నేడు "గురువు "కు ఎంత గౌరవం ఉంది అంటే ప్రశ్నార్ధకమే .గురు -శిష్యులు మధ్య అనుబంధం నానాటికి తగ్గుతోంది అంటే ఏ మాత్రం సందేహం లేదు .దేనికి కారణం రెండు వైపులా నుంచి ఉంది .నేడు మార్కులే ప్రదానం .క్రమశిక్షణ ,దండింపు,భయం ,గౌరవం వంటి వాటితో విద్యార్దులకు పని లేదు .నచ్చిన మాస్ట్రారు ఇంటికో ,టూషన్కో వెళ్లి చదువు కోవడమే (కొనడమే )....అదేరీతిలో బడి పంతుల్ల పని .బడి సమయంలోనే బోధన ..తదుపరి తమ స్వంత పనుల్లో మునిగి తేలుతున్నారు .అందుకే గురువు అర్ధం మారుతోంది .మరో కోణంలో ఇప్పటికి ఎంతో మంది మంచి గురువులు ఉన్న వారికి తగిన గుర్తింపు లేదు కష్టపడి చెప్పడానికి అవకాశాలు సన్నగిల్లుతున్నైసర్కారుకు పాస్ పర్సెంటేజ్ మీద ఉన్న శ్రద్ధ ....మిగతా విషయాలపై పెట్టడం లేదు .....అలాగే పిల్లలో కూడా ఓ రకమైన అశ్రద్ధ వచ్చేసింది ......ఏతా వాత గురువు -శిష్యుల మధ్య అంతరం పెరుగు తోంది. కంప్యూటర్ టెక్నాలజీ రాకతో మరింత .....??
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి