ఎంద చాట ......ఇది వింటేనే నవ్వుల ఆలి గుర్తుకు వస్తాడు .....తాజా గా మళ్ళి ఈ పదంతో బుల్ల్లి తెర పై కనువిందు చేస్తున్నాడు .ఈ టి వి లో " ఆలి త్రీ సిక్స్ నైన్ "పేరు తో మంగళవారం రాత్రి నుంచి సరికొత్త కార్యక్రమం ప్రారంబమైంది .......ఆలి యాంకర్ గా దీనిని రూపొందించారు .కొన్ని రౌండులు మాంచి నవ్వు తెప్పించిదే గా ఉన్నాయి .మొదటి ఎపిసోడ్లో సురేఖరాణి వాళ్ళ అమ్మాయితో ....ఒక జంట గా రాగ మిమిక్రి రెడ్డి ,ఆలాగే కుంచె రఘు పార్టి సిపెంట్స్గా పాల్గొన్నారు .
మొదటి రౌండ్ లో "నా రూటే సెపరేట్ " లో వారికి నచ్చింది చెయ్యాలి .తర్వాత రౌండ్లో .......దడ..దడ లో తిరిగే చక్రంలో ఉన్న బొమ్మలను ఆయా సినిమా పోస్టర్స్ కు ఎదురు గా అమర్చాలి .తర్వాత ఎంద చాట లో "థర్మోకోల్ చెరువు లో ఉన్న బాల్స్ ను ఇచ్చిన చాట తో జల్లించి సీస లో వెయ్యాలి ......తర్వాత రౌండ్లో"నువ్వు నీను నవ్వు రౌండ్" లో అసలు నవ్వకూడదు .తర్వాత రౌండ్లో ఒక ఎద్దు బొమ్మ గా ఉండే చక్రం ఉంది ...అది తిరుగు తుంది దీని మీద పది పోకుండా ఉండాలి ....చివరగా ఆలి ఒక హీరో వేషంలో పాటల లో నటించి ...తర్వాత కొన్ని ప్రశ్నలు అడుగుతాడు .
మొత్తం మీద కార్య క్రమం వినోదంగానే ఉంది .ఎక్కువ రౌండ్స్ ఉనా పెద్దగా బోర్ కొట్టదు..ముఖ్యం గా "నువ్వు నీను నవ్వు " "ఎంద చాట ...."రౌండ్ లు బాగే నవిస్తాయి .ఝాన్సి తో డాన్సు బేబి డాన్సు తర్వాత మళ్ళి ఆలి బుల్లి తెర పై యాంకర్ గా కనిపిస్తున్నాడు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి