28, మార్చి 2011, సోమవారం

ఎన్ టి ఆర్ "శక్తి " కథ విశేషాలు ...

జూనియర్ ఎన్ టి ఆర్ నట జీవితాన్ని తాజా సినిమా "శక్తి " వంతం చేయనుందా?అభిమానులకు అవుననే అనిపిస్తుంది .వచ్చేనెల మొదటి తేదిన విడులవుతున్న చిత్రానికి సంబదించి కొన్ని ఆసక్తికర విశేషాలు వెలుగు లోకి వచ్చాయి .సినిమా కథ తయారి లో నిర్మాత అశ్వనిదత్ ,ఎన్ టి ఆర్ చాలా జాగర్తలు తీసుకున్నారు .బృందావనం సినిమా షూటింగ్ సమయం లోనే దర్శకుడు మెహర్ రమేష్ "శక్తి " కథ వినిపించాడు .అయెతే రెండు సార్లు చెప్పినా....ఎన్ టి ఆర్ సరిగా నచ్చలేదట .తర్వాత రమేష్ కథ పట్టుకుని నెలన్నర తరవాత వచ్చాడు .దత్ గారి ఇంట్లో సిట్టింగ్ ..యండమూరి వీరేంద్ర నాద్,సత్య నంద సమక్షం లో చర్చలు ..మొత్తానికి కథ ఎన్ టి ఆర్ కి బాగా నచ్చినట్లు చెప్పాడు .దీని కోసం మెహర్ పాత సినిమాలోని క్లిప్పింగ్స్ కూడా చూపించడం విశేషం .చిత్ర కథ ప్రకారం మానవుణ్ణి దైవం కాపాడుతుందని ...అలేగే ..భగవంతునికి సంరక్షకుడి గా మనిషి ఉంటారన్నది కథ లో ప్రదాన అంశం .కథ హరిద్వార్ ..ఈజిప్ట్ చుట్టూ తిరుగు తుంది ....ఎన్ టి ఆర్ గెట్ అప్ లు చాలా బావున్నై అన్న టాక్ ఉంది .పాటలు కూడా హిట్ టాక్ వచ్చింది .ఎన్ టి ఆర్ "ప్రేమ దేశం " పాట భాగ నచ్చిందట .కాగ పాత్రలు చెయ్యడానికి తన తాత మహా శక్తి కారణం అని ఎన్ టి ఆర్ అంటున్నారు .సినిమా హిట్ కావాలని .....ఎన్ టి ఆర్ పెళ్లి కి ఇది గిఫ్ట్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి