22, మార్చి 2011, మంగళవారం

ఆ సినిమా ఇప్పుడు తియ్యాలంటే రెండు వందల కోట్లు -హీరో కృష్ణ (సింహాసన్ లో ఎన్ని విశేషాలు )...కృష్ణకు "బాలు పాట పాడలేదు ?????


" ఈ సినిమా ఇప్పుడు మళ్ళి తియ్యాలంటే రెండు వందల కోట్లు అవ్వవచ్చు .మహేష్ బాబు తో దీనిని రీమేక్ చేసే ఉద్దేశ్యం లేదు " సూపర్ స్టార్ కృష్ణ చెప్పిన మాటలివి ."సింహ సనం " విడుదలై ఇరవై అయిదు సంవత్సరాలు అయిన సందర్బం గా కృష్ణ తన సంతోషాన్ని తెలిపారు .నిజం తెలుగు సిని పరిశ్రమ లో ఆ సినిమా సంచలనం .డైనమిక్ ,డేరింగ్ పదాలకు కృష్ణ తార్కాణం సింహాసనం .ఈ సినిమా లో అన్ని విశేషాలే .

-తెలుగు లో తొలి సివెంటీ ఎం ఎం చిత్రం

-తొలి స్టీరియో ఫోనిక్ సౌండ్

-అత్యదిక బడ్జెట్ (కోటి ఇరవై లక్షలు )

-హిందీ లో రామ్ తేరి గంగ మిరి తర్వాత నటించిన మందాకినీ తెలుగు చిత్రం

-కృష్ణ తొలి దర్శకత్వం (కథ కూర్పు కూడా ఆయెనే )

-అత్యధిక ప్రింట్స్ (నూట యాబై )

-తెలుగు లో బప్పిలహరి తొలి సంగీతం

-రాజధాని లో నాలుగు ఆటలతో తొలి వందరోజులు సినిమా

-విజయవాడ లో ఒకే వారం అత్యధిక కలక్షన్ (ఎనిమిది లక్షలు )

-హిందీ లోను సింహాసన్ పేరు తో విడుదల (హీరో జితేంద్ర )

-వంద రోజుల పండుగకు వేలాదిమంది హాజరు

-"ఆకాశం లో ఒక తార ,.....వంటి బంపర్ హిట్ పాటలను సుశీల తో కల్పి పాడింది మాత్రం మన గాన గంధర్వుడు

ఎస్ పి బాలు కాదు ....రాజ్ సీతారాం ( ఎందుకో బాలుకు కృష్ణ మధ్య భేదాలు వచ్చాయి .కృష్ణ బాలుకు బదులుగా నూనూగు మీసాల కుర్రాడు రాజ్ సీతారం ను సింగర్ గా సెలెక్ట్ చేసాడు .అతని గాత్రం కృష్ణకు సరిగ్గా సరిపోవడం ..ఒక సినిమా తోనే మంచి పేరు వచ్చింది .తర్వాత కొన్ని చిత్రాలకు పాడాడు .గొడవలు సద్దుమణిగి మళ్ళి బాలు కృష్ణకు పాడడం మొదలు పెట్టిన తరవాత ఓ కుర్రాడు మాటు మాయం కావడం ..ఓ సిని మాయ గా చెప్పుకోవచ్చు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి