5, మే 2011, గురువారం

ఎన్ టి ఆర్ పెళ్లి తంతు లో మఖ్యమైన కార్యక్రమాలు అన్ని "తూర్పు గోదావరి " జిల్లా వారి ద్వారానే

నేడు జరుగుతున్నా ఎన్ టి ఆర్ పెళ్లి తంతు లో మఖ్యమైన కార్యక్రమాలు అన్ని "తూర్పు గోదావరి " జిల్లా వారి ద్వారానే జరగడం విశేషం .పెళ్లి ముహూర్తం దగ్గిరినుంచి అన్ని సెంటిమెంట్ గల తూర్పు నుంచే మొదలు పెట్టారు .కోనసీమకు చెందినా పంతులు గారు ముహూర్తం నిర్ణయించారు .పెళ్లి కూతురికి ఎన్ టి ఆర్ తల్లి ఉప్పడ పట్టు చీరలు పట్టుకెళ్లారు.పెళ్లి కూతురు ,పెళ్లి కొడుకు చేతుల్లో ఉండే కొబ్బరి బొండాలు మండపేట నుంచి తీసు కెళ్ళారు (ప్రతి ఏట భద్రాచలం,అన్నవరం లలో జరిగే పెళ్లి తంతు కు ఇక్కడనుంచే పట్టి కెలతారు ).కొత్త పేట నుంచి పనసు పొట్టు కూర ,దోస ఆవ కై విందు లో పసందు చేయనుంది ..ఇవే కాకుండా అభిమానులు "ఆత్రేయ పురం పూత రేకులు ,కాకినాడ, తాపేశ్వరం కాజాలు ....అన్నవరం ప్రసాదం ,కడియపు లంక పువ్వులు తీసుకెళ్ళారు ....ఇవే కాకుండా బాల కృష్ణ వియ్యంకుడు కాకినాడ వాసి కావడం తో మరిన్ని పెళ్లి తంతు కు తీసుకు వెళ్లినట్టు సమాచారం ....కాగ ఎన్ టి ఆర్ కు కొన్ని రకాల మాంస హారం చాల ఇష్టం అని పెళ్లి తర్వాత విందు ఐటం తీస్కు వెళ్ళడానికి రెడి అవుతున్నాటు చేబుతునారు .....పెళ్లి లో (హైదరాబాద్ తర్వాత )ఎక్కవగా పాల్గుంటున్న వారు జిల్లా వారే కావడం మరో విశేషం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి