22, జనవరి 2011, శనివారం

హీరో ల వైఖరి మారితేనే సినీ నిర్మాణ వ్యయం తగ్గేది ?

పెరిగి పోతున్న సిని నిర్మాణ వ్యయాన్ని తగ్గించ దానికి
నిర్మాతల మండలి సూచనల కమిటి వేసింది .మార్గ
నిర్దేశకాలు పొందు పరిచింది .అయితే ఇవ్వన్ని ఎంత
వరకు అమలు అవుతాయి అన్నదే ప్రశ్నార్ధకం .ముఖ్యం
గా మొదటి సూచన -నటినటులు ఆలస్యం చేయకుండా
నిర్ణీత సమయాంకి రావాలి ..ప్రస్తుతం ఎంత మంది హీరో
హీరొయిన్ లు ,విలాన్లు ...ఇతర ఆర్టిస్టులు ఖచ్చిత
సమయాంకి షూటింగ్ ప్రాంతానికి వస్తున్రో అందరికి
తెల్సు .నాటి ఎన్ టి ఆర్ తరం మాదిరిగా వచ్చేవారు
ఎందరు ? తన విడిది ప్రాంతానికి తానూ చెప్పిన
కారు రాకపోతే రడీ అయిన రాణి నటీమణులు ఉన్నారు .
ముందుగా వీరి మైండ్ సెట్ మారాలి .
నటి నటుల పారితోషకాలను నిర్మాతే స్వయంగా మాట్లాడు
కోవాలని ...అయుదు విడతలగా చెక్ రూపంలో
చెల్లించాలని ......సెట్స్ ,సామగ్రి ఖర్చు ....ఇతర ఖర్చులు
అన్ని ముందు గానే స్టేట్మెంట్ వేసుకుని నిర్మాణ వ్యయాన్ని
సూచనల కమిటికి సమర్పించాలని సూచించారు .అదే మించిన్తే
నిర్మాత అనుమతి కావాలని ..లేక పోతే జరిమానా విదిస్తామని
హెచ్చరించారు ...ఇంకా చాల చెప్పారు ......వాటిలో కనీసం
పది శాతం ఖచ్చితంగా పాటించినా నిర్మాణ వ్యయం తగ్గుతుంది .
ముందుగా హీరోల వైఖరిలో మార్పు రావాలి .సినిమా కు వచ్చ్సిన
లాబాలను బట్టి పారితోషకం తీసుకుంటే మంచింది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి