30, మార్చి 2011, బుధవారం

తన హీరో గురించి మరింత తెల్సుకోవడానికే "అభిమాని "

సుమ భర్త రాజీవ్ కనకాల యాంకర్ గా ఈ టి వి లో "అభిమాని " మంగళ వారం నుంచి మొదలయ్యింది .రాజీవ్ ప్రాణ స్నేహితుడు ఎన్ టి ఆర్ తో మొదటి షో ప్రారంబించారు .డిఫరెంట్ గెటప్ లో రాజీవ్ యాంకరింగ్ చేసారు .అయితే మొదట కొన్ని నిమిషాలు తడపడ్డాడు .తర్వాత పరవాలేదని పించింది .(బుల్లి తెర టాప్ యాంకర్ "సుమ " తన భార్యే కాబట్టి కొంత కోచింగ్ తీసుకోవడం మంచిది ).మొత్తం ఎనిమిది రౌండ్ లు గా షో రూపొందించారు .మొదటి ఎపిసోడ్ లో నాలుగు ,రెండవ ఎపిసోడ్ లో మిగతా రౌండ్ లు ఉంటాయి .ఎన్ టి ఆర్ తో జరిగిన షో తీరు చూస్తే ..తన" అభిమాన తార" గురించి ఎక్కువగా తెల్సు కోవడానికి వీలుగా ఉంది .వ్యక్తి గత విషయాలు ,అభిరుచులు ....ఆలోచనలు .....వంటివి ప్రశ్నల ద్వారా అభిమానులకు తెలియ జేసే విధంగా ఉంది .వీరాభిమాన్లు గురించి కూడా క్లిప్పింగ్స్ ఇచ్చారు .రెండవ ఎపిసోడ్ కూడా చూస్తే గాని అభిమాన తార అభిమానులకు ఏం చెబుతారో వేచిచూడవలసిందే .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి