అవి ఇవి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అవి ఇవి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, ఆగస్టు 2011, గురువారం

దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రం విద్యార్దుల్లో ప్రతిభ వెలికి తీయడానికి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది .ఈ కార్యక్రమానికి "శాస్త్ర "

దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రం విద్యార్దుల్లో ప్రతిభ వెలికి తీయడానికి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది . కార్యక్రమానికి "శాస్త్ర " అని పేరు పెట్టారు.సేకరించిన సమాచారం ప్రకారం .. .సాధారణంగా జరిగే క్విజ్ వంటి కార్యక్రమాలకు భిన్నంగా విద్యార్దుల్లో దాగి ఉన్న శాస్త్రీయ అవగాహన ,అనువర్తనాలు వంటివి తెల్సు కోవడానికి దీనికి వేదిక గా చేసుకున్నారు .శాస్త్ర లో మొత్తం మూడు రౌండ్లు ఉంటాయి .మొదటి రౌండ్ లో "అవగాహన " లో అయిదు ప్రశ్నలు యాబై మార్కులు .రెండవ రౌండ్లో "పరిశోధన " రౌండ్ లో విద్యార్ది చేసిన సైన్సు ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఇరవై మార్కులుకు ఉంటుంది .మూడవ రౌండ్ లో "పరిశీలన " లో ఒక దృశ్యాన్ని చూపించి లీడా ప్రయోగం చేసి... దానిలో ఉన్న సైన్సు సంగతి అడుగుతారు ......ఎక్కువ మార్కులు వచ్చిన వారు ఎపిసోడ్ విన్నర్ అవుతారు ...వచ్చే నెల లో కార్యక్రమం దూరదర్శన్ సప్తగిరి లో ప్రసారం కానుంది .ప్రతి శనివారం సాయిత్రం మరియు ఆదివారం శాస్త్ర ప్రసారం చేయడానికి సన్నాహాలు చేస్తునట్టు తెలుస్తోంది .మంచి కార్యక్రమాన్ని ఎన్నుకున్నందు నిర్వాహకులకు అభిననదనలు చెప్పవల్సిందే .

14, ఆగస్టు 2011, ఆదివారం

మన జాతీయ పర్వదినం రోజు టూరులా?

సెలవు అనేసరికి ఎవ్వరికైనా హుషారు తెస్తుంది .వరసగా సెలవు వస్తే ఇక ప్రణాళికలు..టూర్లు ..అయితే గొప్ప రోజులను సెలవుగా తీసుకోవడం మంచిది కాదు .శుక్రవారం నుంచి వరుసగా సెలవలు వచ్చాయ్.దీంతో చాలామంది కుటుంబ పరంగా టూర్ వేసున్నారు .అయితే మన జాతీయ పర్వదినం రోజు కూడాకొంత మంది ఉద్యోగులు కాని ..ఇతరులు కాని జాతీయ జండా కార్య క్రమానికి హాజరు అవుతారా? లేదా ? అన్నది డౌటే .ఎందరో మహనీయుల త్యాగఫలం అందిన ఆగస్ట్ పదిహేను పెద్ద పండుగ గా జరుపు కోవాలి .పిల్లలలో అవగాహన కల్పించి దేశ భక్తీ నింపాలి ....

26, జులై 2011, మంగళవారం

కత్రిన కైఫ్ కోసం కమలనాధులు పరుగులు


కాంగ్రెస్స్ నేత రాహుల్ గాంధీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించిన నటి కత్రిన కైఫ్ కోసం కమల నాధులు తెగ వెంట పడుతున్నారట .చాల డేరింగ్ గా మాట్లాడిన ఆ సుందరిని పట్టుకుని ప్రసారం చేసుకుంటే తిరుగు లేదు అనుకున్తునారట .ఇప్పటికే ఆ పార్టిలో తారలు శత్రుఘ్న సిన్హా ,వినోద్‌ ఖన్నా ,స్మృతి ఇరానీ ,హేమమాలిని ఉన్నారు .ఇక కత్రిన వస్తే కాంగ్రెస్స్ పై కత్తేనట

23, జులై 2011, శనివారం

సీరియల్స్ లో బాలికలే విలన్లు !!!?

ఇప్పటికే టి వి సీరియల్ లో లేడీ విలనిజం పెరిగి పోయింది .ఆడవాళ్ళను చాల ఘోరంగా చూపుతూ టి వి చూసే జనం పై ప్రభావం చూపుతున్నారు .తాజాగా బాలికలను కూడా చెడ్డ వారిగా చూపిస్తున్నారు .జీ టి లో ప్రసారం అవుతున్న సీరియల్ నందు బాలికను ఏకంగా విలన్ చేసి చెడ్డ పనులు చేసే అమ్మాయిగా చిత్రీకరించారు .రాత్రి సమయంలో ప్రసారం అయ్యే ఇలాంటి వాటిని పొరపాటున పిల్లలు చూస్తె దాని ప్రభావం వారిపై ఉంటుంది .ఇలాంటివి లేకుండా చూడవలసిన బాధ్యత అందరిపై ఉంది .

6, జులై 2011, బుధవారం

."ఆషాడం లో అల్లుడు గారు అత్త ఇల్లు గడప చేరితే ....ఏమవుతుంది అంటే

ఆషాడం లో అల్లుడు అత్తవారి ఇంటికి రా కూడదు అనే ఆచారం ఉంది ."ఆషాడం లో అల్లుడి అత్తవారి ఇల్లు గడప దాటితే ..మామ లేదా అత్తా కు గండం '' అంటూ ఉంటారు ...అయితే ఆచారం పెట్టడం వెనుక పెద్దల లాజిక్ ఉంది .ఆషాడ సమయంలో వర్షాలు కురుస్తాయి . సమయంలో వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉంటాయి .ఇటువంటి సమయంలో పెళ్లి కొడుకు అత్తవారి ఇంటనే ఉంటే ...పనులు ఆగి పోతే ..చాల ఇబ్బంది .మాములుగా రమ్మంటే కొత్త పెళ్లి కొడుకు పెళ్ళాన్ని విడిచి వస్తాడా ? రాదు అందుకే పెద్దలు బెదిరింపు ..సెంటిమెంట్ తో టచ్ చేసారు .
ఆషాడం సాంప్రదాయకం వెనుక మరో కారణం కూడా కనిపిస్తుంది .ఆషాడం అంటే ఇంచుమించు జూలై నెలలో అమ్మాయి గర్బం దాలిస్తే ...ఆమెకు పురుడు మండే ఎందాల్లో వచ్చి ఇబ్బంది పడుతుంది .........ఏది ఎమైనా " పెద్దల మాట చద్ది మూటే"

24, జూన్ 2011, శుక్రవారం

అన్నం వండనని..అమ్మొ,పెళ్ళామో స్ట్రైక్ చేసినట్లు అన్నదాతలు .....

అన్నం వండనని..అమ్మొ,పెళ్ళామో స్ట్రైక్ చేస్తే ఏమి అవుతుంది ? వామ్మో ! ఊహించుకోవడానికే భయం వేస్తుంది ...అలాంటిది పంట పండించి అన్నం పెట్టె అన్నదాతలు ?మేం పండించ లేము ....అని కూర్చుంటే ..ఏముంది ? తినడానికి తిండి కరువు ...పలు జిల్లాల్లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించడం ఆందోళన కల్గించే అంశం .తమ న్యాయమైన కోరికలు తీర్చాలని వారు కోరుతున్నారు .సర్కార్ దీనిపై స్పదించక పోవడం మరి దారుణం .....అన్నదాతల ఆందోళనలు ప్రభుత్వం అర్ధం చేసుకుని సమస్య పరిస్త్కరించాలి .మన దేశం లో ఇప్పటికే పంట పండించే వారు తగ్గి పోతున్నారు ....దీంతో విదేశి ఆదాయం వచ్చే ఎగుమతులు ఆగి మనేమే దిగుమతి చేసుకోవలసిన పరిస్తితి వచ్చింది ,,,,..క్రాప్ హాలిడేలు వస్తే ఇక అంతే సంగతులు !

2, జూన్ 2011, గురువారం

నిశ్చితార్దం జరిగిందా ఇక అంతేరో ...ఆ మాటలకు అంటూ లేదు

సెల్ ఫోన్ లో ఎక్కువగా మాట్లాడేవారు ఎవరు అంటే "యూత్ " అని టక్కున చెబుతారు ..అయితే వారిలో చాల ఎక్కువగా దారుణం గా మాట్లాడుకునేది మాత్రం పెళ్లి కుదినవారే .పెళ్లి చూపులు జరిగిన తర్వాత పెళ్లి జరిగే వరకు వీళ్లా మధ్య జరిగే సంభాషణలకు అంతూ పొంతూ లేదు .....ఆగకుండా రెండు నుంచి మూడు గంటలు మాట్లాడేవారు ఉన్నారంటే అతిశయోక్తి లేదు .మొన్న మధ్య టీచర్ గారికి పెళ్లి నిశ్చితార్దం జరిగింది ...టీచర్ ట్రైనింగ్ లో ఆమె కు ఉదయం పదకొండున్నరకు పెళ్లి కొడుకు నుంచి ఫోన్ వచ్చిదంటే ......మళ్ళి రెండున్నర వరకు అల మాట్లాడుతూనే ఉందట .మధ్యలో భోజనం చేస్తూనే మాటలు ..ఇది చూసిన వారు ..అసలు ఇంత సేపు ఏమి మాట్లాడుకున్నారు ? అని ఆశ్చర్యపోవడం చూసిన వారు వంతయింది ...ఇలాంటివి ప్రతి చోట ఉన్నాయి ...పెళ్లి కుదరగానే ....అమ్మాయి గారికి ఫోన్ కొని ఇవ్వడం తో తతంగం మొదలవుతోంది ...ఇక పెళ్లి అయ్యివరకు అంతే .అయితే అంత ఎక్కువ సేపు మాట్లాడం మంచింది కాదు అంటే వింటారా ?(పెళ్ళైన నెల తరవాత రోజుకి ఒక ఫోన్ కాల్ చేయడం కష్టమంటారా ?)

14, మే 2011, శనివారం

ఇరవై రూపాయిలతో ఏ సి లో నిద్ర ?????!!!!

మనసుంటే మార్గాలు బోలెడు అన్నారు పెద్దలు ...నిజమే ... ఫంక్సన్ నిమిత్తం మొన్న రాజమండ్రి వెళ్ళా ...మధ్యాహ్నం విందు తర్వాత ఇంటికి బయలుదేరే ముందు బయటకు వస్తే తెలిసింది ....ముందు టెండ చుర్రుమని తగులు తుంటే ......వేడిగాలి చెవులను తాకి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే వామ్మో !అనవసరంగా బయలుదేరాను అనుకుని మనసులో తిట్టుకుని .....ఏం చెయ్యాలి ..అనుకునే లోగా ఎదురుగా పోస్టర్ చూసి .......అయిడియా తో గబా గబా పరిగెట్టాను.....వరుసగా రంభ ,ఊర్వశి..మేనక .....ఫుల్లు సి హాల్స్ ......హాల్లోకి పోతే చాలు ఎండ ను జయించవచ్చు .....రంభ ,మేనక అప్పటికే ఫుల్లు ...ఇక ఊర్వశి ....వామ్మో సినిమా తలపోటు .....అనుకుని ....అయినా సినిమా చూడడానికి వచ్చానా నాలో నేను సమర్దించుకుని ..నలబై రూపాయిల టిక్కెట్ తెసుకుని లోపాలకి వెళ్ళా !.....హాల్లో అడుగుపెట్టగానే హిమాలయాల్లో అడుగు పెట్టినంత సంబరం .... సి చాల బావుంది .కుర్చీ ఇంకా బావుంది ..... ..అటు ఇటు చూసా ...యాబై రూపాయలు ఫుల్ కాలేదు కాని నలబై ఫుల్ అయిపోయాయి ....ఎదురుగా ఇరవై సీట్లు ఖాళీగా కనిపించాయి ...కొంత సేపటకి......పోలో మంటూ జనాలు ....ఆపసోపాలు పడుతూ .....కుర్చీ లో కూర్చున్ని హమ్మయా అనుకుంటూనారు......తెర మీద బొమ్మ ... పది నిమిషాలు చూసేసరికే ఎదోలో అనిపించింది ....అటు ఇటు చూసా హాల్లో సగం మంది నిద్ర పోతూ కనిపించారు ..ఇరవై రూపై టికెట్ గలరిలో అయితే .....హాయిగా నిద్ర పోతునారు .....నేను అల ఇలా చూసి నిద్రలోకి జారుకున్నా .....జనం హడావిడి తో హటాత్ గా లేసా!అప్పటికే సి కట్టినట్టునారు చల్లదనం తగ్గుతోంది ....డోర్ లోంచి బయటకు వచ్చేసరికి మళ్ళి సెగలు ........అయితే ఎండ పెద్దగా లేదు ....అలా మెయిన్ రోడ్ కేలదామని ముందుకు కదిలా ..రకరకాల వస్తువులు అమ్ముతున్నవారిని చూస్తూ ..ఆశ్చర్య పోయా ..సినామా హాల్లో ఇరవై రూపాయిల గ్యాలరీలో కనిపించిన వారిలో ఎక్కువ మంది వీరే .......
"రోజుకి ఇరవై రూపాయలు పోతే పోయాయి గాని ప్రాణం హాయిగా ఉంటుంది .. ఎండ లో ఎలాగు బేరం లేదు ......గంటకు కూల్ డ్రింక్ తాగాలి ..హాయిగా ఇరవై రూపాయలతో ... సి లో పడుకోవచ్చు ......"
వారి మాటలు విని అవాక్కయ్యాను ...ఇదేదో బావున్నట్టుంది అన్పించింది తర్వాతా ..

7, మే 2011, శనివారం

ఈనాడు ,సాక్షి లలో ఇవి ఎప్పటికైనా కనిపించగలవా ?.ఆ దమ్ము ఆ రెండు పత్రికలకు ఉన్నాయి ?

ఈనాడు ,సాక్షి దిన పత్రికలలో కొన్ని చూడగలమా ? ఎప్పుడు చూడలేమా? ఈనాడు రామోజీ రావు ను రాజ గురువుగా గురువింద గింజ గా ,,,ఫోర్ ట్వెంటి గా ..పచ్చ రాతలు పిచ్చి రాతలు రాసేవాదేగా అభివర్ణిస్తూ ..ప్రతి రోజు సాక్షి లో కధనం ఉంటుంది ...అదే విదంగా ...అవినీతి చక్రవర్తి కొడుకు ...పాపల పత్రిక ..గనుల దొంగ ......అంటూ ఈనాడు వారు జగన్ గురించి కథనం రాస్తారు .......అవిన్ని చూసి రోజు జనం నవ్వుకుంటారు ...
అయెతే రోజు పేపర్ చదివే ప్రజలకు .... రెండు పత్రికల్లోను ఒకటి చూద్దామని వెతుకుతారు ....కాని కనిపించదు .
సాక్షి పత్రికలో ..చాన్నాళ్ లో రామోజీ ,చంద్రబాబు ...సి ఏం కిరణ్ వంటి వారి గురించి రకాల రకాల కార్టూన్లతో కామిడి చేస్తారు ..
కనీసం మాటవరస కైనా ఒక్క కార్టూన్ కూడా జగన్ గురించి ఉండదు
.
అదే పరిస్తితి ..ఈనాడు లో రామోజీ రావు గారి గురించి ఎన్నో కోర్టు కేసులు ...అవి పత్రికలో కనిపించవు .
.
కనీసం రామోజీ పై కార్టూన్ ఉండదు ...
పూర్వ కాలం పలువురి పెద్దలు తమ మీద తామే చమత్కారంగా జోకులు వేసుకునే వారు ...
ఎవరి పై నైన అవలీలగా సెటైర్ వేయగల కార్తునిస్తూ శ్రీధర్ గారు ! మీ గురువు గారి పై జోక్ వేయ లేరా ?
అలాగే సాక్షి వారు మీ పత్రిక లేదా చానల్ లో జగన్ గురించి సటైర్ వెయ్యండి చూద్దాం .!.
పేపర్ అన్నాక ..చాన్నాళ్ అన్నాక ..ఇలానివి కూడా ఉన్నప్పుడే జనం మెచ్చుకుంటారు ..తమ డబ్బా కొట్టుకోవడం తప్పు లేదు కాని ప్రజలు కోరుకునేది చెయ్యాలి ..... దమ్ము రెండు పత్రికలకు ఉన్నాయి ?

26, ఏప్రిల్ 2011, మంగళవారం

సాయి లేరు ..ఇదివరకటిలా నిధులు వస్తాయా ?

ఎంతటి మహోన్నతుడు కైనా ఏదో ఒక వివాదం ఉంటుంది .ఎంతో మంది దేవుడు గా కొలిచే సత్య సాయి బాబా కు కూడావివాదాలు ఉన్నాయి .గాలిలో వస్తువులు ,శివలింగాలు వంటివి సృష్టించడం వంటి విషయాలకు సంబంధించి ....విమర్శాలూఉన్నాయి .అయితే ఆయన చేసిన సేవలు ,ప్రభోదాల ముందు ఇలాంటివి పట్టించోకోనవసరం లేదన్నంది పలువురి నమ్మకం .నిజమే కావచ్చు .ఎన్నో మంచి విషయాలుచెప్పడం ....సమాజ సేవ పై స్ఫూర్తి కల్గించడం ..ఇతరుల పట్ల ప్రేమ ...ఆయన జీవన విదానం ...అన్ని చూస్తే మనుషుల్లోదేవుడే ....సాయి లోని " సేవాగుణం " చూడవలసిందే .ఎన్నో దేశాల్లో అన్ని ట్రస్ట్ లు ఉన్నాయంటే సాయి ఎంతటి ఉన్నతుడో అర్ధమవుతుంది ...సాయి చుట్టూ ఉన్నవ్యక్త్తుల గురించి మాత్రేమే అనుమానాలు ...సాయి మీద నమ్మకం తో వేలాది కోట్లు పుట్టపర్తికి చేరాయి ..భక్తులు ఇచ్చిన ఆ నిధులు కాపాడు కోవాలి ..నేడు మహానుబావుడు లేరు ....ఇదివరకటిలా నిధులు వస్తాయా ? చెప్పలేము ...సాయి స్థాపించిన సంస్థలు నిరంతరం పనిచేయాలంటేశాశ్వత నిధులు అవసరం ...ప్రస్తుతం ఉన్న పుష్కలంగా ఉన్న నిధులు సద్వినియోగం చేయాలి . విషయలంలో ప్రభుత్వం సరైన చర్య తీసుకోవాలి .

19, ఏప్రిల్ 2011, మంగళవారం

కడప లో కాలుతున్న డబ్బు !!!!!!!!!!????

డబ్బు ..డబ్బు ..కడపలో ఎక్కడ చూసిన డబ్బే ......ప్రజలు (ఓటర్లు ) ఎంత అందుకుంటూ న్నారో తెలియదు కాని కట్టలుకట్టాలే అట ....కొన్ని చోట్ల డబ్బును కూడా కాల్చెయ్య దాన్ని బట్టి ఎంత డబ్బు విర్జిమ్ముతున్నారో అర్ధమవుతుంది . పార్టి .. పార్టి అని లేదు ..అన్ని తమకు అందినంత .....తెగ ఖర్చు చేస్తున్నారు ..ఎవడబ్బ సొమ్మని ..ప్రజల సొమ్మేకదా..""పాపం సొమ్ము ""మళ్ళి ప్రజలకే ...ఎన్నికైన తర్వాత ఎలాగు చెయ్యరని కాబోలు ఓటర్లు కూడా చెయ్య చాపుతున్నారుఅంత డబ్బు మాయం ..ఎంత ఖర్చు పెట్టిన ఎవరి ఎన్ని ఓట్లు వస్తాయి ?ఏమో దేవుడికే తెలియాలి .
.....

9, ఏప్రిల్ 2011, శనివారం

తల్లి దండ్రుల ప్రవర్తన బావుంటేనా అక్కడ వారి పిల్లల చదువు పూర్తి అవుతుంది??

తల్లి దండ్రుల ప్రవర్తన బావుంటేనా అక్కడ వారి పిల్లల చదువు పూర్తి అవుతుంది అట ....ఎక్కడో ఏదో దేశం కాదు మన దేశంలోనే పద్ధతి అమలు చేస్తున్నారు .మంబాయి సరిహద్దు పట్టణం అంధేరీ లోని ప్రైం అకాడమి స్కూల్ నందుమొదలుపెట్టారట .స్కూల్ లోనే కాదు బయట కూడా విద్యార్ది మంచి పౌరుడు గా ప్రవర్తించాలి ....అది రావాలి అంటే పెద్దల్లోఅంటే తలిదండ్రులలో మార్పు రావాలి ..ఇది ఎలా తెలుస్తుంది ...సర్టిఫై చెయ్యాలి .!ఎవరు ? న్యాయాధికారి .స్తానికన్యాయాధికారి నుంచి "ప్రవర్తన బావుంది " అని ద్రువికరించిన సర్టిఫికేట్ తీసుకోవాలి ..లేక పోతే వారి పిల్లలు తొమ్మిది,పదితరగతులకు వెళ్ళలేరు ......సో ...తమ పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు మారక తప్పదన్న మాట .
...

8, ఏప్రిల్ 2011, శుక్రవారం

అవినీతి అంతానికి దీక్ష చేస్తున్న అన్నా హజారే కు మద్దతు తెలుపుతో ప్రధాన మంత్రి కి ఈ -మెయిల్ చెయ్యండి ఇలా

http://www.avaaz.org/en/stand_with_anna_హజారే

అవినీతి అంతానికి దీక్ష చేస్తున్న అన్నా హజారే కు మద్దతు తెలుపుతో ప్రధాన మంత్రి కి -మెయిల్ చెయ్య వచ్చు
సైట్ అడ్రస్ http://www.avaaz.org/en/stand_with_anna_

7, ఏప్రిల్ 2011, గురువారం

అన్నే హాజరు కు మద్దత్తు ఇవ్వవలసిందే

అవినీతి అంతానికి అన్నా హజారే చేస్తున్న దీక్ష యువత కు ఆదర్శం . రోజుల్లో కూడా డూ ఆర్ డై అంటూ హజారే దీక్షచెయ్యడం గర్వించదగినది .జన లోక్ పాల్ బిల్ ప్రవేశ పెట్టె విదమ కేంద్రం పై ఒత్తిడి పెంచడం జరుగుతోంది .హజారే కు అన్నిచోట్ల మద్దతు పెరుగుతోంది .....బాలిహుడ్ తారల తో పాటు మన మోహన్ బాబు లాంటి వారు దీక్షకు మద్దత్తుపలుకుతున్నారు .మనం కూడా మద్దత్తు పలుకుదాం

జపాన్ కు ."దెబ్బ మీద దెబ్బ "

జపాన్ లో మళ్ళి భూకంపం రావడం చాలా దారుణం .ఇప్పటికే మొన్నటి సునామి కి జపాన్ అతలాకుతలం అయ్యిందిసుమారు పదివేల మంది ప్రాణాలు కోల్పోయారు .చిన్న దేశం అయినప్పటికీ పెద్దగ అభివృద్ధి చెంది ప్రపంచానికి ఆదర్శంగానిలిచింది .ఇలాంటి దేశానికి ముప్పు రావడం మంచిది కాదు ."దెబ్బ మీద దెబ్బ " అంటే ఇదేనేమో !
.