9, అక్టోబర్ 2011, ఆదివారం

"దూకుడు " వంద రోజుల వేడుక కాకినాడలో


మహేష్ బాబు లేటెస్ట్ హిట్ మూవీ "దూకుడు " వంద రోజుల వేడుక కాకినాడలో జరగనుంది ..దర్శకుడు శ్రీను వైట్ల స్వయంగా విషయం వెల్లడించారు .దూకుడు విజయ యాత్రలో భాగం గా చిత్ర బృందం కాకినాడ వచ్చారు .ఇక్కడే పుట్టి పెరిగిన శ్రీను కు పట్టణ మహేష్ ప్రాన్సు ఘనం గా సన్మానం చేసింది .

5, అక్టోబర్ 2011, బుధవారం

రాజమండ్రి రెడ్ ఎఫ్ ఏం దసరా సంబరాలు ఇలా జరిగాయి rjy 93.5 red fm dasara sambaraalu





రాజమండ్రి రెడ్ ఎఫ్ ఏం దసరా సంబరాలు హోటల్ షెల్టన్ లో జరిగాయి .ఉభయ గోదావరి జిల్లాకు చెందినా రెడ్ అభిమానులతో ఉల్లాసం గా ఉత్సవం గా సంబరాలు చేసారు .ఎప్పుడు కనపడ కుండ కనిపించే రేడీయో జాకీలు స్వయంగా కనిపించి ఆనదింప చేసారు .ఎఫ్ ఏం లో గురువు గా కనిపించే మురళి కార్యక్రమాన్ని నడిపించారు .వచ్చిన వారినందరిని ప్రతి నిమిషం శ్రీను మామ నవ్వించి కవ్వించాడు .డాన్సు తో అదరగొట్టాడు .మురళి -శ్రీను కడుపుబ్బా తమ మాటలతో కడుపుబ్బా నవ్వించారు .లేడీ జాకీలు సంధ్య .మహా ,హానీ తమవంతు పాత్ర పోషించారు .సాహితీ మాత్రం అలా కనిపించి ఇలా వెళ్లి పోయింది .కుర్ర ఆకాష్ టోపీ పెట్టుకుని సందడి చేసాడు .
వచ్చిన వారిలో అయిదుగురు జంటలతో ఒకికొకరు అంటూ మూడు రౌండ్ లు ఆటలాదించారు .వీటిలో డాన్సు భావుంది .రావులపాలెం జంట ఉర్రుతలూగించింది .తర్వాత ఎంపికైన ముప్పయి మంది తో రకరకల ఆటలు ఆడించారు .విజేతలకు బహుమతులు ఆడించారు .మొత్తం ఏడు గంటల పాటు ఇది జరిగింది .

25, సెప్టెంబర్ 2011, ఆదివారం

క్లైమాక్ష్ తీయడం లో మన దర్షకు లు చేతులు ఎస్తేస్తున్నారు ????????

మధ్య ఎక్కువ సినిమాల్లో ప్రధమార్ద్తం బాగానే ఉంటున్న ద్వితీయార్ధం మాత్రం బావుండడం లేదు ..ముఖ్యం గా క్లైమాక్ష్ చప్పగా ఉంటోంది .....మొదటి భాగం లో హీరో నవ్విస్తూ హీరొయిన్ ను ఏడిపిస్తూ ..కమిడియన్స్ ను ఆట పట్టిస్తూ సరదాగా సాగి పోతూనే ...ఇంటర్వల్ సమయానికి తన విశ్వరూపంతో .....విలన్కు చమటలు పటిస్తాడు...ఇక అంతే .ప్రేక్షకుడు ...ఇంకా ఏదో ఉంది ..ఆత్రుత పడుతున్న ...సినిమా చప్పగా ..సాగదీత మొదలై చివరికి ....మొదటి భాగంలో ఉన్న ఆనందం కూడా ఆవిరి అవుతోంది .....
... సినిమా చూసిన ఇదే కనిపిస్తోంది ...విశ్రాంతి సమయానికే .....అసలు కథ అయిపోతే ..ఇక ఏముంటుంది ? క్లైమాక్ష్ అయితే మహా బోర్ గా ఉంటోంది ...ఎందుకో చాలామంది అగ్ర దర్శకులు సైతం క్లైమాక్ష్ బాగే తీయలేక పోతున్నారు ...స్క్రిప్ట్ కేవలం విశ్రాంతి వరకు రాసుకుని వదిలేసి ..తర్వాత ఏదో క్లైమాక్ష్ సీన్ అల్లుతున్నారా అన్న అనుమానం కల్గకమానడం లేదు .ఇది ప్లాప్ అయిన సినిమాలకే కాదు ..హిట్ అయిన వాటిలోన్ను అంతే ..తాజాగా విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న "దూకుడు " లోను ద్వితీయార్ధం చప్పాగా సాగింది .విలన్లను చంపడానికే ..సినిమా సాగదీసి నట్టు సామాన్య ప్రేక్షకుడి కైనా తెల్సిపోతుంది ....దర్శకులు కాస్త క్లైమాక్ష్ పై ద్రుష్టి పెడితే మరిన్ని సినిమాలు హిట్ అవుతాయి .

దూకుడు లో డైలాగ్స్ కొన్ని


శ్రీను వైట్ల దర్శకత్వానికి కోన వెంకట్ మాటలు ..మహేష్ బాబు డైలాగ్ డెలివరీ తోడై ప్రిన్సు పిక్షర్ దూకుడు కు ప్లస్ పాయింట్ .
దూకుడు లో డైలాగ్స్

""""మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోవటమే.."""""


"""దూకుడు లేకపోతే పోలీస్ మాన్ కీ పోస్ట్ మ్యాన్ కీ తేడా ఏం ఉంటదీ?"""

""మా నాన్న ఒకటి చెప్తూ ఉండేవాడు ధైర్యంగా ముందుకెళ్ళి పోతే దారి తెలియక్కర్లేదు. డైరెక్ట్ అయిపోవటమే.""

"""నాకు ఒక్క నిమిషం ఇస్తే ఆలోచిస్తా, రెండు నిమిషాలు ఇస్తే యాక్షన్ లోకి దిగుతా, మూడు నిమిషాలు ఇస్తే ముగించేస్తా...!


""""చూశావా? పంచ్ పడేసరికి ప్రొఫెషన్ చెప్పేశావ్.? "


"



"నేను నరకటం మొదలెడితే నరకం లో హౌస్ఫుల్ బోర్డ్ పెట్టుకోవాలి "

"""'కళ్లున్నోడు ముందు మాత్రమే చూస్తాడు. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు"".


""""భయానికి మీనింగే తెలియని బ్లడ్ రా ..... నాదీ..!""

"""కలర్ ఏంటీ నీ కలర్ ఏంటీ?
ఎదవ పిట్ట మొహమేసుకొని."".

చూస్తావ్ గా.. పర్మిషన్ ఇస్తే పేకాడేస్తాను.



"నీ లైఫ్ లో నువ్వు చాలా మంది తో పెట్టుకొని ఉంటావ్. కానీ ఒక్కడి తో మాత్రం పెట్టుకోకు. అమ్మ కడుపులోంచి ఎందుకు బయటకొచ్చానా? అని ఫీలవుతావ్. ....ఆ ఒక్కడినీ నేనే "

"పడుకున్న పులినీ, పని చేసుకునే పోలీసునీ కెలికితే... వేటే"







24, సెప్టెంబర్ 2011, శనివారం

ఆంధ్రుల అన్న గారు ,నటరత్న ఎన్ టి ఆర్ భారత్ ప్రధాన మంత్రి గా కనిపించారు ...ఏమిటి చనిపోయిన అన్న గారు .....ఏమిటి పిచ్చి అనుకుంటునారా ?నిజమే నండి..

ఆంధ్రుల అన్న గారు ,నటరత్న ఎన్ టి ఆర్ భారత్ ప్రధాన మంత్రి గా కనిపించారు ...ఏమిటి చనిపోయిన అన్న గారు .....ఏమిటి పిచ్చి అనుకుంటునారా ?నిజమే నండి..కాకపోతే ...వెండి తెర పై ..
మహేష్ తాజా సినిమా అన్న ఎన్ టి ఆర్ ప్రధానిగా కనిపించారు .......ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ....దూకుడు సినిమాలో హీరో మహేష్ బాబు తన తండ్రి ఆరోగ్యాన్ని కాపాడడానికి నాటకం ఆడతాడు ..తానూ ఏం ఎల్ గా నటిస్తాడు .. క్రమంలో తన తండ్రి ప్రకాష్ రాజ్కు ఎన్ టి ఆర్ ప్రధాని అయ్యారని చెబుతారు ......చాల సంత్సరాలు తర్వాత కోమాలోకి వచ్చిన ఆయన టి వి లో ఎన్ టి ఆర్ ను చూడడానికి సిద్దం అవుతాడు ...అప్పుడు ఎన్ టి ఆర్ సి ఏం గా ఉన్నప్పుడు ఉన్న కొన్ని మాటలతో డబ్బింగ్ వస్తుంది ..అది సంగతీ .....మొతానికి ఎన్ టి ఆర్ ను శ్రీ ను వైట్ల ప్రధానిని చేసేసాడు ..బ్రతికి ఉంటే అదే నిజమువునేమో ...

15, సెప్టెంబర్ 2011, గురువారం

..ఆ బంకే కావాలి!

వాసు : చూడండి బావగారు ..అల్లుడు గారికి కట్నం క్రింద కోటి రూపాయల ఇస్తాను
రవి : అవేమి వద్దు గాని .. సెంటర్లో ఉన్న మీ చిన్న పెట్రోల్ బ్యాంకు ఇవ్వండి చాలు

14, సెప్టెంబర్ 2011, బుధవారం

ఎంద చాట ......ఈ టి వి లో " ఆలి త్రీ సిక్స్ నైన్ "పేరు తో.....

ఎంద చాట ......ఇది వింటేనే నవ్వుల ఆలి గుర్తుకు వస్తాడు .....తాజా గా మళ్ళి పదంతో బుల్ల్లి తెర పై కనువిందు చేస్తున్నాడు . టి వి లో " ఆలి త్రీ సిక్స్ నైన్ "పేరు తో మంగళవారం రాత్రి నుంచి సరికొత్త కార్యక్రమం ప్రారంబమైంది .......ఆలి యాంకర్ గా దీనిని రూపొందించారు .కొన్ని రౌండులు మాంచి నవ్వు తెప్పించిదే గా ఉన్నాయి .మొదటి ఎపిసోడ్లో సురేఖరాణి వాళ్ళ అమ్మాయితో ....ఒక జంట గా రాగ మిమిక్రి రెడ్డి ,ఆలాగే కుంచె రఘు పార్టి సిపెంట్స్గా పాల్గొన్నారు .
మొదటి రౌండ్ లో "నా రూటే సెపరేట్ " లో వారికి నచ్చింది చెయ్యాలి .తర్వాత రౌండ్లో .......దడ..దడ లో తిరిగే చక్రంలో ఉన్న బొమ్మలను ఆయా సినిమా పోస్టర్స్ కు ఎదురు గా అమర్చాలి .తర్వాత ఎంద చాట లో "థర్మోకోల్ చెరువు లో ఉన్న బాల్స్ ను ఇచ్చిన చాట తో జల్లించి సీస లో వెయ్యాలి ......తర్వాత రౌండ్లో"నువ్వు నీను నవ్వు రౌండ్" లో అసలు నవ్వకూడదు .తర్వాత రౌండ్లో ఒక ఎద్దు బొమ్మ గా ఉండే చక్రం ఉంది ...అది తిరుగు తుంది దీని మీద పది పోకుండా ఉండాలి ....చివరగా ఆలి ఒక హీరో వేషంలో పాటల లో నటించి ...తర్వాత కొన్ని ప్రశ్నలు అడుగుతాడు .

మొత్తం మీద కార్య క్రమం వినోదంగానే ఉంది .ఎక్కువ రౌండ్స్ ఉనా పెద్దగా బోర్ కొట్టదు..ముఖ్యం గా "నువ్వు నీను నవ్వు " "ఎంద చాట ...."రౌండ్ లు బాగే నవిస్తాయి .ఝాన్సి తో డాన్సు బేబి డాన్సు తర్వాత మళ్ళి ఆలి బుల్లి తెర పై యాంకర్ గా కనిపిస్తున్నాడు .