2, ఏప్రిల్ 2011, శనివారం

అభిమానులను నిరాశ పరిచిన "శక్తి ",,,,

ఎన్నో అంచనాలతో శుక్రవారం విడుదల అయిన "శక్తి " ఎన్ టి ఆర్ అభిమానులను నిరాశ పరిచింది అని చెప్పక తప్పదు.యంగ్ టైగర్ ఎన్ టి ఆర్ ఎనర్జీ ని మాత్రం ఉపయోగించుకోలేక పోయారు .కథ లో కాస్త బలం ఉన్నా..కథనం మాత్రం హీనం .దియేటర్లో ప్రేక్షకుడి కి అయోమయం .....ఆసక్తి ..ఆత్రుత కల్గించలేక పోయాయి .ఆయా సినిమాల్లో సినిమా రీళ్ల ముక్కలు కల్పి ..అతుకుల బొంతగా సినిమా తయారు చేసినట్టు కనిపించింది. సినిమా తీరు పరిశీలిస్తే ...రాజమౌళి హిట్ మూవీ "మగధీర " ను చూసి మెహర్ కథ తయారు చేసుకుని ......అతి విశ్వాసం తో డై రెక్షన్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది ....అలాగే సినిమాలో చాల బిట్స్ కాపి అని సగటు ప్రేక్షకుడికి కూడా తెలుస్తుంది .
ఎన్ టి ఆర్ అనగానే అభిమానులు 'డాన్సు ,డైలాగ్స్ ,ఫైట్స్ "ఆశిస్తారు .అయితే డాన్సు లో చప్పట్లు కొట్టించే స్టెప్స్ కరువయ్యాయి .డైలాగ్స్ మరి ఘోరం .పవర్ఫుల్ రుద్ర పాత్ర లో కూడా డైలాగ్స్ చప్పగా ఉన్నాయి .ఫైట్స్ పర్వాలేదు .ఇంటర్వల్ మూడు వచ్చే ఫైట్ మాత్రం చాల బావుంది .
అశ్విని దత్ సినిమా అనగానే భారితనం ,కొత్తదనం ప్రేక్షకులు ఆశిస్తారు .సినిమాలో చాలా భారి తారా గణమే ఉంది .ఎం లాభం ?వారిని సరిగా ఉపయోగించుకోవాలి కదా ?దేవగిల్,జాకిశాప్ ,సోనూసాదూ,పూజ బేడి,మంజరి ,ఎస్ పి బాలు ,ప్రభు ,వినోద్ కుమార్, నాజర్ ,బ్రమ్మానందం ,అలీ,వేనుమాదావ్ ,ధర్మవరపు .....హీరొయిన్ ఇలీయాన చాలామందే ఉనారు .
కథ -మన దేశాన్ని రక్క్షించే అష్ట దశ పీఠాలకు మూలమైన ''''''శక్తి " పీఠం రహస్య ప్రదేశమ లో ఉంటుంది .రాజకుటుంబానికి చెందినా( ఎస్ పి బాలు ,ప్రబు,ఇలియానా ) వీరికే మాత్రమె అది తెలుసు .ప్రతి ఇరవై ఏడు సంత్సరాలకు ఒక సారి గ్రహణం తర్వాత నాగ సాధువు (నాజర్ ) అద్వర్యం లో పూజ చేస్తారు . రహస్య ప్రదేశం తలుపులు తెరవాలి అంటే ఒక ప్రత్యేక శూలం .....అలాగే దారి చూపే "జ్వాలాముఖి " ఉంటాయి . పీఠాన్ని రక్షించడానికి రక్షకుడు రుద్ర (ఎన్ టి ఆర్ ) ఉంటారు .రాజ కుటుంబం లో పని చేసే జానకి (జాకి ) దుర్బుద్ధి కారణం గా ఈజిప్ట్ లోనే తెగ కు చెంది దుర్మార్గులు (దేవగిల్ ,పూజబెడి ) శక్తి పీఠాని నాశనం చెయ్యడానికి పన్నాగం వేస్తారు .రుద్ర తన ప్రాణాలు అర్పించి మరి పీఠాని కాపాడతాడు . ఘటనలో రుద్ర భార్య మగ బిడ్డ జన్మ నివ్వడం ... పసికూన రక్షింప బడడం జరుగుతుంది . బాలుడే షిండే దంపతుల వద్ద పెరిగి దేశ భద్ర సంస్థ లో "శక్తి స్వరూప్ "గా ఎదుగు తాడు.
మళ్ళి ఇరవై ఏడు సంత్సరాల తర్వాత మళ్ళి అదే కథ మొదలవుతుంది .రహస్య ప్రదేశం ద్వారాలు తెల్సే శూలం జాకి దగ్గర ఉండిపోటింది .దీనిని దక్కించు కోవడానికి పూజబెడి ప్రయత్నుస్తుంది .మరో వైపు ప్రభు దగ్గర జ్వలముకి తన కూతురు (ఇలియానా ) కారణంగా మాయమవుతుంది .జాకి దగ్గర శూలం తీసుకోవడానికి ప్రభు చేసిన ప్రయత్నాలు ఫలించవు .చివరకు దుస్త శక్తులను ఎదిరించి మళ్ళి శక్తి పీఠం దగ్గర ఎలా పూజలు చేసారు అన్నదే మిగిలిన కథ .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి