31, జనవరి 2011, సోమవారం

"మేడం " కాంగ్రెస్స్ స్విచ్ తోనే ప్రజారాజ్యం చిరు కు వెలుగు ? షాకే కొడితే ??

పాపం చిరుకు ఏదో ఒకటి చేయక తప్పడం లేదు .
రైల్ ఇంజిన్ లా రాష్ట్ర రాజకీయాలలో దూసుకుపోయి
నాటి ఎన్ టి ఆర్ రికార్డ్ అధికమించి కేవలం ఆరు
నెలల్లోనే సి ఎం అవుదామనుకున్న "చిరు "
ఊహించని విధంగా ప్లాప్ అయ్యారు .కీ రోల్
పోసిద్దాం అనుకున్న సరిపోని ఎం ఎల్ తో
కుదర లేదు .రైల్ ఇంజిన్ మార్చి మరో గుర్తు
వచ్చిన ప్రజారాజ్యం లో ఉదయించే కిరణాలు తగ్గి
అస్తమయ కిరణాలు ఎక్కువ అయ్యాయి .ప్రజా రాజ్యం
లో ముసిరినా చీకట్ల లను తొలగించడానికి చిరు చేస్తున్న
ప్రయత్నాలు టార్చ్ లైట్ మాత్రం గానే ఉన్నాయ్ . నేపద్యంలో
కనీసం టూబ్ లైట్ కాంతి నింపుకోవడానికి ....చిరు పడిపోకుండా
నడవడానికి కాంగ్రెస్స్ కరెంట్ వాడుకోవక తప్పలేదు .ప్రస్తుతం
రాజకీయ తెర కాబట్టి "మేడం " వేసే స్విచ్ ను బట్టి చిరు
వెలగ వలసి ఉంది .కాంగ్రెస్స్ కరెంట్ అందుకున్న తర్వాత
షాక్ అయిన కొడుతుంది లేదా దానిలో నైన కల్సి పోవాలి

చీఫ్ మినిస్టర్ కాలేక పోయినా...కనీసం సెంట్రల్ మినిస్టర్ అవుతున్న "చిరు "?

చీఫ్ మినిస్టర్ కాలేక పోయినా...కనీసం సెంట్రల్ మినిస్టర్
అయ్యే ఛాన్స్ చిరంజీవికి వచ్చేసింది .ఈరోజు జరిగిన
పరిణామాలతో కొద్ది రోజుల్లోనే మంత్రి కిరీటం అందు
కునే అవకాసం వచ్చింది.కాంగ్రెస్స్ నేత అంటోని తో
ఈరోజు చిరు జరిపిన సమాలోచనలతో ప్రజారాజ్యం
భవిష్యత్ కు తెర లేపినట్లయింది .వస్తున్న సమాచారాన్ని
బట్టి పార్టి కి రాష్ట్రం లోని మంత్రి వర్గం లో కనీసం
నాలుగు పోస్టులు వస్తాయంటున్నారు .ప్రస్తుతం
కష్టకాలం లో ఉన్న కాంగ్రెస్స్ ను ఆదుకుంటున్న
"ఆపత్బాన్దవుడు " చిరుకు గోరవ ప్రదమైన స్తానం
ఇవ్వనున్నారు .సి ఎం పదవికి ఛాన్స్ లేదు కాబట్టి
కేంద్ర మంత్రి మాత్రమె మిగిలింది .రాజ్య సభ ద్వారా
ఎంపిక చేసి చిరును సెంట్రల్ మినిస్టర్ హోదా ఇవ్వవచ్చు.

ఒకవేళ చిరు కావాలంటే ఉప ముఖ్య మంత్రి పదవి
ఖాళీగా ఉంది .ఈ పదవి అందుకోవచ్చు .ఏమైనా
పదవి ఖాయం .

30, జనవరి 2011, ఆదివారం

సుమ సుమే సుమా

సుమ సుమే సుమా. మంచి యాంకర్ .రాత్రి
టి వి లో తన భర్త రాజీవ్ కనకాల ,పిల్లల్లు
రోసన్ ,మనస్వని తో కల్సి చేసిన సందడి చాల
భావుంది ."జీన్స్ " నందు రాజీవ్ పాల్గున్నారు .
అన్నోన్య దాంపత్యం ఉట్టి పడేలా వారు వ్యవహరించారు .
ముఖ్యంగా పిల్లలు కూడా తెలుగుదనాంకి దగ్గరగా
కనిపించారు .నాన్న ,అమ్మ అనే మాటలు పలు
మార్లు వినిపించాయి .యాంకర్ గా ఆట అడిస్తూనే
భార్యగా "వడ్డానం చేయుంచు " అంటూ ఇల్లాలి పాత్ర
పోషించింది .తెలుగు నెల పై పుట్టక పోయిన తేనే లాంటి
తెలుగుదనం నింపుతున్న ఆమెను చూసి మనం గర్వపడాలి
మాతృభాష తెలుగు అయిన ...వచ్చిరానట్టు ..ఆంగ్ల్ పదాలు
కలిపేసి ఫోజులు ఇచ్చే మిగతా తెలుగు అన్కర్లు సిగ్గుపడాలి

ల్యాప్ టాప్ నా కూతురుకే

ఎం ఎల్ కూతురు - డాడ్ .నాకు అర్జెంటు గా ల్యాప్ టాప్ కావలి
ఎం ఎల్ - ఒక రెండు రోజు లు ఆగు తల్లి ..దానితో పాటు ప్రింటర్ ,ప్యాక్ష్
కూడా నీ బెడ్ రూములో ఉంటుంది ,సరేనా
(ఎం ఎల్ కు ల్యాప్ టాప్,లు ఇవ్వనున్న ప్రభుత్వం )

నల్ల ధనం పై సామాన్యులు ఏమనుకుంటున్నారు ?

నల్ల ధనం పేరు మాదిరి గానే ప్రభుత్వ చేష్టలు కనిపిస్తున్నై .
నల్ల ధన కుబేరుల పేర్లు బయట పెట్టడం కుదరదు అని
చెప్పడం ద్వారానే ...సర్కార్ ద్వారా స్విస్ బ్యాంకు లలో
మూలుగుతున్న డబ్బులో పైసా రాదు అని తెల్సి పోయింది .
నల్ల డబ్బు గురించి గ్రామాల్లో ఉన్న సామాన్యులు సైతం
దీనిపై కామెంట్ చేస్తున్నారు ."పార్టీలతో నిమిత్తం లేకుండా
అందరి నేతలకు స్విస్ బ్యాంకు లో డబ్బు ఉంది ...అలాంటప్పుడు
పేర్లు ఎందుకు బయట పెడతారు ...ఇప్పుడే కాదు రేపు
ప్రభుత్వం వచ్చిన అంతే " అని మాట్లాడు కుంటున్నారు .నిజమే
మరి . డబ్బు అంత త్వరగా వస్తుందా ? వస్తే సామాన్య జనం
భాగుపడిపోరు?

29, జనవరి 2011, శనివారం

సిలబ్రిటిక్రికెట్ లీగ్ (సి సి ఎల్ ) దక్కించుకున్న హీరో మంచు విష్ణు

సిలబ్రిటిక్రికెట్ లీగ్ (సి సి ఎల్ ) ను
హీరో మంచు విష్ణు
దక్కించు కున్నాడు .విక్టరి వెంకటేష్ కెప్టెన్ గా
జట్టు ఉంటుంది .
గ్లామర్ తారలు సమంత ,తాప్సి
బ్రాండ్ అంబాసిడర్ల వ్యహరిస్తారు .

28, జనవరి 2011, శుక్రవారం

"అనుష్క " రుద్రమదేవిగా భారి చిత్రం ?

"అరుంధతి ",నాగవల్లి గా ప్రేక్షకులు మనసు
దోసిన అనుష్క మొదటిసారిగా లేడీ ఒరీయాన్టేడ్
చిత్రం చేయడానికి రెడి అయినట్లు తెలుస్తోంది .
చారిత్రిక "రాణి రుద్రమదేవి " గగ నటిస్తున్నట్లు
ఫిలిం ఇందుస్త్రి టాక్ .సుమారు ముప్పయి అయిదు
కోట్ల తో గుణశేఖర్ దర్సకత్వంలో చిత్రం రూపొందు
తున్నట్లు సమాచారం

జీలు ,గన్లు ,బాబు ల గుట్టు కోసం ఆ మూడు చదవాల్సి వస్తోంది

ప్రస్తుత తెలుగు పేపర్ల పోటి లేదా కయ్యం వల్ల
ఎన్నో నిజాలు బయట పడుతున్నై .ముఖ్యంగ్గా
సాక్షి, ఈనాడు ,ఆంధ్రజ్యోతి పత్రికల్లో అన్ని వార్తలు
చదివితే మన నేతల ..ప్రముఖుల జాతకాలు తెల్సి
పోతున్నై .వై ఎస్, జగన్ సామ్రాజ్యం గురిచి " రెండు "
పత్రికల్లోను ....రామోజీ -రాధాకృష్ణ లు ,చంద్రమధ్యకు సమలేఖనంబాబు గురించి సాక్షి లోను భలే రాస్తున్నారు .
అంతే కాదు ... వార్త కు మూడు పత్రికల్లో
అసలు పొంత ఉండదు .ఫోటోల విషయంలోనూ
అంతే ...జగన్ మరియు అతని జనం వారి
పత్రికల్లో పేజిలకు పేజీలు ఉంటై .అదే రోజు
ఈనాడు తిరగేస్తే ఏదో మూల చిన్న వార్త ఉంటుంది .
ఫోటో ఉండవచ్చు .ఉండక పోవచ్చు .సాక్షి లో
చంద్రబాబుకు ,నేటి ముఖ్య మంత్రి కి కూడా
జగన్ తర్వాత స్తానమే .జగన్ వర్గీయులు
చెప్పిన వివరాలు తాటికాయంత అక్షరాల
లోను ....మిగిలినవి ..ఆవగింజ మాదిరిగా
కనిపిస్తాయి .ఆంధ్రజ్యోతి ,ఈనాడు లలో ..
జగన్ పై వార్త లేకుండా ఉండదు .ఆంధ్రజ్యోతి
,ఈనాడు లు రెండు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి
కుమారుడికి ఇంత దోసి పెట్టారు ..అంటూ
కళ్ళు తిరిగే వివరాలు ఇస్తారు .సాక్షి లో
పసుపు పాములు -రాజగురువు రామోజీ
పై సటైర్లు వేస్తుంది .జగన్ ఆస్తులపై
హైకోర్టు సుమోతో కేసు స్వీకరించిన
తరుణంలో రెండు పత్రికలూ తమ
వార్తలతో "జగన్ "ను ఆటలాడుకోగా
సాక్షి కాంగ్రెస్స్ టి డి పి ,రామోజీ కుమ్మక్కు
అయ్యారంటూ వార్తలు ఇస్తోంది ....
మొత్తం మీద మూడు చదివితే గాని
నిద్ర పట్టడం లేదు కొందరికి .అయితే
రాజకీయ ఆసక్తి గల వారు మూడు పత్రికలూ
కొనుగోలు చేయవలసి వస్తున్నాడని వాపోతున్నారు .

ఫిబ్రవరి అర్ధరాత్రికి అసలు లెక్క తేలిపోనుంది .

'సరిగ్గా వచ్చే నెల ఫిబ్రవరి అర్ధరాత్రికి అసలు లెక్క తేలిపోనుంది .
నిజమే .పది సంవత్సరాల తర్వాత జరుగుతున్నా లెక్క ఆరోజు
ముగుస్తుంది .అదే మన దేశ జనాభా లెక్క . మొదటి దశలో
ఆయ ప్రాంతలలో గృహాలు ...కొంతవరకు కుటుంబ వివరాలు
రాసారు .రెండవ దశ లో ఫిబ్రవరి తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది
వరకు అసలు జనాభా పూర్తిగా సేకరిస్తారు . చివరి రోజు రాత్రి
పుట్టినవారు ,గిట్టిన వారు అందరు నమోదు అవుతారు ...కాబట్టి
నిజమైన జనాభా లెక్క తేలిపోతుంది .అయితే అయిదు రోజు లు
తర్వాత బహుశా మార్చ్ అయిదు న ప్రభుత్వం అధికారికంగా
జనాభా వివరాలు ప్రకటించ వచ్చు .ఓ నెల ఆగితే మన జనం
ఎంత పెరిగి పోయారు తెల్సిపోతుంది .

26, జనవరి 2011, బుధవారం

బాపు కు "పద్మ " అవార్డ్ ఎందుకు ఇవ్వడం లేదు ?

నిజమే ...చిరంజీవి బాధలో వాస్తవం ఉంది .
తెలుగింట "బాపు ,రమణ " లు తెలియని
వారు ఉండారు . తమ టాలెంట్ ద్వారా
ప్రజలకు మంచి వినోదాని పంచి ఇస్తున్న
వీరికి దేశంలో ఉన్నత "పద్మ " అవార్డ్లు
రాకపోవడం బాధాకరం .ఎవరైనా ఆడపిల్ల
అందంగా ఉంటే "బాపు బొమ్మ " అని
పిలుస్తారు .పురాణ కథలను ...హాస్య
కథలను తెరకు ఎక్కించి ప్రజల
మనసులు దోసుకున్న బాపు కు
ఇంతవరకు "పద్మ " అవార్డ్ రాకపోవడం
శోచనీయం .సినిమా పెద్దలు ఇలాంటి
విషయాలలో కొంత శ్రద్ధ చూపిస్తే
మన తెలుగు కీర్తి దేశ వ్యాప్తః మవుతుంది .
చిరంజీవి విషయంలో స్పందించి తన
అసంతృప్తిని కమిటికి తెలియజేయడం
అభినందనీయం .

వైజాగ్ లో బాల కృష్ణ సినిమా షూటింగ్ కు ఆటంకం

వైజాగ్ లో బాల కృష్ణ సినిమా షూటింగ్ కు ఆటంకం
ఏర్పడింది .బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న
కొత్త సినిమాకు అటవీ ప్రాంతాంకి దగ్గరగా సెట్స్
వేసారు .అయితే చెట్లు నరకడంతో విహడం ఏర్పడి
షూటింగ్ నిలిచింది .లక్ష్మి రాయ్ హీరొయిన్ గా
చేస్తోంది

రవి తేజ కు గుడ్ , బాడ్ న్యూస్ లు .

రోజు పుట్టిన రాజు జరపు కుంటున్న రవి తేజ కు
గుడ్ , బాడ్ న్యూస్ లు .తెలుగు సిని పరిశ్రమలో
మినిముం గ్యారంటి హరో రవి తేజ అంటూ ఈరోజు
దాదాపు అన్ని టి వి ఛానల్స్ ప్రత్యేక కార్యక్రమాలు
ప్రసారం చేసాయి .రవి ఉన్న్నతి ,ఎనర్జీ గురించి
ఎందోరు సిని ప్రముఖులు రవిని అచినంధించారు .
అదే సందర్బంలో డ్రగ్ కేసుల్లో నిందితులైన రవితేజ
సోదరులు పోలీసు ఆఫీస్ కు వచ్చి మీడియా పై విరుచుకు
పడ్డారు .వారిని చిత్రీకరిస్తున్న విలేకర్లపై భారత్ భండ భూతులు
తిట్టడం ఆయ చానల్స్ ప్రముఖంగా ప్రచారం చేసై .రవి తేజ
మీడియా కు ఎంతో దగ్గరగా ఉంటారని ...తమ్ములు అతని
పరువు తీస్తున్నారని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు .
"మేమింతే" అనుకుంటే అన్న పేరును పోగ్గిట్టినట్టే

25, జనవరి 2011, మంగళవారం

ఇక అక్కినేని "పద్మ విభూషణ్ "


నట సామ్రాట్ అక్కినేని ఖాతాలో మరో అవార్డ్ చేరింది .
ఇక అక్కినేని పేరు ముందు "పద్మ విభూషణ్ " చేర్చాలి .
భారత ప్రభుత్వం అక్కినేనికి ఈరోజు అవార్డ్ ప్రకటించింది

24, జనవరి 2011, సోమవారం

పవన్ "గబ్బర్ సింగ్ " ఫోటో


పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే .
అల్లు శిరీష్ తమ సౌత్ స్కోప్ నందు దీనికి సంబందించిన
స్టిల్ ఇచ్చారు ..శిరీష్ తన ట్విట్లో దీనిని ఉంచారు మధ్యకు సమలేఖనం

రచ్చ బండ అంటే (జోక్ )

టీచర్ -ఒరే రవి. రచ్చబండ అంటే ఏమిటి ?
రవి -ఊరిలో ఉండే పెద్ద బండ దగ్గర అందరు కొట్టుకోవడం సార్

23, జనవరి 2011, ఆదివారం

"రచ్చ రచ్చ " అవుతున్న రచ్చ బండ ?

ఈరోజు ప్రారంబ మైన "రచ్చబండ " కార్యక్రమం సాఫీగా
జరిగే సూచనలు కనపడటం లేదు .ఇప్పటికే పలుచోట్ల
సర్కారుకు ఇబ్బందులు ఎదురు కావడం జరిగింది .
కార్యక్రమాని "రచ్చ రచ్చ " చేస్తా మని చెప్పిన వారు
నిర్జంగా రచ్చ చేస్తున్నారు .అసలు రచ్చ బండ
అనే కార్యక్రమం ముహూర్తాన సర్కార్ ప్రకటించిందో
గాని అప్పటినుంచి గొడవలు ఇబ్బందులే . కార్యక్రమాన్ని
ప్రారంబించడానికి వెళుతూ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కన్ను
మూశారు . సారి ఉద్యమాలు ,వ్యతిరేకతలు ..అధికార
పక్షంలోనే ఎదురు దాడులు .రచ్చబండ వాళ్ళ ప్రజలకు
ఎంత మేలు జరుగుతుందో
తెలియదు కాని ..."రచ్చ రచ్చ " మాత్రం అవుతోంది

22, జనవరి 2011, శనివారం

హీరో ల వైఖరి మారితేనే సినీ నిర్మాణ వ్యయం తగ్గేది ?

పెరిగి పోతున్న సిని నిర్మాణ వ్యయాన్ని తగ్గించ దానికి
నిర్మాతల మండలి సూచనల కమిటి వేసింది .మార్గ
నిర్దేశకాలు పొందు పరిచింది .అయితే ఇవ్వన్ని ఎంత
వరకు అమలు అవుతాయి అన్నదే ప్రశ్నార్ధకం .ముఖ్యం
గా మొదటి సూచన -నటినటులు ఆలస్యం చేయకుండా
నిర్ణీత సమయాంకి రావాలి ..ప్రస్తుతం ఎంత మంది హీరో
హీరొయిన్ లు ,విలాన్లు ...ఇతర ఆర్టిస్టులు ఖచ్చిత
సమయాంకి షూటింగ్ ప్రాంతానికి వస్తున్రో అందరికి
తెల్సు .నాటి ఎన్ టి ఆర్ తరం మాదిరిగా వచ్చేవారు
ఎందరు ? తన విడిది ప్రాంతానికి తానూ చెప్పిన
కారు రాకపోతే రడీ అయిన రాణి నటీమణులు ఉన్నారు .
ముందుగా వీరి మైండ్ సెట్ మారాలి .
నటి నటుల పారితోషకాలను నిర్మాతే స్వయంగా మాట్లాడు
కోవాలని ...అయుదు విడతలగా చెక్ రూపంలో
చెల్లించాలని ......సెట్స్ ,సామగ్రి ఖర్చు ....ఇతర ఖర్చులు
అన్ని ముందు గానే స్టేట్మెంట్ వేసుకుని నిర్మాణ వ్యయాన్ని
సూచనల కమిటికి సమర్పించాలని సూచించారు .అదే మించిన్తే
నిర్మాత అనుమతి కావాలని ..లేక పోతే జరిమానా విదిస్తామని
హెచ్చరించారు ...ఇంకా చాల చెప్పారు ......వాటిలో కనీసం
పది శాతం ఖచ్చితంగా పాటించినా నిర్మాణ వ్యయం తగ్గుతుంది .
ముందుగా హీరోల వైఖరిలో మార్పు రావాలి .సినిమా కు వచ్చ్సిన
లాబాలను బట్టి పారితోషకం తీసుకుంటే మంచింది

బాంబు పేల్చిన భానుమతి

మద్దెల చెరువు సూరి భార్య గంగుల భానుమతి
బాంబు పేల్చారు .
తాను సూరి బంధువు అని చెప్పు కుంటున్న
శ్వేత రెడ్డి ఎవరో
తెలియదని భానుమతి మీడియా కు చెప్పడం విశేషం
.శ్వేత కుతమకు ఎటువంటి బంధుత్వం
లేదంటూ భానుమతి చెప్పడం తో
శ్వేతకు మరింత ఇబ్బందులు
ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది

స్వర్గం లో ఎన్ టి ఆర్ ,ఈ వి వి మాట్లాడుకుంటున్నారు

స్వర్గం లో ఎన్ టి ఆర్ , వి వి మాట్లాడుకుంటున్నారు

ఎన్ టి ఆర్ -హలో బ్రదర్, ఏంటయ్యా ఇంత చిన్న వయసులో ఇలా వచ్చావ్ ?
వి వి - అన్నా. భూలోకంలో సమయంలో ఏమి జరుగుతుందో తెలియడంలేదు
మన సిని పరిశ్రమలో మరీను .నా అయ్యుస్సు తీరింది అంతే .నేను అదృష్ట వంతున్నే .

గుచ్చి గుచ్చి అడిగిన రజనికాంత్ -తనకేమి తెలియదన్న శ్వేతా రెడ్డి

"సూరి వ్యవహారం లో నాకు ఏమి తెలియదు " అంటూ న్యూస్ రీడర్
శ్వేతా రెడ్డి లబో దిబో మంటోంది .టి వి నైన్ లో రాత్రి రెండు గంటల పాటు
యాంకర్ రజనికాంత్ శ్వేత ను ఇంటర్ వ్యూ చేసారు .ఎన్నో విషయాలను
గుచ్చి అడిగారు .అయితే ఆమె ఎక్కడ తడబడ కుండ సమాధానాలు చెప్పింది .
ధైర్యంగా ...గున్దేనిబ్బరంగా ఆమె ఆన్సర్ చేసింది .సూరి సమీప బందువు అని
తమ ఇంటి దగ్గర భోజనం చేసారని కూడా చెప్పింది .అయితే సూరి ని ఎప్పుడు
అంటి పెట్టుకునే ఉండే "బాను " మాత్రం ఒక్కసారి కూడా తమ ఇంటికి రాలేదంది.
తనకు సూరి ఆస్తుల వ్యవహారం లో ఎటువంటి సంబంధం లేదని .....తన పేర
ఆస్తులు ఉన్నాయన్న మాట బూటకం అని .....లేని పోనివి రాసిన ..ప్రసారం
చేసిన కొన్ని వాటిపై చర్యలుతీసుకుంటాను అంది .సూరి తనను చదువులో
ప్రోత్స హించేవారని సివిల్ రాయమని అనేవారని చెబుతూ ......సూరి వ్యవహారం తో
తను పూర్తి డిస్ట్రబ్ అయ్యానని న్యూస్ రీడర్ కు స్వస్తి చెప్పి బాగా చదువు కొందామని
అనుకుంటునట్లు ఆమె చెప్పారు .జరిగింది తన "ఖర్మ "గా శ్వేతా రెడ్డి చెప్పుకున్నారు .
ఈమె చెప్పిన మాటలు నిజమో కాదో కాలమే నిర్ణయించాలి

11, జనవరి 2011, మంగళవారం

"తూర్పు "లో స్టెప్స్ వేసిన రానా ,కామ్నా?




తూర్పు లో వారిద్దరూ చిందులు వేసి అభిమానులను అలరించారు .
వారు దగ్గుపాటి రానా మరియు కామ్నా జట్మాలాని.రాజమండ్రికి
దగ్గరోలో గల (సురంపాలెం ) ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ లో జరిగిన
"ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల లో "కలర్స్ " వేడుకల్లో రానా ముఖ్య
అతిదిగా పోల్గున్నారు ."ప్రతి ఒక్కరిలో ఒక స్కిల్ ఉంటుంది .దానిని
బయట పెడితే ఒక లీడర్ అవుతారు " అని రానా విద్యార్ధులకు
చెప్పారు .లీడర్ లో కొన్ని డైలాగ్స్ చెప్పడమే కాదు ..తన కొత్త
సినిమా "నేను నా రాక్షసి లో ట్యునుకు డాన్సు చేసారు . ఇదే
సమయంలో ఈ కళాశాలకు దగ్గరగా ఉన్న "ప్రగతి " కళాశాల
లో కామన జట్మాలాని స్టెప్స్ వేసి కను విందు చేసింది .రానా
తో ఫోటోలు దిగడానికి కుర్రకారు పోటి పడ్డారు

ఐదు లెంపకాయలు

చింటు -ఏంట్రా గురువు గారు ఇందాక ఐదు లెంపకాయలు కొట్టారు ?
బంటు -నువ్వు ఇంకా అదృష్టవంతుడివి ....ఈరోజు పదకొండు గంటల
పదకొండు నిమిషాల కు తేది ఐ దు ఒకట్లు వచ్చి కదా ...జ్ఞాపకంగా
కొట్టారు ...ఇదే ఐదులు ఐ తే?

7, జనవరి 2011, శుక్రవారం

చింటు చెప్పిన రాష్ట్ర సరిహద్దులు ?

టీచర్ -ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దులు చెప్పరా ?
చింటు-ఏ .కోస్తాంధ్ర , బి .తెలంగాణ . సి .రాయల్ తెలంగాణ
డి .హైదరబాద్
టీచర్ -ఆ(((((((

6, జనవరి 2011, గురువారం

ఇలాంటి రిపోర్ట్ ..నేను నిమిషాల్లో ..

చంటి -ఏరా శ్రీకృష్ణ రిపోర్ట్ చూసావా ?
బంటి -ఇలాంటి రిపోర్ట్ అయితే నేను ఎప్పోదో ఇచ్చేవాడని
పోటిపరీక్షలాగా ఏ బి సి డి ఆప్షన్ ఇవ్వడం ఎంతసేపు

ఆ ఫంక్షన్ గిన్నిస్ రికార్డ్ కావచ్చు

నవ్వుల పండుగ పదమూడవ తెదియే కాని నెల మారింది .
రాజమండ్రి లో వచ్చే నెల పదమూడవ తేదిన రాజబాబు
విగ్రహ ఆవిష్కరణ జరుగుతోంది .అదే రోజు డబ్బై అయిదు
మంది హాస్య నటులకు సన్మానం చేస్తున్నారు .బహుసా
ఇది గిన్నిస్ రికార్డ్ కావచ్చు నని మా "మురళి మోహన్ "
చెప్పారు .రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ వేదిక గా స్టార్ నైట్
ఏర్పాటుచేశారు .సిని వజ్రోత్సవాలు తర్వాత ఇది గ్రేట్
ఈవెంట్ కావచ్చు

శ్రీకృష్ణ కమిటి రిపోర్ట్ వచ్చిన తర్వాత స్వర్గంలో ఎన్ టి ఆర్ -వై ఎస్ ఆర్ మళ్లీ ఇలా మాట్లాడుకుంటున్నారు

శ్రీకృష్ణ కమిటి రిపోర్ట్ వచ్చిన తర్వాత స్వర్గంలో ఎన్ టి ఆర్ -వై ఎస్ ఆర్ మళ్లీ ఇలా మాట్లాడుకుంటున్నారు
వై ఎస్ ఆర్ -ఏంటి అన్న , శ్రీకృష్ణ నివేదిక అలాఉంది ......ఎవరికి ఎన్ని మేళ్ళు జరుతాయో తెలియకుండా ఉంది
ఎన్ టి ఆర్ -నేను ఎప్పుడో చెప్పాను ...తెలుగు జాతిని డిల్లి లో తాకట్టు పెడుతున్నారని ...చూసావా బ్రదర్
మన తెలుగువాళ్ళతో ఎలా చలగాటం ఆడుతున్నారో ..తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి
అని ఓ రిపోర్ట్ పడేసారు .మన సమస్య మనేమే పరిష్కరించుకోవాలి .
వై ఎస్ ఆర్ -నువ్వు -నేను ఉన్నంతసేపు ఏ ఉద్యమాలు ఇంతగా లేవు ...
ఎన్ టి ఆర్ -మళ్లీ పుట్టి తెలుగు దేశం ను కాపాడుకుందాం బ్రదర్ ...
వై ఎస్ ఆర్ -అది సరే చెప్పడం మరిచా. నా పేరు మీద జగన్ పార్టి పెడుతున్నాడు
వై ఎస్ ఆర్ -తెలిసింది బ్రదర్ ..ఆల్ ద బెస్ట్ ....

5, జనవరి 2011, బుధవారం

ఇవి ఆ పళ్ళు అండి

సుశీల - ఏంటయ్యా నిన్నటి వరకు పది రూపాయలకు ఆరు
జామపళ్ళు ఇచ్చావు ..ఈరోజు ఒకటి పదా ?
వ్యాపారి -ఇవి మామూలు జామ కాదండి ..ఐశ్వర్యరాయ్ జామ్ పల్లండి

స్వర్గంలో ఎన్ టి ఆర్ ...వై ఎస్ ఆర్ ఏమి మాట్లాడుకుంటున్నారు ?

దివంగత ముఖ్యమంత్రులు 'స్వర్గంలో కల్సుకుని ఇలా మాట్లాడుకుంటున్నారు .
వై ఎస్ ఆర్ -అన్నా మన తెలుగు రాష్ట్రం ఏమౌతుంది ?ఆందోళనగా ఉంది .
ఎన్ టి ఆర్ -ఎందుకు బ్రదర్ ...రెండు గా అయితే ఒకటి నా బాలయ్య
. మరొకటి మీ జగన్ పరిపాలిస్తారు ...ఉమ్మడిగా ఉంటే పదవీకాలం
పంచుకోమందాం ? ఏమంటావ్ ?
( వై ఎస్ మరియు ఎన్ టి ఆర్ అంటే అభిమానమే ..ఇది సరదాగా రాసింది )

"తాంభులాలు ఇచ్చేసాం తన్నుకు చావండి " రేపు కేంద్ర హోం మంత్రి చిదంబరం నోట విన్పించే మాట ఇదేనా ?

"తాంభులాలు ఇచ్చేసాం తన్నుకు చావండి " రేపు కేంద్ర హోం మంత్రి
చిదంబరం నోట విన్పించే మాట ఇదేనా ?మరి ఏదైనా ఉందా ?ఏమో
చెప్పలేము .శ్రీ కృష్ణ కమిటి రిపోర్ట్ రేపు విడుదల సందర్భంగా ఆసక్తి
కంటే రాష్ట్ర రాజకీయాలు మలుపు తిరుగుతాయో అన్న ఆసక్తి ఉంది .
ఇప్పటికే తెలుగు దేశం లో మొదలైంది .తదుపరి కాంగ్రెస్ ..ఇక ఫక్క
తెలంగాణాకు కట్టుబడ్డ టి ఆర్ ఎస్ కు ,సమైఖ్య ఆంద్ర కు కట్టుబడ్డ
ప్రజారాజ్యం పార్టికి గొడవ లేదు .కేంద్ర నిర్ణయం ఎలా కచ్చితమైన
నిర్ణయమ తీసుకుంటూదన్న నమ్మకం లేదు .రాష్ట్ర రాజకీయ
పార్టి లపైనే భారం అన్నట్టు చిదంబరం మాటలను బట్టి తెలుస్తోంది .
అంటే "తాంభులాలు ఇచ్చేసాం తన్నుకు చావండి "అనే అర్ధం .

4, జనవరి 2011, మంగళవారం

"కొమరం బీం " పాటతో తెలంగాణా లో "పరమ వీర చక్ర "కు అడ్డంకులు ఉండవ్

పరమ వీర చక్ర సినిమా కు తెలంగాణా లో ఎటువంటి ఆటంకాలు
ఉండవేమో . సినిమా లోని "కొమరం బీం " పై పాట తెలంగాణా
ప్రతి బిడ్డను ఆకర్షించే విధంగా ఉంది .సుమారు ఏడు నిమిషాల పాట లో
పౌరుషం ఉట్టిపడేలా అశోక తేజ పదాలు ఉన్నాయి .ఇక ఎస్ పి బాల
సుబ్రహ్మణ్యం ,వందేమాతరం శ్రీనివాస్ పాటకు ప్రాణం పోశారు . దాసరి
నారాయణ రావు చాల చాకచక్యంగా పాటను పొందు పరిచారని
అనుకోవచ్చు .పాట సినిమాకు హైలెట్ గా నిలవ వచ్చు .

సర్కార్ ను కూల్చబోను అన్న "జగన్ " మాటలకు అర్ధం ఇదేనా ?

ప్రస్తుత ప్రభుత్వాన్ని పడగోట్టబోనని ,మధ్యంతర ఎన్నికలు
రావని జగన్ తాజాగా చేస్తున్న వ్యాఖ్యలు ప్రాధాన్యత
సంతరించుకున్నై.జగన్ అన్న మాటలను లోతుగా ఆలోచిస్తే
అసలు విషయం అర్థమవుతుంది .తానూ తలచుకుంటే
ప్రభుత్వం కూలిపోక తప్పదని నేరుగా కాంగ్రెస్ అధిష్టానానికి
హెచ్చరిక చేసినట్టు భావించు కోవచ్చు .సర్కార్ ను కూల్చగలిగే
బలం తనకు ఉందని చెప్పకనే చెప్పి నట్లయంది.అంతే
కాదు తానూ అసెంబ్లీ కి పోటి చేయనని లోక సభ కే
పోటి చేస్తానని చెప్పడం ద్వారా నేరుగా "సోనియా గాంధీ "
ని డీ కొట్టడానికే నిర్నయుంచు కున్నట్టు తెలుస్తోంది .

3, జనవరి 2011, సోమవారం

రక్త చరిత్ర ముగిసిందా ? మళ్ళి మొదలైందా ?

రక్త చరిత్ర ముగిసిందా ? మళ్ళి మొదలైందా ?
ఈరోజు మద్దెల చెరువు సూరి హత్య ఘటన
చూస్తె ఎవ్వరికైనా అనుమానం కలగక మానదు .
సినిమా ట్విస్ట్ లను మించి ...............జరిగిన
హత్య చూస్తుంటే .....ఫ్యాక్షనిజం నాకు అంతం
లేదే అనిపిస్తుంది .పక్కనున్న వాళ్ళనే నమ్మ
కూడదు అనే విధంగా హత్యలు జరిగిపోతున్నై .
టై ము లో ఏం జరిగిపోతుందో ఎవరికి ఎరుక .

2, జనవరి 2011, ఆదివారం

ఎక్కువై పోయిన "హాస్య నటులు " వీరిని ఎలా తగ్గించాలని ఆలోచిస్తున్న సినిపెద్దలు

తెలుగులో హాస్య నటులు ఎక్కువైపోయారు ? వీరిని తగ్గించడం ఎలా
అని కొందరు సినీ పెద్దలు తలపట్టుకుట్టునారు ...ఇంతకి వీరిని సినిమాలోంచి
తీసివెయ్యడానికి కాదు .రాజబాబు డబ్బై ఐదవ పుట్టినిరోజున రాజమండ్రి లో
రాజబాబు విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు ." మా "అధ్వర్యంలో
కార్యక్రమం రూపు దిద్దుకుంటోంది . సందర్భంగా సినిరంగం లో
ఉన్న డబ్బై అయిదు మందికి సన్మానం చేయాలని నిర్ణయించారు .
తీరా లిస్టు తయారు చేస్తే నూట ఇరవై ఏడు అని తేలిందట .మళ్ళీ
ఫిల్టర్ చేసిన ఎనబై కి ఎక్కవే వస్తునారట .దీనితో "అంకె " ఎలా
తీసుకు రావాలా అని ఆలోచిస్తున్నారట .

స్క్రిప్ట్ సరిగా లేనందు వల్లే మన తెలుగు సినిమాలు బోల్తా పడుతున్నాయ్ -చిన్ని కృష్ణ

స్క్రిప్ట్ సరిగా లేనందు వల్లే మన తెలుగు సినిమాలు బోల్తా పడుతున్నాయని
బల్లగుద్ది మరి చెబుతున్నారు రచయత "చిన్ని కృష్ణ ".తన పుట్టిన రోజు సందర్బంగా
అయన మాట్లాడుతూ తన అభిప్రాయాలను నిక్కచిగా చెప్పారు .కథాబలం గల సినిమా
ప్లాప్ అయ్యే అవకాశమే లేదని సినిమాకు గుండెకాయ లాంటి "స్క్రిప్ట్ " సరిగా
తయారు చేసు కాకుండానే సినిమా మొదలు పెడుతున్నారని ...దీని వాళ్ళ
నిర్మాణ వ్యయం పెరిపోతుదన్నారు .దర్శకులు డబ్బులను మంచి నీళ్ళల ఖర్చు
పెడుతున్నారని ఆయినే నాణ్యత ఉండడం లేదన్నారు ...నరసింహనాయుడు ,ఇంద్ర .
గంగోత్రి తర్వాత వస్తున్న తన సినిమా "భద్రినాద్" కు కథాబలం ఎక్కువ అన్నారు .

భోగి ముందు రోజు తెలుగు హాస్య నటులంతా ఒకేచోట ?

కొత్త సంవత్సరం లో తెలుగు హాస్య నటుల పండుగ
జరగబోతున్నది .రాజమండ్రి లో దీనిని ఏర్పాటు
చేయడానికి సన్నాహాలు మొదలయ్యి .తెలుగు
సినిమా లో నటిస్తున్నా దాదాపు అందరు హాస్య
నటులు మనం ఒకే చోట చూడవచ్చు .బహుశా
నెల పదమూడవ తేదిన కనులార వీక్షించవచ్చు
రాజమండ్రి లో రాజబాబు విగ్రహాన్ని గోదావరి
తీరాన ఏర్పాటు చేస్తున్నారు .రాజబాబు డబ్బై అయిదవ
పుట్టినరోజు సందర్బంగా రోజు హాస్య నటులు హాజరవుతారు .

హైదారాబాద్ అంటే రాష్ట్రంలో అందరికి ఇష్టమే

నెల ఆరవ తేదిన తెలంగాణా గురించి నిర్ణయం జరగబోతోంది .
రాష్ట్రం రెండు ముక్కలు అవుతుందో లేదో కాని హైదారాబాద్ తెలుగు
ప్రజలందరి ప్రతిబింబం అని అర్ధం వచ్చేలా శ్రీ కృష్ణ కమిటీ పేర్కునే
అవకాశం ఉన్నట్టు నా అభిప్రాయం .కమిటి సభ్యులు ఆయా పత్రికలతో
మాట్లాడిన విధానాని బట్టి చూస్తే హైదారాబాద్ అంటే రాష్ట్రంలో అందరు
ఇస్టపడుతున్నట్టు చెప్పడం జరిగింది ...దీనిని బట్టి చూస్తే హైదారాబాద్
విషయంలో కమిటి ప్రత్యేక సిపార్సులు చేసే అవకాశం కనిపిస్తోంది ...
చూద్దాం ..

1, జనవరి 2011, శనివారం

కొత్త సంవత్సరం లో తాగుతున్నా

చంటి -ఏమిట్రా తెల్లవారిన దగ్గర నుంచి "మందు" మొదలెట్టావ్ ?
నిన్నే కదామళ్ళి సంవత్సరం వరకు తాగానన్నావ్ ?
బంటి -భలే వాడివే ...పాత సంవత్సరంలో ..మానేసి
కొత్త సంత్సరం లో తాగుతున్నా