3, ఏప్రిల్ 2011, ఆదివారం
కప్పు తో పాటు శాంతి మోసుకొచ్చిన భారత్ క్రికెట్
ఈ సారి ప్రపంచ కప్పు మనకు దక్కడం భారత్ లోని అందరికి ఆనందాన్ని మిగిల్చగా మరో వైపు పొరుగు దేశాల మధ్య శాంతి పెంపోదించింది అనుటలో సందేహం లేదు .ముఖ్యం గా సెమి ఫైనల్ సందర్బం గ పాకిస్తాన్ ప్రధాని తో పాటు పలువురు క్రికెట్ అభిమానులు రావడం ..మనం స్నేహం గా ఆతిధ్యం ఇవ్వడం జరిగింది .ఎప్పుడు పాక్ తో క్రికెట్ జరిగిన ఆ దేశం లోనే చాలామంది కసి తో భారత్ ను శత్రువుగా చూసే వారు .విద్వంసం సృష్టించేవారు .మన చేతి లో ఓడి వెళ్ళిన తమ దేశ ఆటగాళ్లను చాల దారుణం గా అవహేళన చేసే వారు .కాని నేడు వారిలో మార్పు కనిపిస్తోంది .ఆట ను స్పిరిట్ గా తీసుకోవడమే కాదు ...భారత్ ను కూడా గౌరవిస్తునారు .క్రికెట్ పేరు తో నైన పాక్ తో మంచి సంభందాలు ఏర్పడితే భూలక స్వర్గం కాశ్మీర్ లాంటి చోట్ల అనవసర బయాలు ఉండవు .ఆలాగే శ్రీలంక లో కూడా క్రికెట్ శాంతి ని చేకూర్చుతుందని ఆశిద్దాం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి