13, ఫిబ్రవరి 2011, ఆదివారం

అద్భుతమైన అనుభూతి పొందాను "-ఎన్ టి ఆర్

ఇన్నాళ్ళకు తానూ అద్భుతమైన అనుభూతి
పొందాను "అని యువతరం హీరో నందమూరి
తారక రామ రావు ఆనందం వ్యక్తం చేసారు .
నిజమే మరి ఇప్పటి వరకు ఆయా సినిమాల్లో
ఉత్తిత్తి బంధుత్వాలు,ప్రేమలు మధ్య జీవించిన
(నటించిన ) ఎన్ టి ఆర్ కు ఇది నిజమైన
ఆనందమే .తల్లిదండ్రులు ..బంధువులు ,స్నేహితుల
మధ్య ఈరోజు శుభ పత్రిక రాసిన తరుణం లో ఈ
హీరో చాల ఆనందంగా కనిపించాడు .మామ చంద్రబాబు
నాయుడు ,అసలు మామ నార్నే శ్రీనివాస రావు ,తండ్రి
హరికృష్ణ ల సమక్షంలో మే అయిదు నా పెళ్లి చేయడానికి
నిర్ణయించారు .మంచి అల్లుడిగా ,శ్రివారుగా ఎన్ టి ఆర్
నిజ జీవిత పాత్ర పోషించి మంచి పేరు తెచ్చుకోవాలని
ఆశిద్దాం .బెస్ట్ విషెస్ ....చెబుదాం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి