12, మార్చి 2011, శనివారం

జగన్ జగ్గంపేట లోనే తన పార్టి ప్రకటన చేయడం వెనుక ??...అక్కడ భోజనం చేస్తే సి ఎం !


జగన్ జగ్గంపేట లోనే తన పార్టి ప్రకటన చేయడం వెనుక చాల కసరత్ జరిగింది .ఎన్నికల కోడ్ దృష్ట్యా జగ్గంపేట సభ నే పార్టి సభ గా మార్చలనుకున్నారు .అయితే ముహూర్తాలు కుదరలేదు .ముహుర్తాలపై జగన్ కు పెద్ద పట్టింపు లేకున్నా తనకు సలహాలు ఇచ్చే ముఖ్య బంధువుకు ముహుర్తాలపై పట్టింపు ఉన్నట్టు తెలుస్తోంది .జగన్ జగ్గంపేట లో సభలో పాల్గునే ముందు మల్లిసాల అనే గ్రామంలో " అత్తులూరి " కుటుంబం ఇంటికి విందు కు వెళ్ళారు ( ఈ ఇంట విందు తీసుకున్న వారు మంచి ఉన్నతి లో ఉంటారన్న సెంటిమెంట్ ఉంది .గతం లో ఇక్కడ ఆతిద్యం పొంది న వై ఎస్ ఆర్ ,రోశయ్య ముఖ్యమంత్రి అయ్యారని ...అలాగే జగన్ కూడా అవుతారని నమ్మకంతో ..జ్యోతుల నెహ్రు ఇక్కడ ఏర్పాట్లు చేయించారు ) .జ్యోతుల నెహ్రు పెట్టుకున్న ముహూర్తం మించి పోతూ ఉండడంతో యాన అత్తులూరి ఇంట జగన్ పార్టి లో చేరారు .అప్పటికే జగన్ మనసులో పార్టి పేరు అధికారికంగా ప్రాకటించే ఆలోచన ఉన్న బయట పెట్ట కుండా ....జగ్గంపేట లో వేలాదిమంది మధ్య ప్రకటన చేసారు .తూర్పు సెంటిమెంట్ కూడా జగన్ కు కల్సి వచ్చింది .సాధారణంగా తూర్పు గోదావరి జిల్లలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీయే అధికారంలోకి వస్తుంది అన్న నమ్మకం రాజకీయ పార్టీలలో ఉంది .మొత్తం మీద కొత్త పార్టి తూర్పున ఉదయించి నట్లయంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి