ఒకే వార్త ఆ రెండు రెండు రకాలుగా ప్రసారం కావడం గమనార్హం .హవాల బ్రోకర్ "హసన్ అలీ " చెప్పిన గుట్టు మాటలకు సంబంధించి ఓ మాజీ ముఖ్య మంత్రి ప్రస్తావన వచ్చింది .అయితే ఆయన ఎవరు ? అన్నదే ప్రశ్న.ఆ మాజీ ఇంకెవరో కాదు అంటూ సాక్షి "చంద్ర బాబు " అని తెల్సేసింది .రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఓ మాజీ సి ఎం విదేశాల్లో దాసిన రెండు వందల కోట్లు కూడబెట్టారని ...ఆ డబ్బును తానె హ్యాండిల్ చేసినట్టు అలీ చెప్పినట్టు సాక్షి కథనం .ఆ పత్రికలో అలీ ..బాబు "నల్ల " గుర్రం అంటూ మొదటి పేజి లో కథనం వచ్చింది .సరిగ్గా తెలుగు దేశం ఆవిర్భావ దినోత్సవం రోజునే ఈ కథనం రావడం విశేషం .
కాగ ఆ మాజీ ముఖ్య మంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి అని చంద్ర బాబు నాయుడు స్వయంగా ఈరోజు ప్రకటన్ చేసారు .సాక్షి వి బూటకపు కథనాలు అని మండి పడ్డారు.బాబు వ్యాఖ్యలు ఆయన చానల్ స్టూడియో -ఎన్ లో ప్రముఖంగా వస్తున్నై .హాసన్ అలీ ని అరెస్ట్ చేయమని తానె చెప్పానని ...విదేశాల్లో ధనం బయటకు తీసుకురావాలని పోరాడు తున్నానని చంద్ర బాబు చెబుతున్నారు ..ఇంతకి ఆ మాజీ సి ఎం ఎవరు ? మనకు నచ్చినట్టు మల్చుకోవడమేనా? అసలు నిజం తెలియాలంటే కేంద్రం తెలియ జేయాలి .ఆ సాహసం కేంద్రం చెయ్యగలదా?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి