29, నవంబర్ 2010, సోమవారం

"చిరంజీవి " రాజకీయ ఆట అడుకోవడాంకి ఇదే మాంచి ఛాన్స్ ?


ప్రస్తుత రాజకీయంలో చిరంజీవి హాట్ హాట్ గా మారనున్నారా? పరిస్థితి చూస్తే అలానే అనిపిస్తోంది .కిరణ్ కుమార్ రెడ్డి కొత్త సి ఎం అయి ప్రభుత్వం లో ప్రక్షాళన చేపట్టిన నేపధ్యం లో చిరు నేడు కీలకంగ్గా మారారు .జగన్ వర్గాన్ని చెక్ పెట్టె విదంగా నిర్ణయాలు జరుగుతున్నాయి .జగన్ వర్గీయులుగా ముద్ర పడ్డ ఎం ఎల్ లను పక్కన బెట్టిన తరవాత జగన్ తిరుగుబాటు జెండా ఎగురవేస్తే ......తలెత్తే పరిస్తితిని ముందే ఊహించి కాంగ్రెస్ అధిష్టానం చిరును ముందే మచ్చిక చేసుకుని లైన్ లో పెట్టింది .పద్దెనిమిది మంది ఎం ఎల్ ప్రజా రాజ్యం మద్దత్తు కిరణ్కు అవసరమవుతుంది .కాగ ప్రజారాజ్యం మంత్రి వర్గంలో చేరుతుందా లేదా అన్నది అనుమానమే .చేరితే ఎదురయ్యే పరిణామాలను పార్టి అంచనా వేసు కుంటున్నది .మంత్రి వర్గంలో చేరితే ప్రభుత్వ పనులు అన్నిటింకి వంత పాడాలి .విమర్శలు చేయరాదు .అలాగైతే పార్టీ భవిష్యత్ ఏమిటి ? బయట ఉంది మద్దతు ఇస్తే ? ఎంత వరకు ప్రభుత్వాని ఆడించ వచ్చు అనేవి చిరు ముందున్న ప్రశ్నలు .?ఏది ఏమైనా చిరు రాజాకీయంగా ఆటడుకోవడంకి మంచి ఛాన్స్ వచ్చింది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి