2, జనవరి 2011, ఆదివారం

హైదారాబాద్ అంటే రాష్ట్రంలో అందరికి ఇష్టమే

నెల ఆరవ తేదిన తెలంగాణా గురించి నిర్ణయం జరగబోతోంది .
రాష్ట్రం రెండు ముక్కలు అవుతుందో లేదో కాని హైదారాబాద్ తెలుగు
ప్రజలందరి ప్రతిబింబం అని అర్ధం వచ్చేలా శ్రీ కృష్ణ కమిటీ పేర్కునే
అవకాశం ఉన్నట్టు నా అభిప్రాయం .కమిటి సభ్యులు ఆయా పత్రికలతో
మాట్లాడిన విధానాని బట్టి చూస్తే హైదారాబాద్ అంటే రాష్ట్రంలో అందరు
ఇస్టపడుతున్నట్టు చెప్పడం జరిగింది ...దీనిని బట్టి చూస్తే హైదారాబాద్
విషయంలో కమిటి ప్రత్యేక సిపార్సులు చేసే అవకాశం కనిపిస్తోంది ...
చూద్దాం ..

1 కామెంట్‌:

  1. అసలు సమస్య హైదరాబాదే కదా మాష్టారూ.
    రెండోది జల వనరులు. ఈ సమస్యలే లేకుంటే జిల్లాకో రాష్ట్రమిచ్చినా ఎవరూ కిమ్మనరు. వుమ్మడి రాష్ట్రం కొఱకు సాధించుకొని భాగ్యనగరం చుట్టూ అయిదు జిల్లాల్లో కేంద్రీకృతమైన కేంద్ర ప్రభుత్వ భారీ పరిశ్రమలూ,ల్యాబులూ, యాన్సిలరీస్, తద్వారా అధికమైన ఉద్యోగ వనరులూ , వ్యాపార వాణిజ్య రంగాలూ ,నిర్మాణ రంగామున్నూ,అవన్నీ మిగతా రాష్ట్రంలో నూ నిర్మించి యిచ్చి వుపాధి రంగం అభివృద్ధిచెందిన తరువాత భాగ్యనగరం ఏ ప్రాంతంతో కలిసివున్నా , విడిగా విడి పోయివున్నా,భాగ్యనగరు తెలంగాణా తో కలిసి పోయి ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయినా ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు . ఎందుకంటే ప్రస్తుత సీమాంధ్ర పారిశ్రామిక వుపాధి పరంగా , పొదుగులేని గోవు లాటిది.వుపాదికోరకు వెంటనే పారిశ్రామిక ప్రగతికి సీమాంధ్రలో
    చర్యలు చేపట్టినా ఆ కార్యక్రమాలు వుపాధి యోగ్యంగా లబ్ది చేకూరాలంటే కనీసం ఇరవై సంవత్సరాలు సమయం కావాలి . అప్పటి వరకు ఆ ప్రాంతంలో పుట్టి పెరుగుతున్న పది ,పదిహేను ఇరవై సంవత్సరాల వయసున్న యువతకు , భాగ్యనగరంలో వుద్యోగలబ్ది రాదు, సీమాంధ్రలో లేదు, నిర్భాగ్యుడయి,నిరుద్యోగంతో ఖ్రుద్దులై యువత, తీవ్ర వాదులుగా మారే స్థితి.
    తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా విడివడాలంటే, భాగ్యనగరం పై తీసుకొనే నిర్ణయమే కీలక పాత్ర వహిస్తుంది. యదా తద స్థితిలోభాగ్యనగరాన్ని ఏ తెలంగాణాకో ,ఆంధ్రకో, సీమకో,వుత్తరాన్ధ్రకో అప్పజేపుతామంటే ఎవరూ హర్షించరు.ఈ రోజువరకూ అందరూ ఆంధ్రప్రదేసీయులే . వుమ్మడి సంపద అది యే రూపంలో వున్నా అన్ని ప్రాంతాలకూ స్థాలీపులాక న్యాయం జరిపి నప్పుడు ఎవరు విడిపోదామన్నా,ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. ఒక్క రాజకీయులు తప్ప. వుమ్మడి వనరులైన అన్ని వంటకాలతో వండి వడ్డించిన విస్తరి
    భాగ్యనగరాన్నియే ఒక్కరో ఎగేసుకు పోదామంటే మిగిలినవారు ఎమై పోవాలి?.

    రిప్లయితొలగించండి