28, ఫిబ్రవరి 2011, సోమవారం

వాళ్ళు అన్నదమ్ములుగానే ఉంటారు "మీకే పిచ్చి "

పిచ్చి అభిమానం పిచ్చి చేష్టలు ......అభిమానం హద్దు మీరితే ..వెర్రి అభిమానం అవుతుంది .....తన అభిమాన హీరో గురించి గోరంత కొండంత గా చెప్పుకోవచ్చు తప్పు లేదు .అంతే కాని ఇతర తారల గురించి ..అవహేలంగా ...వేళాకోళంగా ..మరింత పచ్చిగా మాట్లడం ఏ మాత్రం మంచిది కాదు .ఈ మధ్య తమకు నచ్చని తారల గురించి చాల దారుణంగా
కొందరు వ్యహరిస్తున్నారు . ఇంటర్నెట్ లో రాయలేని విధంగా కామెంట్ చెయ్యడం ,ఎస్ ఎం ఎస్ లు పంపడం ......చెడు అలవాటుగా మారింది ....సినిమా వచ్చినపుడు సరదాగా సెటైర్లు వేసుకోవడం సహజం ..కాని అది పనిగా ....చాల చెత్త మాటలతో పాటు "మార్పింగ్ " చేసి నెట్ లో పెట్టడం చేస్తున్నారు .ఎంత బాధపడి ఉంటే యువరత్న బాల కృష్ణ పిర్యాదు
చేసి ఉంటారో అర్ధం చేసుకోవచ్చు .ముఖ్యంగా చిరు -బాలయ్య ల కుటుంబాల హీరోలు గురించే ఎక్కువగా "పిచ్చి అభిమానులు "పిచ్చపనులు చేస్తున్నారు .వీరిలో ఎక్కువగా ప్రవాస తెలుగు వారు ఉండడం దురదృష్టకరం . నెట్ వల్ల
ప్రపంచంలోని అన్నిప్రాంతాల వారు దగ్గర అవుతున్నారు .అయితే కొందరు వెర్రి వాళ్ళు చేసే వికృత పనులకు ఎంతో మంది భాద పడుతున్నారు ..ఈ దురాచారం భవిష్యత్ లో కనిపించరాదు .
ఇంతకి మరొక విషయం ఏమిటంటే సినిమాలు తారలు అందరూ అన్నదమ్ములుగానే ఉంటారు .

27, ఫిబ్రవరి 2011, ఆదివారం

."కొండవీటి రాజా-కోట లో రాణి " రియాలిటి షో .లో ఏ విలువలు ఉంటాయి ?

తెలుగు లో జీ టి వి వారు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ."కొండవీటి రాజా-కోట లో రాణి " రియాలిటి షో .
అయితే ఎంత వరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి .రెండు నెలల పాటు ఒక కోట లో పది జంటలు చేసి విన్యాసాలు
ఎలా ఉంటాయన్నది ఆసక్త్తికరం. హాలిహుడ్ టి వి లో వచ్చిన శిల్ప శెట్టి వంటి వారు పాల్గున్న రియాలిటి షో తరహాలో
ఈ కార్య క్రమానికి రూపకల్పన చేసినట్లు కనిపిస్తోంది .అడివిలో పుట్టిన యువకులను ఏరి కోరి తెచ్చారు .వారిని మోడరన్ గా మార్చడానికి టౌన్ పడతులను ఎంపిక చేసారు . ప్రస్తుతం వాళ్ళు కోట లో ఎంటరై తిండి .అమ్మాయిలు ఎలా తినాలో
నేర్పుతున్నారు ...సెలబ్రిటిగా హీరిఒన్ సదా వచ్చి డాన్సు పెట్టింది .....ఇంకేమి చేయిస్తారో ..చేయబోతున్నారు చూడాలి .అయితే తెలుగు అమ్మాయిల నైతిక విలువలు నిలబెట్టే విధం గా ఈ కార్యక్రమం కొనసాగితే పర్వాలేదు కాని ..ఏ మాత్రం
తేడా వచ్చినా మంచిది కాదు .

"ఇంకా జీతాలు అందలేదు " రేపు రా !!!

భార్య -ఆదివారం పూట రెస్ట్ తీసుకోకుండా ...అట్ట, స్కెచ్లు
పట్టుకుని హైరానా పడుతున్నారు -
భర్త -నీ మొహం ! ఇది ఆఫీసు పని కాదు .మన పనే ....
ఈ నెల జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు ....
పాలవాడునీళ్ళవాడు ,పేపరోల్లు రోజు యేమని చెబుతాం .
.అందుకే "ఇంకా జీతాలు అందలేదు " అనే బోర్డు తయారు
చేసి గుమ్మంముందు పెడతా
,

అది తింటే పులి దొరుకుతుంది నాన్న 1

చింటు -ఏంటి నాన్న! అందరు అక్కడే చూస్తున్నారు ?
రవి -చిరుత పులి ఇంట్లోకి వచ్చిందట . పట్టుకోవడానికి అధికారులు
చూడడానికి ప్రజలు వచ్చారు .
చింటు -ఓస్ అంతేనా !....దానిని నీను ఈజీగా పట్టుకుంటాను .
రవి - ఎలాగండి బాబుగారు ?
చింటు -ఏముంది నాన్న ! నిన్న నువ్వు చేసిన స్వీట్ ఒకటి
కిటికీ లోంచి వేస్తే ...అది తినగానే రాత్రి అమ్మ కళ్ళు తిరిగి
పడిపోయినట్టు పులి కూడా పడిపోతుంది

26, ఫిబ్రవరి 2011, శనివారం

ఆంధ్రజ్యోతి తో రామ్ గోపాల్ వర్మ

అప్పలరాజు సినిమా లో తానూ వాయిస్ ఓవర్ లో చెప్పిన మాట "ఇది కామిడి కాదు ..ట్రేజడి" అని చెప్పడం ఫన్నిగా
చెప్పను తప్ప.ట్రేజడి అని కాదు ....అని రాము చెప్పారు .ఈరోజు ఆంధ్రజ్యోతి చానల్ లో కొద్దిసేపు వర్మ తో చర్చ జరిగింది .
ఈ వర్మ హిట్టా ? ఫట్టా ? పేరుతో మూర్తి వర్మతో ముచ్చటించారు .తానూ ఎప్పుడో మాటల్డిన మాటలు కూడా ఇప్పుడు
లౌడ్ స్పీకర్ లో మీడియా ఎక్కువగా చూపిస్తోందని చెప్పారు .ఈ చర్చలో కేవలం "అప్పలరాజు సినిమా గురించే
మాట్లాడారు . ఏ రంగం లో నైన మంచి చెడు ఉంటుందని ...అలాగే సినిమా ,మీడియా లోను మంచివారు ,చెడ్డవారు
ఉంటారని చెప్పుకొస్తు ..........అందరిపైన సరదాగా సెటైర్లు వేశామని ..అప్పలరాజు తన కోణం లో కామిడి సినిమా అని
వర్మ వివరించారు .

సెల్ వాడితే మెదడు చురుగ్గా పని చేస్తుందట !

"సెల్ ఫోన్లో మీరు ఇష్టం వచ్చినంత సేపు మాట్లాడు కోవచ్చు .
బ్రెయిన్ పై ఏ విధమైన రేడియేసన్ ఉండదు .పైగా మెదడు
చురుగ్గా పని చేస్తుందట ." ఈ సరికొత్త విషయం చెప్పింది
సామాన్యులు కాదు . ఆమెరికా హెల్త్ ఇన్స్టిట్యూట్ వారు
చెప్పారు ....ఇదే నిజమైతే ఇక చెవిలోంచి ఎవ్వరు సెల్
తియ్యరు .

"ప్రేమ కావాలి " లో విశేషాలు -

నిర్మాణపరంగా మంచి సాంకేతిక పరిజ్ఞానం తో నిండిన
"ప్రేమ కావాలి " ఏది లోటుగాఉన్నదీ సినిమా చూసిన
ఎవ్వరైనా యిట్టె చెప్పేస్తారు . దర్సకత్వ లోపం తీవ్రంగా ఉంది .
ఓ అంతర్ జాతీయ తీవ్ర వాది ని ఓ కుర్రాడు హతం చెయ్యడం
ఏదో సిల్లిగా చేసినట్టు నవ్వు తెప్పిస్తుంది ....దేవగిల్ లాంటి విలన్
ను తీసు కుని క్లైమక్ష్ను తుస్సు మనిపించారు.హీరో పాత్ర బావున్న
కథనం బాగా లేదు .వర్మ రాసిన సంబాషణలు మాత్రం ఆకట్టుకుంటాయి .
విశేషాలు -
ఫోటోగ్రఫి ...చోటనాయుడు కొత్త ప్రదేశాలు చక్కగ్గా చిత్రీకరించాడు
పాటలు - అను సంగీతం సూపర్ ..ఈ తరానికి ఓ మంచి సంగిత దర్శుకుడు అవుతాడు ....తెర పై మాత్రం అంతంతే
మాటలు - వర్మ రాసిన మాటలు ......సింపుల్ గా సరదాగా ఉన్నాయి .
ఫైట్స్ - కొన్ని భావున్నై ..మరికొన్ని ఫర్వాలేదు .
హాట్ సాంగ్ -వాన పాట కుర్రకారుకు కిక్ ఇస్తుంది ...హీరొయిన్ అందాలు తనివి తీరా చూడవచ్చు
హీరొయిన్ -నవ్వినప్పుడే భావుంది .మాటలకు ఫీలింగ్స్ లేవు .నటన కొంతే .
హాస్యం -ద్వితీయార్దం లో బ్రమ్మానందం ,ఆలి ,ఎం ఎస్ నారాయణ కామిడి .....ఆవరేజ్ .
కథనం - ఆసక్తి ,ఆత్రుత ప్రేక్షకుడికి రాదు .
హీరో -డైలాగ్స్ ,డాన్సు ఫైట్స్ ఓకే .....కాని ఫిజిక్ మారాలి .
గెస్ట్ రోల్ -జయసుధ ,నాగ బాబు
కొత్త విషయం - గుడి చుట్టూ నూట ఎనిమిది సార్లు ప్రదిక్షనాలు చేస్తే కళ్ళు తిరిగి పడతారు కాబట్టి
" ఒన్-నాట్ -ఎయిట్ " అంబులేన్సుకు పేరు పెట్టారు అని చెప్పడం