25, అక్టోబర్ 2010, సోమవారం

అయిదు రోజులు పని హుషారుగా చేస్తే ..

ఐదురోజుల పని దినాలు ప్రవేశ పెట్టాలని ప్రభుత్వ ఉద్యోగులు కోరడం బాగానే ఉంది. చాలా దేశాలల్లో ఈ విదానం భాగానే అమలు జరున్తోంది.అయితే మన రాష్ట్రంలో ఈ విదానం అమలు చేస్తే యెంత వరకు ప్రయోజనం ఉంట్టుంది అన్నది అనుమానమే. గతంలో మూడు సార్లు అమలు చేసి ఎత్తేసారు .మళ్ళీ మొదలు అంటునారు .ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు మేలు ,ఇందనం ఆదా,ట్రాఫ్ఫిక్ ఇక్కట్లు ఉద్యోగులలో ఉల్లాసం వంటివి వినిపిస్తున్నారు ...అయితే ఆరు రోజులా పని దినాలోన్నే కొన్ని పనులు పూర్తి కావటం లేదని అయిదు రోజులు విధానం లో మేలు ఏమి జరుగుతుందన్న అభిప్రాయాలు తలెత్తుతాయి .రెండు రోజులు సెలవు వస్తే శుక్రవారం కూడా పెట్టుకుని సదరు ఉద్యోగి తీరుబడిగా సోమవారం మధ్యాహ్నం వస్తే తమ పని ఏమిటని ప్రశ్నించేవారు లేకపోలేదు .ఏ విధానం అమలు చేసినా ప్రజలకు మేలు జరగాలి .నా అభిప్రాయం ప్రకారం "ఎన్నిరోజులు పని చేసామన్నది కాదు ....ఎంత పని చేశారన్నదే ముఖ్యం "

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి