1, మే 2011, ఆదివారం

"నవ్వు లేనిదే నువ్వు లేవు " నవ్వు నవ్వించు -నేడు నవ్వుల దినోత్సవం (ఆవుకి పురుడు వచ్చిందట)

"నవ్వు లేనిదే నువ్వు లేవు " నిజం .....హాయిగా నవ్వని వాడు ఉన్నా లేకున్నా ఒకటే . ప్రతి రోజు కనీసం పది నిమిషాలుహాయిగా నవ్వితే ..చాలా రోగాలు మాటు మాయం .నవ్వు ఆనందాన్ని ఇవ్వడమే కాదు ఆరోగ్యాని పంచే అద్భుత మందు అని వైద్యులు చెబుతున్నారు .పగలబడి నవ్వినపుడు మెదడు ఆజ్ఞా ప్రకారం స్వర పేటిక పై మూత ఆదమడం వల్లే నవ్వువస్తుందని శరీర ధర్మ శాస్త్రం చెబుతోంది .నవ్వినపుడు ఎండార్ఫిన్ ఎక్కువ విడుదల అయితే మనసుకు ఆహ్లాదంకల్గుతుంది .ఎన్నో వైరస్ లు దూరం చేయ గల శక్తి నవ్వుకు ఉందని తాజా పరిశోధనలు తెల్సుతున్నై .నేటి యాత్రిక యోగంలో హాసం వంటి నవ్వులు పుట్టుకు రావడం ఆహ్వా నిన్చాతగినదే .ఒంటరిగా కాకుండా నల్గురితో పావు గంటా హాయిగానవ్వండి .........
ఆమెరికా నుంచి కుర్రాడు పల్లెటూరు లోని తన తాత దగ్గర కు వచ్చాడు .....వారి మధ్య
మనవడు -తాత మన ఆవుకి పురుడు వచ్చిందట .
తాత -తప్పు నాన్న ....ఆవు ఈనింది అనాలి ......
(మనవడు అలాగే నని చెప్పి .....రెండు రోజుల తర్వాత )
మనవడు -తాత ! మన పనిమనిషి ఈరోజు ఈనింది అట

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి