28, మే 2011, శనివారం

స్వర్గం లో ఎన్ టి ఆర్ ,వై ఎస్ ఆర్ మాటలు ???(సరదాగా )

వై ఎస్ ఆర్ : హ్యాపీ బర్త్డే ఎన్ టి ఆర్ గారు
ఎన్ టి ఆర్ : థాంక్ యు ! బ్రదర్ ....యింతకి మీ అబ్బాయి కాంగ్రెస్స్ ను కూల్చేస్తాడా ? లేదా ?
వై ఎస్ ఆర్ :ఏం చెప్పను ..ఏమైనా మీ అల్లుడు అంటే పని అయిపోద్ది
ఎన్ టి ఆర్ :నా అల్లుడు నా మాటే వినలేదు ...అయిన మీ వాడు అవిశ్వాసం పెడితే కే అంటున్నాడు గా
వై ఎస్ ఆర్ :భలే చెప్పారు మీరును ....అల చేస్తే మా వాడి బలం వాళ్లకి తెల్సి పోదు
ఎన్ టి ఆర్ : అదా ..బాలయ్యని పార్టి ప్రెసిడెంట్ గా ....చేస్తే..... మీరు చెప్పినట్టు పని జరగా వచ్చు
వై ఎస్ ఆర్ :మీ మనవడు కూడా మీ అల్లుడు మీద కోపంగా ఉన్నాడట ..
ఎన్ టి ఆర్ :వాడివి అన్ని నా బుద్దులే ..ఆత్మ గౌరవానికి బంగం రానివ్వడు....ఎప్పటి కైనా వాడే నేను పెట్టిన పారిని బతికించి సి ఏం అవుతాడు .
వై ఎస్ ఆర్ :అంత వరకు మా జగన్ కు అవకాశం వస్తే బావుండును .
( ఇది సరదాగా రాసింది..... )

26, మే 2011, గురువారం

సి ఏం గారు ! కుక్కలు ,కోతుల సంగతి చూడండి సార్

ప్రస్తుతం రాష్ట్రంలో కుక్క ,కోతుల భయం ఎక్కువగా ఉంది .కుక్క కాటు వాళ్ళ రేబిస్ అంటూ ఏదో ఒక చోట నుంచి వార్తలు వస్తున్నై .ఎందరో చని పోతున్నారు ..తాజాగా ఈరోజు కూడా పెద్దాపురం లో మూడేళ్ళ చిన్నారి రేబిస్ వాళ్ళ చని పోయిందన్న వార్తలు కలవర పెడుతున్నాయి .మరో పక్క చాల చోట్ల కోతులు జనాన్ని ఇబ్బంది పెడు తున్నై .ప్రభుత్వం కార్యక్రమాన్ని తీసుకున్ని అన్ని జిల్లాల్లో ఒకేసారి అమలు చేస్తే ప్రయోజనం ఉంటుంది .లేక పోతే అంతే సంగతులు

20, మే 2011, శుక్రవారం

,ఒకే ఒక్కరోజు ..అసలు ఏమి అనరాదు

రాము -నాన్న !ఈరోజు నువ్వు ,అమ్మ నాకొక మాట ఇవ్వాలి
తండ్రి -ఏం ఎందుకో
రాము -ముందు మాట ఇవ్వండి ..ఒక్కరోజు ,,,ఒకే ఒక్కరోజు ..అసలు ఏమి అనరాదు
తండ్రి - సర్లే ఏమి అనం లే ? ఇంతకి ఏమిటి కథ
రాము -, ఏమి లేదు నాన రేపు టెన్త్ రిసల్ట్ .................నా నెంబర్ ఉంటే ఉండొచ్చు ..లేక పోవచ్చు ..అందుకని

15, మే 2011, ఆదివారం

కూతురి కోసం పెట్రోల్ ...

మామ -అదేమిటండి అల్లుడు గారు ....పండక్కి బైక్ కోసం అరవై వేలు రూపాయలే ఇస్తామన్నం ..ఇప్పుడు లక్ష ఇవ్వమంటే ఎలాగండీ...
అల్లుడు -భలే వారే మామ గారు ! పెట్రోల్ ధర పెరిగింది చూసారా ! మీరు బైక్ ఇస్తే సరిపోయిందా?మీ అమ్మాయిని సినిమాకి తీసుకువెల్లాలన్న తడిపి మోపెడు అవుతుంది .నా జీతం తో పెట్రోల్ కొట్టించలేను.... నలబై వేలు అదనంగా ఇస్తే మీ పేరు చెప్పుకుని ఏడాది తిరుగుతానండి"

14, మే 2011, శనివారం

ఇరవై రూపాయిలతో ఏ సి లో నిద్ర ?????!!!!

మనసుంటే మార్గాలు బోలెడు అన్నారు పెద్దలు ...నిజమే ... ఫంక్సన్ నిమిత్తం మొన్న రాజమండ్రి వెళ్ళా ...మధ్యాహ్నం విందు తర్వాత ఇంటికి బయలుదేరే ముందు బయటకు వస్తే తెలిసింది ....ముందు టెండ చుర్రుమని తగులు తుంటే ......వేడిగాలి చెవులను తాకి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే వామ్మో !అనవసరంగా బయలుదేరాను అనుకుని మనసులో తిట్టుకుని .....ఏం చెయ్యాలి ..అనుకునే లోగా ఎదురుగా పోస్టర్ చూసి .......అయిడియా తో గబా గబా పరిగెట్టాను.....వరుసగా రంభ ,ఊర్వశి..మేనక .....ఫుల్లు సి హాల్స్ ......హాల్లోకి పోతే చాలు ఎండ ను జయించవచ్చు .....రంభ ,మేనక అప్పటికే ఫుల్లు ...ఇక ఊర్వశి ....వామ్మో సినిమా తలపోటు .....అనుకుని ....అయినా సినిమా చూడడానికి వచ్చానా నాలో నేను సమర్దించుకుని ..నలబై రూపాయిల టిక్కెట్ తెసుకుని లోపాలకి వెళ్ళా !.....హాల్లో అడుగుపెట్టగానే హిమాలయాల్లో అడుగు పెట్టినంత సంబరం .... సి చాల బావుంది .కుర్చీ ఇంకా బావుంది ..... ..అటు ఇటు చూసా ...యాబై రూపాయలు ఫుల్ కాలేదు కాని నలబై ఫుల్ అయిపోయాయి ....ఎదురుగా ఇరవై సీట్లు ఖాళీగా కనిపించాయి ...కొంత సేపటకి......పోలో మంటూ జనాలు ....ఆపసోపాలు పడుతూ .....కుర్చీ లో కూర్చున్ని హమ్మయా అనుకుంటూనారు......తెర మీద బొమ్మ ... పది నిమిషాలు చూసేసరికే ఎదోలో అనిపించింది ....అటు ఇటు చూసా హాల్లో సగం మంది నిద్ర పోతూ కనిపించారు ..ఇరవై రూపై టికెట్ గలరిలో అయితే .....హాయిగా నిద్ర పోతునారు .....నేను అల ఇలా చూసి నిద్రలోకి జారుకున్నా .....జనం హడావిడి తో హటాత్ గా లేసా!అప్పటికే సి కట్టినట్టునారు చల్లదనం తగ్గుతోంది ....డోర్ లోంచి బయటకు వచ్చేసరికి మళ్ళి సెగలు ........అయితే ఎండ పెద్దగా లేదు ....అలా మెయిన్ రోడ్ కేలదామని ముందుకు కదిలా ..రకరకాల వస్తువులు అమ్ముతున్నవారిని చూస్తూ ..ఆశ్చర్య పోయా ..సినామా హాల్లో ఇరవై రూపాయిల గ్యాలరీలో కనిపించిన వారిలో ఎక్కువ మంది వీరే .......
"రోజుకి ఇరవై రూపాయలు పోతే పోయాయి గాని ప్రాణం హాయిగా ఉంటుంది .. ఎండ లో ఎలాగు బేరం లేదు ......గంటకు కూల్ డ్రింక్ తాగాలి ..హాయిగా ఇరవై రూపాయలతో ... సి లో పడుకోవచ్చు ......"
వారి మాటలు విని అవాక్కయ్యాను ...ఇదేదో బావున్నట్టుంది అన్పించింది తర్వాతా ..

జగన్ గెలుపు పై హీరో పందెం

జగన్ గెలుపు తర్వాత సాక్షి టి వి లో విలక్షన్ వ్యక్తి మోహన్ బాబు ఈరోజు మాట్లాడారు .జగన్ నేటి రాజకీయ అభిమన్యుడుగా పోల్చారు .ఎన్నో దుష్ట శక్త్తులు జగన్ గెలవగుండా చేద్దామనుకున్నాయని అయితే వారి పద్మవ్యూహాని చేదిన్సి మంచ్న్సి మెజార్టీతో ప్రత్యర్ద్దులని మట్టి కరిపించారని చెబుతూ ఇదంతా తన పేద బావ గారు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశిస్సులు అన్నారు .కాగా జగన్ మెజార్టీ పై పండం కట్టి పందెం గెల్చుకున్నానని చెప్పారు ....తన పెద్ద కొడుకు పెళ్లి తర్వాత మోహాన్ బాబు వై ఎస్ కుటుంబానికి చేరువయ్యారు ...త్వరలోనే జగన్ పార్టీలో చేరవచ్చు

11, మే 2011, బుధవారం

గోదావరి జిల్లాల్లో పందాలే పందాలు ....జగన్ మోజార్తీ పైనే పందాలు అన్నీ

తూర్పు ,పశ్చిమ గోదావరి జిల్లాలో పందాలు పసందుగా ఉంటాయి .... పందెం కైనా "కాయ్ రాజా కాయ్" అంటారు ...ఎన్ని పోలీసు నియమ నిబందనలు ఉన్న పండుగ సమయాల్లో కోడిపందాలు భారీగా జరిగి పోతుంటాయి ...ఎడ్ల పందాలు ,గుర్రప్పు పందాలు ....హుషారుగా ......సాగు తాయి. ఇక ఎన్నికల సమయం లో రాజకీయ పందేల జోరు వేరు ...డబ్బు తో పాటు ...పొలాలు ,స్థలాలు ,బడ్లు,బైక్లు ..తెగ కాస్తారు ..నేడు కడప ఉప ఎన్న్కికలు సందర్బంగా పందాలు భారీగా జరుగుతున్నాయి ...జగన్ కు ఎంత మెజారిటి ఎంత వస్తుందన్న విషయం పైన పందాలు జరగడం విశేషం .ఇటీవల కడపకు ప్రసారం కోసం పలువురు అక్కడకు వెళ్ళారు ....వీరి అంచనాలను బట్టి పందాలు జరుగుతున్నాయి .పందాలు అన్ని పార్టీలవారు పడుతున్నారట .వీటిలో కోసు పందాలు కూడా ఉన్నాయి మరి ..ఎవరు అదృష్టవంతులో నెల పదమూడున తేలనుంది .

.ఓ లచ్చ పెట్టి నా కొడిక్కి తల.....

పెళ్లిల పేరయ్య -అమ్మ నీ కొడిక్కి కాజల్ లాంటి పెళ్లి కూతురు కావాలంటే మీ వాడికి బట్ట తల ఉండ కూడదు ....
సీత -చూడ పేరయ్య .....ఇంకో పది లక్షలు ఎక్కువ ఇచ్చే సంబంధం చూడు ..
పెళ్లిల పేరయ్య -అదేమిటమ్మ ..అసేలే బట్టతలా వల్ల కట్నం తగ్గుతోంది అంటుంటే ..
సీత - రోజు పేపర్ చూడ లేదా ? బట్టలు మందు వచ్చేసింది ..... లచ్చ పెట్టి నా కొడిక్కి తల రప్పిస్తా ..నువ్వు రేటు పెంచు ....

8, మే 2011, ఆదివారం

"వంద" అడుగుతోంది మామో !

అల్లుడు -ఎంటండి మామ గారు !మీ అమ్మాయి ప్రతి రోజు రాత్రి వంద రూపాయిలు ఇమ్మంటోంది......అసలు
మామ -అపార్దం చేసుకోకండి అల్లుడు గారు ...చిన్నప్పుడు నుంచి నేను మా అమ్మాయి కి వంద నోట్ ఇచ్చేవాడిని ..అదే అలవాటు కంటిన్యూ చేస్తునట్టుంది .

7, మే 2011, శనివారం

ఈనాడు ,సాక్షి లలో ఇవి ఎప్పటికైనా కనిపించగలవా ?.ఆ దమ్ము ఆ రెండు పత్రికలకు ఉన్నాయి ?

ఈనాడు ,సాక్షి దిన పత్రికలలో కొన్ని చూడగలమా ? ఎప్పుడు చూడలేమా? ఈనాడు రామోజీ రావు ను రాజ గురువుగా గురువింద గింజ గా ,,,ఫోర్ ట్వెంటి గా ..పచ్చ రాతలు పిచ్చి రాతలు రాసేవాదేగా అభివర్ణిస్తూ ..ప్రతి రోజు సాక్షి లో కధనం ఉంటుంది ...అదే విదంగా ...అవినీతి చక్రవర్తి కొడుకు ...పాపల పత్రిక ..గనుల దొంగ ......అంటూ ఈనాడు వారు జగన్ గురించి కథనం రాస్తారు .......అవిన్ని చూసి రోజు జనం నవ్వుకుంటారు ...
అయెతే రోజు పేపర్ చదివే ప్రజలకు .... రెండు పత్రికల్లోను ఒకటి చూద్దామని వెతుకుతారు ....కాని కనిపించదు .
సాక్షి పత్రికలో ..చాన్నాళ్ లో రామోజీ ,చంద్రబాబు ...సి ఏం కిరణ్ వంటి వారి గురించి రకాల రకాల కార్టూన్లతో కామిడి చేస్తారు ..
కనీసం మాటవరస కైనా ఒక్క కార్టూన్ కూడా జగన్ గురించి ఉండదు
.
అదే పరిస్తితి ..ఈనాడు లో రామోజీ రావు గారి గురించి ఎన్నో కోర్టు కేసులు ...అవి పత్రికలో కనిపించవు .
.
కనీసం రామోజీ పై కార్టూన్ ఉండదు ...
పూర్వ కాలం పలువురి పెద్దలు తమ మీద తామే చమత్కారంగా జోకులు వేసుకునే వారు ...
ఎవరి పై నైన అవలీలగా సెటైర్ వేయగల కార్తునిస్తూ శ్రీధర్ గారు ! మీ గురువు గారి పై జోక్ వేయ లేరా ?
అలాగే సాక్షి వారు మీ పత్రిక లేదా చానల్ లో జగన్ గురించి సటైర్ వెయ్యండి చూద్దాం .!.
పేపర్ అన్నాక ..చాన్నాళ్ అన్నాక ..ఇలానివి కూడా ఉన్నప్పుడే జనం మెచ్చుకుంటారు ..తమ డబ్బా కొట్టుకోవడం తప్పు లేదు కాని ప్రజలు కోరుకునేది చెయ్యాలి ..... దమ్ము రెండు పత్రికలకు ఉన్నాయి ?

రొమాన్సు బదులు "రేబిస్ " ???

నిర్మాత -సార్ మన సినిమా పేరు అర్జెంట్ గా మార్చాలి ?
డైరెక్టర్ -అదేమిటి
సార్ "రొమాన్సు " అని మాంచి టైటిల్ ఉంటే మీరు ..
నిర్మాత -రొమాన్సు బదులు "రేబిస్ " అని పెట్టాలి
డైరెక్టర్ - రేబిస్ ఏంటండి???
నిర్మాత -మన హీరో గారిని పది రోజుల క్రితం కుక్క కరిచింది అట ......"నేను హీరో ని" ....అని పోజు కొట్టి ఇంజక్సన్ చేయించుకోలేదట ..నిన్నటి నుంచి యేవో లక్షనాలు కనిపిస్తున్నాయట...యందు కన్న మంచిది ..కథ కుంత మార్చి రేబిస్ అని టైటెల్పెట్టి ......

6, మే 2011, శుక్రవారం

తెలుగు జాతి గర్వ పడేలా ఎన్ టి ఆర్ పెళ్లి -తల్లి శాలిని కి తగిన స్థానం

జూనియర్ ఎన్ టి ఆర్ చాల సంప్రదాయబద్దంగా మంచి వేడుకగా జరగడం శుభకరం .ఇటవల జరుగుతున్నా పెళ్లిలు ఏదోఅదో తంతు లా జరుగుతున్నాయి .యెంత ఖర్చు అయ్యింది అన్న విషయం పక్కన బెడితే ....తెలుగువారు గర్వించేరీతిలో పెళ్లి చేయడం నందమూరి వారిని పూర్తిగా అభినందించాలి .మీడియా లో ప్రసారం వాళ్ళ చాల మంది చక్కగాపెళ్లిని ఆస్వాదించారు .ఆతిధ్యం బావుంది .కనుల పండుగగా పెళ్లి తంతు ముచ్చట గొల్పింది .ఎన్ టి ఆర్ ...నందమూరివంశం లో తన తల్లి శాలిని కి తగిన స్థానం కనిపించినట్టు పెళ్లి చూస్తే తెలుస్తుంది .కొడుకు దగ్గరే తల్లి ఉంది అన్నిచక్కబెట్టింది .హరికృష్ణ తో బాటు కళ్యాణ రామ్ కూడా ఎన్ టి ఆర్ కు బాగా సహకారం అందించాడు .కుటుంబ సభ్యులనుముఖ్యులు తనను ఆశీర్వదించే లా ఎన్ టి ఆర్ కళ్ళు కనిపించేవి ...కళ్యాణ్ రామ్ తల్లి కూడా వచ్చి ఆశీర్వ దించినట్టుకనిపించింది ...
కాగ పెళ్లి కూతురుని చాల చక్కగా ముస్తాబు చేసారు .ఎన్ టి ఆర్ కు తగిన వనిత గా కనువిందు చేసింది .ముఖ్యంగాఆమె కళ్ళు ప్రధాన ఆకర్షణ .తలంబ్రాలు పోయుట ,ఉంగరాలు తీయుట వంటి ఘటనలు చూసే వారికందరికీ ఆనందంకల్గించాయి .మొత్తం మీద తెలుగు జాతి గర్వ పడేలా ఎన్ టి ఆర్ పెళ్లి జరిగింది
,

బాబోయి ..నేను సి ఏం అవ్వను .

భర్త -ఏమిటే వాడి గోల ....ఎందుకు మారం చేస్తున్నాడు ?
భార్య -బాగా చదువు కుంటే ముఖ్యమంత్రి అవుతావు అన్ననండి ......బాబోయి ..నేను సి ఏం అవ్వను ...హెలికాప్టర్ ఎక్కితే చచ్చిపోతాను ....అంటూ గంట నుంచి ఎడుస్తున్నాడండి

5, మే 2011, గురువారం

ఎన్ టి ఆర్ పెళ్లి తంతు లో మఖ్యమైన కార్యక్రమాలు అన్ని "తూర్పు గోదావరి " జిల్లా వారి ద్వారానే

నేడు జరుగుతున్నా ఎన్ టి ఆర్ పెళ్లి తంతు లో మఖ్యమైన కార్యక్రమాలు అన్ని "తూర్పు గోదావరి " జిల్లా వారి ద్వారానే జరగడం విశేషం .పెళ్లి ముహూర్తం దగ్గిరినుంచి అన్ని సెంటిమెంట్ గల తూర్పు నుంచే మొదలు పెట్టారు .కోనసీమకు చెందినా పంతులు గారు ముహూర్తం నిర్ణయించారు .పెళ్లి కూతురికి ఎన్ టి ఆర్ తల్లి ఉప్పడ పట్టు చీరలు పట్టుకెళ్లారు.పెళ్లి కూతురు ,పెళ్లి కొడుకు చేతుల్లో ఉండే కొబ్బరి బొండాలు మండపేట నుంచి తీసు కెళ్ళారు (ప్రతి ఏట భద్రాచలం,అన్నవరం లలో జరిగే పెళ్లి తంతు కు ఇక్కడనుంచే పట్టి కెలతారు ).కొత్త పేట నుంచి పనసు పొట్టు కూర ,దోస ఆవ కై విందు లో పసందు చేయనుంది ..ఇవే కాకుండా అభిమానులు "ఆత్రేయ పురం పూత రేకులు ,కాకినాడ, తాపేశ్వరం కాజాలు ....అన్నవరం ప్రసాదం ,కడియపు లంక పువ్వులు తీసుకెళ్ళారు ....ఇవే కాకుండా బాల కృష్ణ వియ్యంకుడు కాకినాడ వాసి కావడం తో మరిన్ని పెళ్లి తంతు కు తీసుకు వెళ్లినట్టు సమాచారం ....కాగ ఎన్ టి ఆర్ కు కొన్ని రకాల మాంస హారం చాల ఇష్టం అని పెళ్లి తర్వాత విందు ఐటం తీస్కు వెళ్ళడానికి రెడి అవుతున్నాటు చేబుతునారు .....పెళ్లి లో (హైదరాబాద్ తర్వాత )ఎక్కవగా పాల్గుంటున్న వారు జిల్లా వారే కావడం మరో విశేషం