26, జులై 2011, మంగళవారం

కత్రిన కైఫ్ కోసం కమలనాధులు పరుగులు


కాంగ్రెస్స్ నేత రాహుల్ గాంధీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించిన నటి కత్రిన కైఫ్ కోసం కమల నాధులు తెగ వెంట పడుతున్నారట .చాల డేరింగ్ గా మాట్లాడిన ఆ సుందరిని పట్టుకుని ప్రసారం చేసుకుంటే తిరుగు లేదు అనుకున్తునారట .ఇప్పటికే ఆ పార్టిలో తారలు శత్రుఘ్న సిన్హా ,వినోద్‌ ఖన్నా ,స్మృతి ఇరానీ ,హేమమాలిని ఉన్నారు .ఇక కత్రిన వస్తే కాంగ్రెస్స్ పై కత్తేనట

25, జులై 2011, సోమవారం

ప్రసారాలు చేసేసుకుంటే పోలే !!

తెలంగాణ సమస్య తేలక పోయిన ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు .అందుకు అందరు సిద్దమే .చంద్ర బాబు తొందర పడుతున్న్నాడు. జగన్ అభ్యర్దులను ప్రకటిస్తునాడు .సి ఏం గారు వరాలు కురిపిస్తున్నారు .ఇక యెంత పుచ్చు కోవాలో ? ..ఓటర్లు తెల్సు కోవాలి ...యెంత ఇచ్చు కోవాలో వీళ్ళు తెల్సు కోవాలి .......ఎన్నికలు కూడా ఆట క్రింద కదా లెక్క ?

23, జులై 2011, శనివారం

సీరియల్స్ లో బాలికలే విలన్లు !!!?

ఇప్పటికే టి వి సీరియల్ లో లేడీ విలనిజం పెరిగి పోయింది .ఆడవాళ్ళను చాల ఘోరంగా చూపుతూ టి వి చూసే జనం పై ప్రభావం చూపుతున్నారు .తాజాగా బాలికలను కూడా చెడ్డ వారిగా చూపిస్తున్నారు .జీ టి లో ప్రసారం అవుతున్న సీరియల్ నందు బాలికను ఏకంగా విలన్ చేసి చెడ్డ పనులు చేసే అమ్మాయిగా చిత్రీకరించారు .రాత్రి సమయంలో ప్రసారం అయ్యే ఇలాంటి వాటిని పొరపాటున పిల్లలు చూస్తె దాని ప్రభావం వారిపై ఉంటుంది .ఇలాంటివి లేకుండా చూడవలసిన బాధ్యత అందరిపై ఉంది .

6, జులై 2011, బుధవారం

."ఆషాడం లో అల్లుడు గారు అత్త ఇల్లు గడప చేరితే ....ఏమవుతుంది అంటే

ఆషాడం లో అల్లుడు అత్తవారి ఇంటికి రా కూడదు అనే ఆచారం ఉంది ."ఆషాడం లో అల్లుడి అత్తవారి ఇల్లు గడప దాటితే ..మామ లేదా అత్తా కు గండం '' అంటూ ఉంటారు ...అయితే ఆచారం పెట్టడం వెనుక పెద్దల లాజిక్ ఉంది .ఆషాడ సమయంలో వర్షాలు కురుస్తాయి . సమయంలో వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉంటాయి .ఇటువంటి సమయంలో పెళ్లి కొడుకు అత్తవారి ఇంటనే ఉంటే ...పనులు ఆగి పోతే ..చాల ఇబ్బంది .మాములుగా రమ్మంటే కొత్త పెళ్లి కొడుకు పెళ్ళాన్ని విడిచి వస్తాడా ? రాదు అందుకే పెద్దలు బెదిరింపు ..సెంటిమెంట్ తో టచ్ చేసారు .
ఆషాడం సాంప్రదాయకం వెనుక మరో కారణం కూడా కనిపిస్తుంది .ఆషాడం అంటే ఇంచుమించు జూలై నెలలో అమ్మాయి గర్బం దాలిస్తే ...ఆమెకు పురుడు మండే ఎందాల్లో వచ్చి ఇబ్బంది పడుతుంది .........ఏది ఎమైనా " పెద్దల మాట చద్ది మూటే"

24, జూన్ 2011, శుక్రవారం

అన్నం వండనని..అమ్మొ,పెళ్ళామో స్ట్రైక్ చేసినట్లు అన్నదాతలు .....

అన్నం వండనని..అమ్మొ,పెళ్ళామో స్ట్రైక్ చేస్తే ఏమి అవుతుంది ? వామ్మో ! ఊహించుకోవడానికే భయం వేస్తుంది ...అలాంటిది పంట పండించి అన్నం పెట్టె అన్నదాతలు ?మేం పండించ లేము ....అని కూర్చుంటే ..ఏముంది ? తినడానికి తిండి కరువు ...పలు జిల్లాల్లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించడం ఆందోళన కల్గించే అంశం .తమ న్యాయమైన కోరికలు తీర్చాలని వారు కోరుతున్నారు .సర్కార్ దీనిపై స్పదించక పోవడం మరి దారుణం .....అన్నదాతల ఆందోళనలు ప్రభుత్వం అర్ధం చేసుకుని సమస్య పరిస్త్కరించాలి .మన దేశం లో ఇప్పటికే పంట పండించే వారు తగ్గి పోతున్నారు ....దీంతో విదేశి ఆదాయం వచ్చే ఎగుమతులు ఆగి మనేమే దిగుమతి చేసుకోవలసిన పరిస్తితి వచ్చింది ,,,,..క్రాప్ హాలిడేలు వస్తే ఇక అంతే సంగతులు !

20, జూన్ 2011, సోమవారం

' సత్య సాయి బాబా ' సినిమా లో ట్రస్ట్ సభ్యుల వ్యహారాలు ఎలా తీయ బోతున్నారు

భగవాన్ గా ప్రసిద్ది చెందిన ' సత్య సాయి బాబా ' సినిమా కోడి రామకృష్ణ తెరకు ఎక్కిన్స్తున్నారు .సత్య సాయి మహిమలు భక్తులు ఆరాధనా ,సాయి గొప్పతనం ఉంటాయి అని ...ఇంటర్ నేషనల్ స్తాయిలో సినిమా తీస్తున్నామని దర్శకుడు కోడి వెల్లడించారు ...మరి సత్య ఆస్తుల గొడవ ఉంటుందా ? ట్రస్ట్ సభ్యుల వ్యహారాలు ఎలా తీయ బోతున్నారు అనే విషయం ఆసక్తి కల్గిన్స్తుంది .....వాటి జోలికి కోడి వెళ్తారా ?

13, జూన్ 2011, సోమవారం

ఫస్ట్ రోజునే స్కూలికి వెళ్లావు ?

తండ్రి -ఏరా ఫస్ట్ రోజునే స్కూలికి వెళ్లావు ? ఏమి చెప్పారు ?
కొడుకు -శుబ్రత -పరిశుబ్రత నేర్పారు నాన్న ....