14, మే 2011, శనివారం

ఇరవై రూపాయిలతో ఏ సి లో నిద్ర ?????!!!!

మనసుంటే మార్గాలు బోలెడు అన్నారు పెద్దలు ...నిజమే ... ఫంక్సన్ నిమిత్తం మొన్న రాజమండ్రి వెళ్ళా ...మధ్యాహ్నం విందు తర్వాత ఇంటికి బయలుదేరే ముందు బయటకు వస్తే తెలిసింది ....ముందు టెండ చుర్రుమని తగులు తుంటే ......వేడిగాలి చెవులను తాకి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే వామ్మో !అనవసరంగా బయలుదేరాను అనుకుని మనసులో తిట్టుకుని .....ఏం చెయ్యాలి ..అనుకునే లోగా ఎదురుగా పోస్టర్ చూసి .......అయిడియా తో గబా గబా పరిగెట్టాను.....వరుసగా రంభ ,ఊర్వశి..మేనక .....ఫుల్లు సి హాల్స్ ......హాల్లోకి పోతే చాలు ఎండ ను జయించవచ్చు .....రంభ ,మేనక అప్పటికే ఫుల్లు ...ఇక ఊర్వశి ....వామ్మో సినిమా తలపోటు .....అనుకుని ....అయినా సినిమా చూడడానికి వచ్చానా నాలో నేను సమర్దించుకుని ..నలబై రూపాయిల టిక్కెట్ తెసుకుని లోపాలకి వెళ్ళా !.....హాల్లో అడుగుపెట్టగానే హిమాలయాల్లో అడుగు పెట్టినంత సంబరం .... సి చాల బావుంది .కుర్చీ ఇంకా బావుంది ..... ..అటు ఇటు చూసా ...యాబై రూపాయలు ఫుల్ కాలేదు కాని నలబై ఫుల్ అయిపోయాయి ....ఎదురుగా ఇరవై సీట్లు ఖాళీగా కనిపించాయి ...కొంత సేపటకి......పోలో మంటూ జనాలు ....ఆపసోపాలు పడుతూ .....కుర్చీ లో కూర్చున్ని హమ్మయా అనుకుంటూనారు......తెర మీద బొమ్మ ... పది నిమిషాలు చూసేసరికే ఎదోలో అనిపించింది ....అటు ఇటు చూసా హాల్లో సగం మంది నిద్ర పోతూ కనిపించారు ..ఇరవై రూపై టికెట్ గలరిలో అయితే .....హాయిగా నిద్ర పోతునారు .....నేను అల ఇలా చూసి నిద్రలోకి జారుకున్నా .....జనం హడావిడి తో హటాత్ గా లేసా!అప్పటికే సి కట్టినట్టునారు చల్లదనం తగ్గుతోంది ....డోర్ లోంచి బయటకు వచ్చేసరికి మళ్ళి సెగలు ........అయితే ఎండ పెద్దగా లేదు ....అలా మెయిన్ రోడ్ కేలదామని ముందుకు కదిలా ..రకరకాల వస్తువులు అమ్ముతున్నవారిని చూస్తూ ..ఆశ్చర్య పోయా ..సినామా హాల్లో ఇరవై రూపాయిల గ్యాలరీలో కనిపించిన వారిలో ఎక్కువ మంది వీరే .......
"రోజుకి ఇరవై రూపాయలు పోతే పోయాయి గాని ప్రాణం హాయిగా ఉంటుంది .. ఎండ లో ఎలాగు బేరం లేదు ......గంటకు కూల్ డ్రింక్ తాగాలి ..హాయిగా ఇరవై రూపాయలతో ... సి లో పడుకోవచ్చు ......"
వారి మాటలు విని అవాక్కయ్యాను ...ఇదేదో బావున్నట్టుంది అన్పించింది తర్వాతా ..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి