25, సెప్టెంబర్ 2011, ఆదివారం

క్లైమాక్ష్ తీయడం లో మన దర్షకు లు చేతులు ఎస్తేస్తున్నారు ????????

మధ్య ఎక్కువ సినిమాల్లో ప్రధమార్ద్తం బాగానే ఉంటున్న ద్వితీయార్ధం మాత్రం బావుండడం లేదు ..ముఖ్యం గా క్లైమాక్ష్ చప్పగా ఉంటోంది .....మొదటి భాగం లో హీరో నవ్విస్తూ హీరొయిన్ ను ఏడిపిస్తూ ..కమిడియన్స్ ను ఆట పట్టిస్తూ సరదాగా సాగి పోతూనే ...ఇంటర్వల్ సమయానికి తన విశ్వరూపంతో .....విలన్కు చమటలు పటిస్తాడు...ఇక అంతే .ప్రేక్షకుడు ...ఇంకా ఏదో ఉంది ..ఆత్రుత పడుతున్న ...సినిమా చప్పగా ..సాగదీత మొదలై చివరికి ....మొదటి భాగంలో ఉన్న ఆనందం కూడా ఆవిరి అవుతోంది .....
... సినిమా చూసిన ఇదే కనిపిస్తోంది ...విశ్రాంతి సమయానికే .....అసలు కథ అయిపోతే ..ఇక ఏముంటుంది ? క్లైమాక్ష్ అయితే మహా బోర్ గా ఉంటోంది ...ఎందుకో చాలామంది అగ్ర దర్శకులు సైతం క్లైమాక్ష్ బాగే తీయలేక పోతున్నారు ...స్క్రిప్ట్ కేవలం విశ్రాంతి వరకు రాసుకుని వదిలేసి ..తర్వాత ఏదో క్లైమాక్ష్ సీన్ అల్లుతున్నారా అన్న అనుమానం కల్గకమానడం లేదు .ఇది ప్లాప్ అయిన సినిమాలకే కాదు ..హిట్ అయిన వాటిలోన్ను అంతే ..తాజాగా విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న "దూకుడు " లోను ద్వితీయార్ధం చప్పాగా సాగింది .విలన్లను చంపడానికే ..సినిమా సాగదీసి నట్టు సామాన్య ప్రేక్షకుడి కైనా తెల్సిపోతుంది ....దర్శకులు కాస్త క్లైమాక్ష్ పై ద్రుష్టి పెడితే మరిన్ని సినిమాలు హిట్ అవుతాయి .

దూకుడు లో డైలాగ్స్ కొన్ని


శ్రీను వైట్ల దర్శకత్వానికి కోన వెంకట్ మాటలు ..మహేష్ బాబు డైలాగ్ డెలివరీ తోడై ప్రిన్సు పిక్షర్ దూకుడు కు ప్లస్ పాయింట్ .
దూకుడు లో డైలాగ్స్

""""మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోవటమే.."""""


"""దూకుడు లేకపోతే పోలీస్ మాన్ కీ పోస్ట్ మ్యాన్ కీ తేడా ఏం ఉంటదీ?"""

""మా నాన్న ఒకటి చెప్తూ ఉండేవాడు ధైర్యంగా ముందుకెళ్ళి పోతే దారి తెలియక్కర్లేదు. డైరెక్ట్ అయిపోవటమే.""

"""నాకు ఒక్క నిమిషం ఇస్తే ఆలోచిస్తా, రెండు నిమిషాలు ఇస్తే యాక్షన్ లోకి దిగుతా, మూడు నిమిషాలు ఇస్తే ముగించేస్తా...!


""""చూశావా? పంచ్ పడేసరికి ప్రొఫెషన్ చెప్పేశావ్.? "


"



"నేను నరకటం మొదలెడితే నరకం లో హౌస్ఫుల్ బోర్డ్ పెట్టుకోవాలి "

"""'కళ్లున్నోడు ముందు మాత్రమే చూస్తాడు. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు"".


""""భయానికి మీనింగే తెలియని బ్లడ్ రా ..... నాదీ..!""

"""కలర్ ఏంటీ నీ కలర్ ఏంటీ?
ఎదవ పిట్ట మొహమేసుకొని."".

చూస్తావ్ గా.. పర్మిషన్ ఇస్తే పేకాడేస్తాను.



"నీ లైఫ్ లో నువ్వు చాలా మంది తో పెట్టుకొని ఉంటావ్. కానీ ఒక్కడి తో మాత్రం పెట్టుకోకు. అమ్మ కడుపులోంచి ఎందుకు బయటకొచ్చానా? అని ఫీలవుతావ్. ....ఆ ఒక్కడినీ నేనే "

"పడుకున్న పులినీ, పని చేసుకునే పోలీసునీ కెలికితే... వేటే"







24, సెప్టెంబర్ 2011, శనివారం

ఆంధ్రుల అన్న గారు ,నటరత్న ఎన్ టి ఆర్ భారత్ ప్రధాన మంత్రి గా కనిపించారు ...ఏమిటి చనిపోయిన అన్న గారు .....ఏమిటి పిచ్చి అనుకుంటునారా ?నిజమే నండి..

ఆంధ్రుల అన్న గారు ,నటరత్న ఎన్ టి ఆర్ భారత్ ప్రధాన మంత్రి గా కనిపించారు ...ఏమిటి చనిపోయిన అన్న గారు .....ఏమిటి పిచ్చి అనుకుంటునారా ?నిజమే నండి..కాకపోతే ...వెండి తెర పై ..
మహేష్ తాజా సినిమా అన్న ఎన్ టి ఆర్ ప్రధానిగా కనిపించారు .......ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ....దూకుడు సినిమాలో హీరో మహేష్ బాబు తన తండ్రి ఆరోగ్యాన్ని కాపాడడానికి నాటకం ఆడతాడు ..తానూ ఏం ఎల్ గా నటిస్తాడు .. క్రమంలో తన తండ్రి ప్రకాష్ రాజ్కు ఎన్ టి ఆర్ ప్రధాని అయ్యారని చెబుతారు ......చాల సంత్సరాలు తర్వాత కోమాలోకి వచ్చిన ఆయన టి వి లో ఎన్ టి ఆర్ ను చూడడానికి సిద్దం అవుతాడు ...అప్పుడు ఎన్ టి ఆర్ సి ఏం గా ఉన్నప్పుడు ఉన్న కొన్ని మాటలతో డబ్బింగ్ వస్తుంది ..అది సంగతీ .....మొతానికి ఎన్ టి ఆర్ ను శ్రీ ను వైట్ల ప్రధానిని చేసేసాడు ..బ్రతికి ఉంటే అదే నిజమువునేమో ...

15, సెప్టెంబర్ 2011, గురువారం

..ఆ బంకే కావాలి!

వాసు : చూడండి బావగారు ..అల్లుడు గారికి కట్నం క్రింద కోటి రూపాయల ఇస్తాను
రవి : అవేమి వద్దు గాని .. సెంటర్లో ఉన్న మీ చిన్న పెట్రోల్ బ్యాంకు ఇవ్వండి చాలు

14, సెప్టెంబర్ 2011, బుధవారం

ఎంద చాట ......ఈ టి వి లో " ఆలి త్రీ సిక్స్ నైన్ "పేరు తో.....

ఎంద చాట ......ఇది వింటేనే నవ్వుల ఆలి గుర్తుకు వస్తాడు .....తాజా గా మళ్ళి పదంతో బుల్ల్లి తెర పై కనువిందు చేస్తున్నాడు . టి వి లో " ఆలి త్రీ సిక్స్ నైన్ "పేరు తో మంగళవారం రాత్రి నుంచి సరికొత్త కార్యక్రమం ప్రారంబమైంది .......ఆలి యాంకర్ గా దీనిని రూపొందించారు .కొన్ని రౌండులు మాంచి నవ్వు తెప్పించిదే గా ఉన్నాయి .మొదటి ఎపిసోడ్లో సురేఖరాణి వాళ్ళ అమ్మాయితో ....ఒక జంట గా రాగ మిమిక్రి రెడ్డి ,ఆలాగే కుంచె రఘు పార్టి సిపెంట్స్గా పాల్గొన్నారు .
మొదటి రౌండ్ లో "నా రూటే సెపరేట్ " లో వారికి నచ్చింది చెయ్యాలి .తర్వాత రౌండ్లో .......దడ..దడ లో తిరిగే చక్రంలో ఉన్న బొమ్మలను ఆయా సినిమా పోస్టర్స్ కు ఎదురు గా అమర్చాలి .తర్వాత ఎంద చాట లో "థర్మోకోల్ చెరువు లో ఉన్న బాల్స్ ను ఇచ్చిన చాట తో జల్లించి సీస లో వెయ్యాలి ......తర్వాత రౌండ్లో"నువ్వు నీను నవ్వు రౌండ్" లో అసలు నవ్వకూడదు .తర్వాత రౌండ్లో ఒక ఎద్దు బొమ్మ గా ఉండే చక్రం ఉంది ...అది తిరుగు తుంది దీని మీద పది పోకుండా ఉండాలి ....చివరగా ఆలి ఒక హీరో వేషంలో పాటల లో నటించి ...తర్వాత కొన్ని ప్రశ్నలు అడుగుతాడు .

మొత్తం మీద కార్య క్రమం వినోదంగానే ఉంది .ఎక్కువ రౌండ్స్ ఉనా పెద్దగా బోర్ కొట్టదు..ముఖ్యం గా "నువ్వు నీను నవ్వు " "ఎంద చాట ...."రౌండ్ లు బాగే నవిస్తాయి .ఝాన్సి తో డాన్సు బేబి డాన్సు తర్వాత మళ్ళి ఆలి బుల్లి తెర పై యాంకర్ గా కనిపిస్తున్నాడు .

అమెరికా చెప్పినట్టు మన భావి ప్రధాని నరేంద్ర మోడీ ?

ఇండియా కు భావి ప్రధాని నరేంద్ర మోడి అంటూ అప్పుడే అమెరికా దాదాపు డిక్లేర్ చేసేసింది .!......అంటే వచ్చే ఎన్నికల్లో మనం బీ జే పే ,వాటి అనుబంద కూటమి ....అదే ఎన్ డి కు వోటు వెయ్యాలి అన్న మాట .కాంగ్రెస్స్ కు చరం గీతం తప్పదన్న మాట ! ....రాహుల్ గాంధీ పంచ్ సరిపోవడం లేదని అగ్రరాజ్యం ప్రకటించేసింది ....ఇంకేం .....మోడి మన ప్రధాని .?????????.....

9, సెప్టెంబర్ 2011, శుక్రవారం

ముద్దుబిడ్డ సీరియల్ నిలుపు చెయ్యాలంటూ బాలల హక్కుల సమితి మానవ హక్కుల సమితిని కోరడం మంచిదే .

పిల్లలో నేర ప్రవ్రుత్తి పెంచే ముద్దుబిడ్డ సీరియల్ నిలుపు చెయ్యాలంటూ బాలల హక్కుల సమితి మానవ హక్కుల సమితిని కోరడం మంచిదే .చిన్న పిల్లల చేత వికృత కార్యక్రమాలు చెయ్యించ డాన్ని ఎవరైనా వ్యతిరేక కిన్చావాల్సిందే. కాలు బూటులో తేలు పెట్టి కుట్టి చంపించడానికి ప్రయత్నిచడం,జ్యూసు లో విషం కలపడం వంటివి చిన్న పిల్ల పాత్రలో చూపించడం దారుణం .జీ టి లో ప్రసారం అవుతున్న ముద్దుబిడ్డ సీరియల్ పై ఈరోజు ఎన్ టి లో చర్చ జరిగింది .వివిధ ప్రజా సంఘాల నేత లు పాత్రల తీరును తప్పు పట్టగా సీరియల్ డైరెక్టర్ గారు సేసిధర్ మాత్రం సమర్దిచుకోవడం విశేషం .

5, సెప్టెంబర్ 2011, సోమవారం

నేడు "గురువు "కు ఎంత గౌరవం ఉంది

నేడు "గురువు "కు ఎంత గౌరవం ఉంది అంటే ప్రశ్నార్ధకమే .గురు -శిష్యులు మధ్య అనుబంధం నానాటికి తగ్గుతోంది అంటే మాత్రం సందేహం లేదు .దేనికి కారణం రెండు వైపులా నుంచి ఉంది .నేడు మార్కులే ప్రదానం .క్రమశిక్షణ ,దండింపు,భయం ,గౌరవం వంటి వాటితో విద్యార్దులకు పని లేదు .నచ్చిన మాస్ట్రారు ఇంటికో ,టూషన్కో వెళ్లి చదువు కోవడమే (కొనడమే )....అదేరీతిలో బడి పంతుల్ల పని .బడి సమయంలోనే బోధన ..తదుపరి తమ స్వంత పనుల్లో మునిగి తేలుతున్నారు .అందుకే గురువు అర్ధం మారుతోంది .మరో కోణంలో ఇప్పటికి ఎంతో మంది మంచి గురువులు ఉన్న వారికి తగిన గుర్తింపు లేదు కష్టపడి చెప్పడానికి అవకాశాలు సన్నగిల్లుతున్నైసర్కారుకు పాస్ పర్సెంటేజ్ మీద ఉన్న శ్రద్ధ ....మిగతా విషయాలపై పెట్టడం లేదు .....అలాగే పిల్లలో కూడా ఓ రకమైన అశ్రద్ధ వచ్చేసింది ......ఏతా వాత గురువు -శిష్యుల మధ్య అంతరం పెరుగు తోంది. కంప్యూటర్ టెక్నాలజీ రాకతో మరింత .....??

4, సెప్టెంబర్ 2011, ఆదివారం

ఆ మడత మంచం మీదే ఇప్పటికి నా పడక అంటున్న మహా నటుడు ?

అతను ఎంతో పెద్ద నటుడు .నెలకు పది సినిమాలు విడుదలైతే వాటిలో ఆరింటిలో గ్యారంటిగా ఆయన ఉంటారు .అయిన అతను ఇంటి దగ్గర "మడత మంచం మీదే పాడుకుంటారు .రాగి చెంబులో నీళ్ళు తాగుతారు . టేప్ రికార్డర్ లో సంగీతం వింటారు ...ఆయనే పద్మశ్రీ బ్రహ్మానందం ...... మదతమంచం ,రాగిచెంబు ..టేప్ రికార్డర్ ....ఇవన్ని ఆయన చెప్పినవే స్వయంగా .....కటిక పేదరికం అనుభవించిన తనకు సాధారణ జీవితం గడపడమే ఇష్టమని.... లవ్ ఇట్ ..అంటునారు .
షూటింగ్స్ కోసం విదేశాలకు వెళ్లి లక్జరీ చేసినా..ఇంటి దగ్గర మాత్రం నాది సాదారణ జీవితం అని చెప్పారు ...డబ్బు కోసం తానూ సినిమాలోకి వచ్చానని ఆయన నిర్మొహమాటంగా చెప్పారు .....మొన్నటి వరకు పద్దెనిమిది గంటలు చొప్పున రోజు పని చేసానని ..ఇక అంత ఓపిక లేదని ..ఉదయం తొమ్మిది నుంచి సాయత్రం ఆరు వరకు పని చేస్తునానని ఇరవై ఏళ్ళ సిని జీవితం పూర్తి చేసుకున్న మన బ్రహ్మ్మనందం .......

3, సెప్టెంబర్ 2011, శనివారం

మన నేతలుఆస్తులూ ప్రకటిస్తునారు ......ఎందుకంటావ్ ?

  పండు - మన నేతలుఆస్తులూ ప్రకటిస్తునారు ......ఎందుకంటావ్ ?
 రవి - వాటికే  పన్ను కడుతున్నామని చెప్పడానికి ...

2, సెప్టెంబర్ 2011, శుక్రవారం

అంతర్జాలం లో తెలుగుకువెలుగు

   ఈ రోజు ఈనాడు లో వచ్చిన వార్త మన తెలుగు బ్లాగర్లు అందరికి సంతోషకరమైనది.అంతర్జాలం లో తెలుగుకువెలుగు రావడం కోసం ప్రభుత్వం ముందుకు రావడం అభినందనీయం .గూగుల్ వంటివి కూడా తెలుగుకు        ప్రాదాన్యత ఇస్తున్న అవి మనకు కావలసినంత గా పూర్తిగా ఉపయోగపడడం లేదు .ఎంత తప్పులు లేకుండా చూద్దామన్నా అక్షర దోషాలు వస్తున్నై .యూనికోడ్ లో ఒత్తులు ,కొమ్ములు వంటివి సరిగా పాడడం లేదు.ఫాంట్స్ కూడా లేవు .కొత్త నిర్ణయం ప్రకారం చక్కని కీ బోర్డ్ తో బాగా మన తెలుగు   ను వేగవంతంగా అంతర్జాలంలో పొందుపరచవచ్చు .ఎంత తొందరగా అమలు చేస్తే అంత మంచిది .


1, సెప్టెంబర్ 2011, గురువారం

ఇదే మార్పు కడదాకే ఉంటే నీవు వారి విఘ్నాలు కల్గించవు కదా

వినాయకుడు : తల్లి ! ఈ సారి మానవులలో చాల మార్పు కనపడింది 
 పార్వతి : నిజమా ! ఏమిటా మార్పు కుమారా ?
వినాయకుడు : నా ప్రతిమలు మట్టి తో చేసారు ....చాల సంతోషం గా ఉంది 
   పార్వతి :  ఇదే మార్పు కడదాకే ఉంటే నీవు వారి విఘ్నాలు కల్గించవు కదా

మన దేశంలో విఘ్నాలు తొలగించి ప్రజలను చల్లగా చూడవయ్యా

మన దేశంలో విఘ్నాలు తొలగించి ప్రజలను చల్లగా చూడవయ్యా విఘ్నరాజ !
తెలుగు బ్లాగర్లు అందరికి చవితి శుభాకాంక్షలు .