రోజా యాంకర్ అవతారం ఎత్తారు. మా టి లో "మోడరన్ మహలక్ష్మి " పేరుతో షో తో పూర్తి యాంకర్ గా మారిపోయారు .తొలి ఎపిసోడ్ ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంబమై రెండు గంటలకు ముగిసింది .మొదటి ఎపిసోడ్ కు బుల్లి తెర నటీమనులను తీసుకొచ్చారు .రావిత్రేయిని .కీర్తి ,శ్రీ విద్య ,శ్రీవాణి లతో షో నడిపించారు .ఐదు రౌండ్ల గేమ్ షో ఇది .మొదటి రౌండ్ లో ఒక నిమిషంలో ఇచ్చిన టాపిక్ ఇంగ్లీష్ లేకుండా పూర్తి తెలుగులో మాట్లాడుట .రెండవ రౌండ్ లో "చలా'కీ ' చంద్రముఖి "లో నాలుగు పెట్టెల తాళాలు తీయుట .మూడవ రౌండ్ లో "ఓ రా " బాణాలతో సెలిబ్రిటి ఫోటో సెలెక్ట్ చేసి మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పుట .నాలగవ రౌండ్ లో "రింగ్ రింగా " లో లక్కి నంబర్ తో అదృష్టం పరీక్షించుకోవడం .ఆఖరి రౌండ్లో "బంగారం -సింగారం " లో నగలు అలంకరన్ చేయుట .......
ఈరోజు ఎపిసోడ్ పరిశీలిస్తే ప్రోగ్రాం సాధారణ స్థాయిలోనే ఉంది .ఫోటో సెలెక్టింగ్ ,బంగారం అలంకరన్ బావున్నై .సుమ నిర్వహించే ఈ టి వి "స్టార్ మహిళ" తో పోలిస్తే కొన్ని కాన్సెప్ట్ బాగానే ఉన్నా...సుమ తో రోజా అసలు పోటి పడలేక పోయిందని చెప్పవచ్చు .గొంతు ,మాట తీరు ,నవ్వింపు ,కవ్వింపు ..చలాకీతనం ..చిలిపితనం ..అంతకు మించి సందర్భాను చతురత విషయంలో "సుమ "కే మహిళలు ఎక్కువ మార్కులు వేస్తారు .....సరిగ్గా "స్టార్ మహిళ " సమయంలోనే పోటి అన్నట్టు రోజా ""మోడరన్ మహలక్ష్మి " ప్రసారం చేస్తున్నారు .అయితే రేటింగ్ లో పోటి పడలేరోమో ..మరి ముందు ముందు రోజా ఎలా రానిస్తుందో వేచి చూడాలి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి