26, ఏప్రిల్ 2011, మంగళవారం

సాయి లేరు ..ఇదివరకటిలా నిధులు వస్తాయా ?

ఎంతటి మహోన్నతుడు కైనా ఏదో ఒక వివాదం ఉంటుంది .ఎంతో మంది దేవుడు గా కొలిచే సత్య సాయి బాబా కు కూడావివాదాలు ఉన్నాయి .గాలిలో వస్తువులు ,శివలింగాలు వంటివి సృష్టించడం వంటి విషయాలకు సంబంధించి ....విమర్శాలూఉన్నాయి .అయితే ఆయన చేసిన సేవలు ,ప్రభోదాల ముందు ఇలాంటివి పట్టించోకోనవసరం లేదన్నంది పలువురి నమ్మకం .నిజమే కావచ్చు .ఎన్నో మంచి విషయాలుచెప్పడం ....సమాజ సేవ పై స్ఫూర్తి కల్గించడం ..ఇతరుల పట్ల ప్రేమ ...ఆయన జీవన విదానం ...అన్ని చూస్తే మనుషుల్లోదేవుడే ....సాయి లోని " సేవాగుణం " చూడవలసిందే .ఎన్నో దేశాల్లో అన్ని ట్రస్ట్ లు ఉన్నాయంటే సాయి ఎంతటి ఉన్నతుడో అర్ధమవుతుంది ...సాయి చుట్టూ ఉన్నవ్యక్త్తుల గురించి మాత్రేమే అనుమానాలు ...సాయి మీద నమ్మకం తో వేలాది కోట్లు పుట్టపర్తికి చేరాయి ..భక్తులు ఇచ్చిన ఆ నిధులు కాపాడు కోవాలి ..నేడు మహానుబావుడు లేరు ....ఇదివరకటిలా నిధులు వస్తాయా ? చెప్పలేము ...సాయి స్థాపించిన సంస్థలు నిరంతరం పనిచేయాలంటేశాశ్వత నిధులు అవసరం ...ప్రస్తుతం ఉన్న పుష్కలంగా ఉన్న నిధులు సద్వినియోగం చేయాలి . విషయలంలో ప్రభుత్వం సరైన చర్య తీసుకోవాలి .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి