8, ఏప్రిల్ 2011, శుక్రవారం

అన్నా హజారేకు మద్దత్తు గా నిలిచే తెలుగు సిని "ఠాగూర్ "లు ఎందరు .?.రోడ్ పైకి రాగలరా ?

వెయ్య మైళ్ళ దూరమైనా ఒక అడుగుతోనే మొదలు అన్నట్టు ...మన దేశాన్ని పీడిస్తున్న భూతం "అవినీతి అంతానికి"అన్నా హజారే తో ఉద్యమం ఆరంభం కావడం సంతోషం కల్గించే అంశం .ఉద్యమించడానికి వయస్సు తో సంబంధం లేదని ఆయన నిరూపించారు .యువతకు ఆయన స్ఫూర్తి . సమయం లోనే అందరు కల్సి రావాలి .ఇది రాజకీయానికి అతీతం అయినది .ముఖ్యంగా సిని తారలు నడుం బిగించాలి .తెర పై సూపర్ హీరో లో అవినీతి పై పోరాటం చెయ్యడం కాదు ...నిజజీవితం లో అందుకు తగ్గ కృషి చేయాలి .మెగాస్టార్ చిరంజీవి "ఠాగూర్ " తో పాటు అందరు హీరోలు ఏదో ఒక సినిమాలో అవినీతి పై యుద్ధం చేసిన వారే ......ఇప్పుడు మంచి సమయం వచ్చింది ....రోడ్ పైకి వచ్చి పోరాటంలో పాలు పంచుకోవాలి ...అభిమానులు తప్పక వెంట వస్తారు ... తెలుగు హీరోలు ! రండి !! రా గలరా ?(ట్వి ట్టర్,ఫసే బుక్ లో కాదు ..బయటకు రావాలి )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి