31, డిసెంబర్ 2010, శుక్రవారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు -మల్లిశ్రీ


కొత్త సంవత్సరం అది తింటే సరి

చంటి -కొత్త సంవత్సరం లో కొత్తగా ఉండాలనుకుంటున్నా ....
ఓ మాంచి సలహా చెప్పారా ? డబ్బు ఆదా అవ్వాలి
బంటి -ఏముంది ? రోజు ఉల్లి దోస తింటావు కదా ..రేపటినుంచి
ప్లైన్ దోస తిను .

30, డిసెంబర్ 2010, గురువారం

రేపే పెళ్ళా .......(జోక్ )

పంతులు -అదేమిటయ్య ...ముహూర్తాలు లేవు అంటుంటే
రేపే పెళ్లి ముహూర్తం పెట్టమంటునారు
భీమయ్య -పంతులు గారు ..కొత్త సంవత్సరం లో బస్సులు ,రైళ్ళు
తిరుగుతాయో లేదో తెలియదు ..ఎలాగు మా వాళ్ళు ఇప్పడు
నిశ్చితార్ధనికి వచ్చారు కాబట్టి రేపు అక్షింతలు వేస్తారు ..

"వావ్ " అనిపించిన సాయికుమార్ ...సామాన్య జనానికి చోట్టివ్వవా ?





నిజం గానే డైలాగ్ కింగ్ వావ్ అనిపించారు .ఈ టి వి లో
వావ్ ప్రసారం అవుతోంది .సాయికుమార్ యాంకర్ గా
ఉన్న ఈ కార్యక్రమం అందరిని ఆకట్టుకుని నేటికి
వంద ఎపిసోడులు పూర్తి చేసుకుంది .ఈ కార్యక్రమం లో
సాయి ఎందరినో సెలబ్రిటిలను పరిచయం చేసారు .ముఖ్యంగా
ప్రముఖ దంపతులను ...ఎక్కడో ఇంట్లోనే కాలక్షేపం చేసే
ప్రముఖులను తీసుకు వచ్చారు .వీరిలో ఎక్కువగా సినిమా
టి వి తారలు ఎక్కువ .సీరియల్ ,ఆయా కొత్త సినిమా టీములను
ఉభయ తారకంగా పరిచయం చేసారు .మధ్యలో సాయి ఎన్నో
మంచి డైలాగ్లు చెబుతున్నారు .అయితే ,బొమ్మాలి పోటిలో
రామోజీ కుమారుడు ..మరొకరు తప్ప మిగతా వారు సక్సెస్
కాకపోవడం వెనుక కారణం సాయి కే తెలియాలి ...అంతేకాదు
సామాన్య జనానికి వావ్ లో చోటు లేక పోవడం ప్రేక్షకులకు
నిరాశ కల్గించే అంశం .కొత్త సంత్సరంలో నైన అవకాశం ఇస్తారేమో
వేచి చూడవలసిందే

29, డిసెంబర్ 2010, బుధవారం

శ్రీ కృష్ణ కమిటి రిపోర్ట్..పూర్తి గా చదివి స్పందించాలి అంటున్న రాజమౌళి

శ్రీ కృష్ణ కమిటి రిపోర్ట్ పూర్తి అర్ధం చేసుకునే వరకు ప్రజలు
ఒక నిర్ణ యానికి రాకూడదని స్టార్ డైరెక్టర్ రాజమౌళి
ప్రజలకు విజ్ఞప్తి చేసారు .తన ట్వి ట్టర్ లో అయన
విషయం గురించి ప్రస్తా వించారు .ఆలాగే మీడియా కూడా
చాల జాగర్త గా వ్యవహరించాలని ..చెబుతూ బాబ్రి తీర్పు
విషయంలో మాదిరిగా ఉండాలని అయన కోరుతున్నారు .

రమ్య కృ ష్ణ మళ్ళి అలరించ బోతుందా ?


రమ్య కృష్ణ మళ్ళి అలరించ బోతున్న వార్త అభిమానులకు
ఆనందం కల్గిస్తోంది .తాజా చిత్రం రంగ ది దొంగ లో ఆమె
పవర్ ఫుల్ పాత్ర పోషించింది .అయెతే ఇప్పటి ఆమె పాత్ర
ను సీక్రెట్గా ఉంచి నేడు హీరో శ్రీకాంత్తో విరివిగా ప్రచారం
చేస్తున్నారు .నరసింహ చిత్రం లో నీలాంబరి పాత్రను
పోలి ఉంటుందని హీరో చెబుతున్నారు .స్టిల్ చూస్తుంటే
రమ్య కు చాల పవర్ఫుల్ పాత్ర ఇచ్చినట్టు కనిపిస్తోంది .
ఆమె కోసం రెండు నెలలు వెయిట్ చేసారట .సినిమా
ఎలా ఉన్న రమ్య కృ ష్ణ ఉన్నంత సేపు ఉద్వేగంగా
ఉంటుందని ....తెలుస్తోంది ...

28, డిసెంబర్ 2010, మంగళవారం

సార్ ఉల్లి ఇస్తే ...(జోక్ )

ఎం ఎల్ - కొత్త సంత్సరంలో జనవరి ఫస్ట్ కి మనం స్వీట్ పంచుతున్నామ కదా .
ఈ సారి ఏ స్వీట్ ఇస్తే బావుంటుందో చూడండి
..పి - సార్ నాదో సలహా ..స్వీట్ బదులుగా ఓ రెండు కేజీల "ఉల్లి పాయలు " ఇస్తే
మన వోటు బ్యాంకు పెరుగుతుంది