నా కోసం ఎక్కువ డబ్బు సంపాదించకు

తండ్రి -అదేంటిరా ....ప్రతివాడి డాడి దగ్గర డబ్బు ఉండాలని కోరుకుంటారు ..

కొడుకు -డబ్బు ఉంటె కిడ్నాప్ చేస్తారగా .....

(సందర్బం -డబ్బు కోసం పిల్లల కిడ్నాప్ )

మంజుల నాయుడు నాకు సన్మానం చేయాలి

భార్య -మీరు నాకు ఈరోజు ఒక బహుమతి ఇవ్వాలి ?.మంజులా నాయుడు తో సన్మానాన్చేయాలి నాకు

భర్త -నా పెళ్లి కాని దగ్గర నుంచి నేను మొగలి రేకులు చూస్తునా .....ఆ సీరియల్ కు అవార్డ్ వచ్చింది .నాలాంటి వాళ్ళు చూసారు కాబట్టి ఇంత పేరు వచ్చింది ...ఆ సందర్బంగా నూకు సన్మానం చేయమని ఫోన్ చేయండి

సందర్బం -మొగలిరేకులకు నంది అవార్డ్

9, నవంబర్ 2010, మంగళవారం

ఇదేమి సెల్ల్రో బాబోయి

చంటి -నేను రోజు ఏమి చేసిన మా ఆవిడకు తెల్సి పోతున్నయిరా...

బంటి- ఎలా తెలుస్తుంది ..కొంపదీసి మన్మధుడి సినిమాలో ..ఆ మెషిన్ ...

చంటి -లేదురా ....ఇంటికెళ్ళగానే నా సెల్ తీసుకుని బాటరీ ,సిమ్ము తీస్తుంది ....అంతే ..నేను ఉదయం నుంచి మాట్లాడిన ప్రతిమాట వినిపిస్తోంది

సందర్బం -సిమ్ము, బాటరీ లేకుండానే పని చేస్తున్న సెల్ ఫోన్

పుట్టలో గుడ్లతో

కుటుంబరావు - అల్లుడు గారు ఎం చేస్తారు ?
అశారావు -ఏముంది బావ గారు ...ప్రతిరోజు ఏదొక వ్యాపారం ..పైసా పెట్టుబడి ఉండదు.ఈరోజు గుడ్డ్లు వ్యాపారం...పుట్టల్లో వేసిన గుడ్డ్లు తీసుకుని అమ్మేస్తాడు..(నాలుక కర్చుకుని ..)
(సందర్బం -ఈరోజు నాగుల చవితి )

8, నవంబర్ 2010, సోమవారం

అంటి తో డాన్సు చేస్తానంటే


చంటి -మన పేరెంట్స్ కు ఎంజాయ్ చేయడం తెలియదు ....చేస్తే కొడుతున్నారు

బంటి-ఎం కొట్టారా ?

చంటి -మా ఇంటికి వచ్చిన అంటీ తో డాన్సు చేస్తాను అని నేను మారం చేస్తే మా నాన్న అమ్మకోట్టారు ..ఆమెరికా పారిపోత్ధమనుకుంటున్నా

(సందర్భం -పిల్లలతో డాన్సు చేసిన ఓబేమ దంపతులు )

29, అక్టోబర్ 2010, శుక్రవారం

నెల నెల నెయ్యి ఇవ్వండి

ముఖ్యమంత్రి - చెప్పండి మొన్నే పీ ఆర్ సి ఇచ్చి జీతాలు పెంచాం. డబ్బులు పరంగా నేను ఏ హామీ ఇవ్వలేను .
ఉద్యోగులు -మాకు డబ్బులు ఇవ్వద్దు సార్ ,నెలకు రెండు కిలోల "నెయ్యి " ఉచితంగా ఇప్పిచండి .ఆరోగ్యంగా పనిచేస్తాం
సందర్భం -(కామన్వెల్త్ విజేత క్రీడాకారులకు క్వింటాల్ నెయ్యి కానుకగా ప్రకటించిన హర్యానా ప్రభుత్వం )

28, అక్టోబర్ 2010, గురువారం

డైరెక్టర్ గారు "ఆ సి డి " వచ్చిందా ?


నిర్మాత - డైరెక్టర్ గారు ఆ హాలిహుడ్ సినిమా సి డి వచ్చిందా ?ఏదో సీన్ చేయలన్నారుగా

డైరెక్టర్ -ఒరిజినల్ రావాలంటే అయిదు నెలలు పడుతుంది .నెట్లో ఆ పైరసీ సి డి తీసానులెండి ....ఇదిగో చూద్దాం రండి

(సందర్భం -సినిమా పైరసీ సి డి లను అరికట్టాలని పి డి యాక్ట్ తేవాలని ముఖ్యమంత్రిని కోరిన నిర్మాతలు )

నీ "బాబు" కడతాడా (ఝలక్ )


మాలచ్చి - చంద్రబాబు కట్టద్దు అన్నాడుగా ..భాకి కట్టడం మానేద్దామా మామా?

చంటోడు -పిట్టి మొహమా ...ఇప్పిడు కట్టకుండా బాబు చెప్పినట్టు మానేస్తే .....బాకీ రద్దవ్వకపోతే పది వేలు ముప్పయి వేలు అవుతాయి ...అప్పుడు నీ "బాబు "కడతాడా ?

(సందర్బం -మైక్రో రుణాలు చెల్లించ వద్దని చంద్రబాబు పిలుపు )

27, అక్టోబర్ 2010, బుధవారం

పోస్టులు పంచేయండి మంత్రి గారు (ఝలక్ )

విద్యా మంత్రి -సెక్రటరీ .... ఉపాధ్యాయ పోస్టులు భర్తీ తలపోటుల ఉంది .కాస్త ఐడియా ఉంటె చెప్పవయ్య
సెక్రటరీ -సార్ డబ్బై శాతం ఎం ఎల్ ఏ లకు, ముప్పయి శాతం ఎం ఎల్ సి లకు వాటాలుగా ఇచ్చేయండి .ఏమైనా గొడవలు వస్తే వాలే చూసుకుంటారు

24, అక్టోబర్ 2010, ఆదివారం

నా ప్రేయసి పేరుపెట్టండి

సుబ్బారావు -కలక్టర్ గారు ఈ లక్ష తీసుకోండి ...

కలక్టర్ -ఎందుకండి ? రెడ్ క్రాస్ కి విరాళామా?

సుబ్బారావు-మీ కార్యాలయాంకి నా ప్రేయసి పేరుపెట్టండి

(సందర్భం -తెలుగు లలిత కళాతోరణాన్కి రాజీవ్ పేరు పెడతారని జీవో .....)

21, అక్టోబర్ 2010, గురువారం

ముఖ్య మంత్రులే తిట్టుకొంటున్నారు



రవి - డాక్టర్ గారు మా వాడు స్కూల్ లో అందర్నీ తిడుతున్నదండి .వాడ్ని

ఎలా కంట్రోల్ చేయాలో చెప్పండి సర్

డాక్టర్ -ముఖ్య మంత్రులే బూతులు తిట్టుకొంటున్నారు.మీ వాడు లెక్క ?



(సందర్భం -రోశయ్య ,చంద్రబాబుల తిట్టుకొన్నారు )