30, ఏప్రిల్ 2011, శనివారం

పూరి గారు ! ఆత్మహత్యలు ఎలా చేసుకోవాలో చెప్పరా !ఎలా షూట్ చేసుకోవాలో చెప్పారా

అగ్ర దర్శకులు కూడా ఎందుకు సినిమా కథ పట్ల నిర్లక్ష్యమ్ వహిస్తున్నారో "నీను నా రాక్షసి " సినిమా చూస్తే అర్ధం అవుతుంది .పోకిరి వంటి బంపర్ హిట్ సినిమా తీసిన పూరి యేనా సినిమా తీసింది అన్నట్టు కనిపిస్తోంది ...సినిమా వినోదం ప్రదానం ..వాణిజ్య విలువలు ఎలాను ఉంటాయి ...అలాగే సామాజిక దృక్పథం ఉండాలి ....సమాజంలో సమస్య పోట్టికోచ్చినప్పుడు దానిని ఆధారం గా కథ ఉంటే ఉంటే ఖచ్చితంగా దానికి పరిష్కారం ఏదో సినిమాలో ఉండాలి ..అంతేకాని సమస్య పెంచే విదంగా ఉండరాదు .పూరి తాజా సినిమా ఆలేనే ఉంది .ఆత్మహత్య నేపథ్యం నీ నా రాక్షసి ...ఆత్మహత్యల చేసుకున్తావారికి ...ఇది తప్పు అన్న భావన లేకుండా పోయింది ....సినిమా గురించి అసలు ఆలోచించని ప్రేక్షకుడు అయితే .."ఆత్యహత్య చేసుకోవచ్చు " అనే విదంగా అర్ధం చేసుకునే ప్రమాదం ఉంది .
ఇదొక తిక్క సినిమా ఏమో ........అనిపించే విధంగా కథ సాగింది ...ఆత్మ హత్యాలు చేసుకునే వారిని షూట్ చేసే పాత్రలో హీరొయిన్ ?ఎంత తిక్కగా ఉంది కథ ?

ప్రపంచం లో ప్రతి నలబై సెకన్ లకు ఒకరు ఆత్మహత్య చేసుకున్తునాట్టు లెక్కలు ఇచ్చిన దర్శకుడు పూరి కథను మాత్రం ఖూనీ చేసినట్టు అగుపిస్తోంది .వాస్తవ విరుద్దమైన అంశాలు .....అసంబద్దంగా ఏదో అతికినట్టు ..కొన్ని చోట్ల మరి ఎబ్బట్టుగా ఉన్నాయి .టేకింగ్ లో తిరుగులేని పూరి పనితనం సినిమాలో కనిపించదు .హీరో ఆత్మహత్య చేసుకోవడానికి సిద్దమైన సంఘటన లో హీరొయిన్ ను పోల్చకపోవడం .......మరి చెవిలో పువ్వు పెట్టి నట్టు ఉంది .ఏదో మొఖానికి ముసుగు వేస్తె పోల్చలేరా .....అస్తమాను పాదమస్తకం పరిశీలించే హీరో .....ఆమెను గుర్తు పట్టలేకపోవడం ...హీరో గారు చద్దమనుకోవడం విడ్డూరంగా ఉంది ....ఆలి ,ముమైత్ఖాన్ మధ్య కామిడి ...పరిధి మించి అశ్లీలంగా ఉంది .స్క్రీన్ ప్లే బాగున్న ....అన్ని చావులే అన్నట్టు వినోదం కోసం వచ్చే ప్రేక్షకుడిని చావగోట్టినట్లుంది.ఫైట్స్ దగ్గర పోకిరి పోలికలు అక్కడక్కడ కనిపించిన ..గ్లామర్ తార ఇలియానా ను మాత్రం "పిచ్చి అమ్మాయి "లా చూపించడం రుచించదు .ఆమె నటన లో మార్కులు వచ్చి ఉండవచ్చు కాని ....అభిమానులు రిసీవ్ చేసుకోలేరు .రానా నటన మెరుగు పరచుకోవాలి ..ఫోటోగ్రఫి ఓకే ...మ్యూజిక్ ఏవరేజ్ ....విలన్ అభిమాన్యును ఉపయోగించు కోలేదు .వెనిస్ నగరం అందాలు కాస్త కొత్తగా ఉంటాయి .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి