11, ఏప్రిల్ 2011, సోమవారం

ఎన్ని దేవుళ్ళు ఎన్ని మార్కులో ?

కొడుకు -రాముడు ,కృష్ణుడు ,అల్లాః ,ఏసుప్రభు ,సాయిబాబా ,ఈశ్వరుడు ,కనక దుర్గ ,వెంకటేశ్వర స్వామీ ,అలివేలుమంగ ..అయ్యప్ప ,లక్ష్మిదేవి ,విష్ణు ,నరసింహ స్వామీ ,శర్డిసాయి ,సత్యనారయన్ స్వామి ,......(రాస్తూ చదువుతూ ) డాడి..ఇంకా కొన్ని దేవుడి పేర్లు చెప్పు .......
తండ్రి -ఎందుకురా ?పొద్దుట నుంచి రాస్తున్నావ్ !
కొడుకు -తర్వాత చెబుతా..ముందు ఇంకో దేవుడు పేరు చెప్పు
తండ్రి -సరే ...చదువు ఇచ్చే వినాయకుడి పేరు మర్చి పోయావు
కొడుకు -థాంక్యూ డాడి ! అమ్మ నువ్వో పేరు చెప్పు
తల్లి - చదువుల తల్లి....
కొడుకు -సరస్వతి దేవి ......అబ్బ చాల పేర్లు రాసా ఇంకా కొబ్బరి కాయాలే కొట్టాలి
తల్లిదండ్రులు -ఏంట్రా దేవుళ్ళు -కొబ్బరి కాయాలు ...ఏంటి సంగతి ?
కొడుకు -నేను టెన్త్ పబ్లి రాసాను కదా .. రోజు నుంచే పేపర్లు దిద్దుతున్నారు .నా పేపర్లు ఎవరు దిద్దుతారో ఏమోవారికి దేవుడు ఇష్టమో తెలియదు ..అందుకే నాకు బాగా మార్కులు వెయ్యాలని దేవుడు వాళ్లకి చెప్పేల అందరికికొబ్బరి కాయలు కొడతా ...

..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి