కొన్ని ఫంక్షన్లు లేదా శుభకార్యాలు లేదా ప్రత్యేక
కార్యక్రమాల్లో హీరోలు ..హీరొయిన్ లు (సినీతారలు )
,సెలబ్రిటీలు కనిపిస్తుంటారు .అలాగే కొన్ని పెళ్లిలల్లో
తారలు ,టి వి యాంకర్లు కనిపించి కనువిందు చేస్తుంటారు .
ఇది చూసి సదరు కార్యక్రమం చేసే వ్యక్తి కి "వీరంతా తెల్సు
ఏదైనా అదృష్టం ఉండాలి " అనుకునేవారు కనిపిస్తారు .కాని
అదంతా "డబ్బు మహిమ అని ....కాసులు పుచ్చుకుని
వాళ్ళు వచ్చారు ." అని తెలిసిన వారు కొంతమందే ఉంటారు .
ఇటివలి కాలం లో "పేయింగ్ గెస్ట్ లు " చాల ఎక్కువ అయ్యారు .
విద్య సంస్థల లేదా ఇతర సంస్థల ముఖ్య కార్యక్రమాలకు సేలిబ్రిటి
లను పిలవడం అలవాటైంది .అయితే వీరిలో చాలామంది డబ్బు
పుచ్చుకుని వస్తున్నారు .గతం లో ఓ ప్రముఖ హీరో ని "తమరు
రావాలి .రెండు మంచి మాటలు చెప్పాలి .తమను స్టేజ్ మీద
సత్కరించు కుంటాం " అని చెబితే సదరు హీరో గారు ...
వచ్చి ఓ గంట ఉంది రెండు నిమిషాలు మాట్లాడాలి అంటే
"ఓ లకారం " తీసుకునే వారట. ఇక ఇటివల అంత డబ్బే .
కార్యక్రమం నిర్వాహకులు ఎంత దుర్మార్గులు ,నీచమైన
వారైన అనవసరం .డబ్బు లేదా పట్టు చీరలు ,నగలు ,
[ప్లాట్లు ఇస్తే చాలు ప్రముఖ హీరొయిన్ లు తో పాటు
తారలందరూ రడీ అవుతున్నారు .కాగా ఈ మధ్య
ఇంకొక పద్ధతి వచ్చింది .మన ఇంట్లో పెళ్లి అందరికి
తెలియాలంటే ..ఏదో ఒకటి చేయాలి ...పెళ్లి లో మన
వైపు వచ్చే బంధువుగా ఓ హీరొయిన్ లేదా యాంకర్
వస్తే ...." చుట్టుపక్కల వారు గొప్పగా చెప్పుకుంటారు .
ఏదోవిధంగా సంపాదించినా సొమ్ము ఇంట్లో మూల్గుతుంటే
ఇంకేం ?......డబ్బును బట్టి "తారలు దిగి వస్తారు ...మీరిచ్చే
దానిని బట్టి దగ్గరుండి సొంతవారిలా నటించి ..అక్షింతలు
వేస్తారు ...వీలుంటే నాలుగు స్టెప్ లు వేస్తారు .ఇంతకి వీరిని
ఏమంటారో తెలుసుగా ! "పేయింగ్ గెస్ట్లు" (డబ్బులు
తీసుకుని వచ్చే అతిధులు ).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి