14, ఏప్రిల్ 2011, గురువారం

తెలుగు లో తీన్ మార్ ఫ్రెష్ సినిమాగానే ఉంది

పవన్ కళ్యాన్ అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచిన "పులి " తర్వాత వచ్చిన తీన్ మార్ వారిలో ఆనందాన్నినింపుతుంది .హిందీ(లవ్ ఆజ్ కల్ )లో సినిమా చూసే వారు తక్కువే కాబట్టి తెలుగు లో తీన్ మార్ ఫ్రెష్ సినిమాగానే ఉందిఅయితే హిందీ లో ముందుగా చూసిన వారికి ఆవరేజ్ గా కనిపిస్తుంది .పవన్ -త్రివిక్రమ్ కాంబి నేషన్ కోసం సినిమాచూడవచ్చు .త్రివిక్రమ్ పంచ్ లు సినిమాకు ప్రాణమని చెప్పవచ్చు .పవన్ ద్విపాత్రలో మాత్రం ప్లాష్ బ్లాక్ కథ లో హీరోఅర్జున్ కు మాత్రేమే ఎక్కువ మార్కులు వేయవచ్చు .చాల చోట్ల "ఖుషి " బద్రి " సినిమాల తరహాలో పవన్ చాల బాగాకనిపించి కనువిందు చేసాడు .పాటలు బయట వినడానికి అన్ని బావున్న రెండు మాత్రేమే తెర పై బావున్నై ."ఆలె ఆలెపాట సూపర్.త్రిష లో పెద్దగా అందం కనపడలేడనే చెప్పవచ్చు .ఫైట్స్ సహజంగా ఉన్నాయి .కొత్త హీరొయిన్ కృతి బయటఎలా ఎలా ఉంటోందో కాని మేకప్ చాల ఓవర్గా ఉంది .హిందీ లో కథ మక్కి మక్కి గా తెరకు ఎక్కించిన దర్శకుడు జయంత్ మరింత శ్రద్ధ వహించి ఉంటే సినిమా మరింత బెస్ట్ గా వచ్చేది .
.

1 కామెంట్‌: